Telugu OTT: ఓటీటీలోకి వ‌చ్చిన వెరైటీ టైటిల్ తెలుగు మూవీ – ఐఎమ్‌డీబీలో 8.9 రేటింగ్ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Best Web Hosting Provider In India 2024

Telugu OTT: ఓటీటీలోకి వ‌చ్చిన వెరైటీ టైటిల్ తెలుగు మూవీ – ఐఎమ్‌డీబీలో 8.9 రేటింగ్ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Nelki Naresh HT Telugu

Telugu OTT: తెలుగు మూవీ అగ్రికోస్ ఓటీటీలో రిలీజైంది. బుధ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో రాహుల్‌, టీనా శ్రావ్య హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ రొమాంటిక్ ల‌వ్ డ్రామా సినిమా ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది.

తెలుగు ఓటీటీ

Telugu OTT: తెలుగు రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ అగ్రికోస్ ఓటీటీలో రిలీజైంది. బుధ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అగ్రికోస్ మూవీలో రాహుల్‌, టీనా శ్రావ్య హీరోయిన్లుగా న‌టించారు. జ‌బ‌ర్ధ‌స్థ్ న‌వీన్‌, జెన్నీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. అగ్రికోస్ మూవీ ద్వారా హీరోహీరోయిన్ల‌తో పాటు చాలా మంది కొత్త న‌టీన‌టులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

అన‌గ‌న‌గా ఒక రైతు…

అగ్రికోస్ టైటిల్‌ను అన‌గ‌న‌గా ఒక రైతు అనే క్యాప్ష‌న్‌ను జోడించి మేక‌ర్స్ ఈ మూవీని రిలీజ్ చేశాడు. గ‌త ఏడాది మార్చిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. దాదాపు ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట‌ల్‌తో అందుబాటులోకి వ‌చ్చింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఓటీటీలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

అగ్రిక‌ల్చ‌ర్ చ‌దివి…

అగ్రికోస్ మూవీకి క‌ల‌మ‌ధు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డాక్ట‌ర్‌, ఇంజినీర్ కాకుండా అగ్రిక‌ల్చ‌ర్ చ‌దివి రైతుల‌కు సాయం చేయాల‌ని ఆనంద్ క‌ల‌లు కంటాడు. అగ్రిక‌ల్చ‌ర్ కోర్చులో ఆనంద్‌కు అనుశ్రీ ప‌రిచ‌యం అవుతుంది. గొడ‌వ‌ల‌తో మొద‌లైన వారి స్నేహం ప్రేమ‌గా మారుతుంది. మ‌రో యువ‌కుడితో అనుశ్రీ నిశ్చితార్థం జ‌రుగుతుంది. అనుకు ఆనంద్ దూర‌మ‌వ్వ‌డానికి కార‌ణం ఏమిటి? రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌ను నివారించేందుకు ఆనంద్‌, ఆను ఏం చేశారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఐఎమ్‌డీబీలో…

రైతు అంటే బిచ్చ‌గాడు కాదు ఉత్ప‌త్తిదారుడు అనే మెసేజ్‌తో ద‌ర్శ‌కుడు అగ్రికోస్ సినిమాను రూపొందించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.9 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

అగ్రికోస్ మూవీ త‌ర్వాత క‌మిటీ కుర్రోళ్లు సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్‌గా క‌నిపించింది. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ మూవీ బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సందీప్ స‌రోజ్ భార్య పాత్ర‌లో టీనా శ్రావ్య క‌నిపించింది.

ప్రీ వెడ్డింగ్ షో…

ప్ర‌స్తుతం ప్రీ వెడ్డింగ్ షో అనే తెలుగు మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. తీరువీర్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమాతో పాటు సెలిబ్రిటీ, గేదేల‌రాజుతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేస్తోంది టీనా శ్రావ్య‌.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024