





Best Web Hosting Provider In India 2024

పశ్చిమ గోదావరిలోఉపాధి హామీ కూలీలపై దూసుకెళ్లిన బోలెరో వాహనం, ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
Road Accident: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగల్తూరు రహదారి వెంబడి పంట బోదెలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై బొలెరో వాహనం దూసుకు వెళ్లడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపైకి అదుపు తప్పిన వాహనం దూసుకు వెళ్లడంతో ఇద్దరు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
బొలెరో వాహనం అదుపు తప్పి ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. మొగల్తూరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మార్గంలో అక్వా ఉత్పత్తులను తరలించే బొలెరో వాహనం అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకుపోయింది. పంట బోదెలో నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించేందుకు ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు. వేగంగా దూసుకు వచ్చిన బొలెరో వ్యాన్ కూలీలపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను అంబులెన్స్ లో నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన వారిని గుబ్బల గంగావతి, కడలి పావనిగా గుర్తించారు. గాయపడిన వారిని గుబ్బల మాణిక్యాలరావు, గుబ్బల సత్యనారాయణగా గుర్తించారు. మొగల్తూరు మండలానికి చెందిన నక్కవారి పల్లి గ్రామానికి చెందిన కూలీలు పంటబోదెలో పనిచేస్తుండగా ప్రమాదం జరిగింది.
ఉపాధి కూలీలపై వ్యాన్ దూసుకెళ్లిన ఘటనపై జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. మొగల్తూరు లో నల్లవారి తోటలో ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ నాగరాణి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. నరసాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే నాయకర్‌తో కలిసి బాధితులను పరామర‌్శించారు.
సంబంధిత కథనం
టాపిక్