Chalore Chalore Lyrics: ఒక్కో పదం ఆణిముత్యం.. ఆలోచింపజేసే పవన్ కల్యాణ్ జల్సా ఛలోరే ఛలోరే సాంగ్ లిరిక్స్ ఇవే!

Best Web Hosting Provider In India 2024

Chalore Chalore Lyrics: ఒక్కో పదం ఆణిముత్యం.. ఆలోచింపజేసే పవన్ కల్యాణ్ జల్సా ఛలోరే ఛలోరే సాంగ్ లిరిక్స్ ఇవే!

Sanjiv Kumar HT Telugu

Pawan Kalyan Jalsa Chalore Chalore Song Lyrics Telugu: పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా ఎంత పెద్ద హిట్ అయిందో అందులోని సాంగ్స్ కూడా అంతే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ముఖ్యంగా వాటిలో ఆలోచింపజేసే ఛలోరే ఛలోరే సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూద్దాం.

ఒక్కో పదం ఆణిముత్యం.. ఆలోచింపజేసే పవన్ కల్యాణ్ జల్సా ఛలోరే ఛలోరే సాంగ్ లిరిక్స్ ఇవే!

Chalore Chalore Song Lyrics In Telugu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్-డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చి సూపర్ హిట్ అయిన మూవీలో జల్సా ఒకటి. ఇలియానా, పార్వతి మిల్టన్, కమలిని ముఖర్జీ హీరోయిన్స్‌గా నటించారు.

జల్సా సాంగ్స్ చార్ట్ బస్టర్స్

తెలుగు రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరెకక్కిన జల్సా మూవీ 2008లో రిలీజ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన జల్సా మూవీ సాంగ్స్ ఇప్పటికీ చార్ట్ బస్టర్స్ హిట్ అని తెలిసిందే. జల్సా మూవీలోని అప్పట్లో ఒక ఊపు ఊపాయి.

సందర్భానుసారం వచ్చే పాటలు

ఇక కొన్ని పాటలు అయితే ఎంతో అర్థవంతంగా ఆలోచింపజేసేలా అలరించాయి. సందర్భానుసారం వచ్చే ఆ పాటలతో జల్సా మరో స్థాయికి వెళ్లింది. వాటన్నింటిలో స్ఫూర్తినింపేలా, మనిషిగా ఆలోచింజపచేసేలా ఓ పాట ఉంది. అదే ఛలోరే ఛలోరే సాంగ్.

భావాలు ప్రతిబింబించేలా

నక్సలైట్‌గా అడవిలో సంజయ్ సాహు పాత్ర ప్రయాణం చేసే క్రమంలో వచ్చే ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. అప్పుడు పవన్ కల్యాణ్ పడే ఆవేదన, ఎవరికి కనపడని ఆవేశం, చెప్పుకోలేని ఉద్వేగం అన్ని భావాలు ప్రతిబింబించేలా ఈ గీతం సాగుతుంది.

మరి ఈ పాట పాడుకునేలా ఛలోరే ఛలోరే లిరిక్స్ ఇక్కడ చూద్దాం.

ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా..

ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా..

ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..

చంపనిదే బతకవని.. బతికేందుకు చంపమనీ..

నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారేటనీ..

ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..

సంహారం సహజమనీ.. సహవాసం స్వప్నమనీ..

తర్కించే తెలివికి తెలిసినా తానే తన శత్రువనీ..

ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..

నీ పయనం ఎక్కడికే నీకు తెలియాలిగా..

ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా..

ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..

ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే..

వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే..

ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..

అపుడెపుడో ఆటవికం.. మరి ఇపుడో ఆధునికం..

యుగయుగాలుగా ఏ మృగాల కన్న ఎక్కువ ఏం ఎదిగాం..

ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..

రాముడిలా ఎదగగలం.. రాక్షసులను మించగలం..

రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం..

ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..

తారలనే తెంచగలం తలుచుకుంటే మనం..

రవికిరణం చీర్చగలం రంగులుగా మార్చగలం..

ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..

ఇదిలా ఉంటే, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఛలోరే ఛలోరే పాటకు ప్రముఖ గీతారచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. ఒక్కో పదం ఆణిముత్యంలా సీతారామశాస్త్రి రాసిన ఛలోరే ఛలోరే పాటను సింగర్ రంజిత్ ఆలపించారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024