OTT: అక్షయ్ కుమార్ లేెటెస్ట్ సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్

Best Web Hosting Provider In India 2024

OTT: అక్షయ్ కుమార్ లేెటెస్ట్ సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్

Kesari Chapter 2 OTT: కేసరి చాప్టర్ 2 చిత్రం థియేటర్లలో విడుదలయ్యేందుకు రెడీ అయింది. ఈలోగానే ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఏదో వెల్లడైంది. థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్‍కు వస్తుంది.

OTT: అక్షయ్ కుమార్ లేెటెస్ట్  సినిమా వచ్చేది ఈ ఓటీటీలోనే!

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ‘కేసరి చాప్టర్ 2: ది అన్‍టోల్డ్ స్టోరీ ఆఫ్ ది జలియన్‍ వాలాబాగ’ సినిమాపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఈ శుక్రవారం ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. జలియన్ వాలాబాగ్ మారణహోమం గురించి ఈ చిత్రం తెరకెక్కింది. కాగా, ఈ కేసరి చాప్టర్ 2 సినిమా ఓటీటీ హక్కుల గురించి సమాచారం వెల్లడైంది.

ఓటీటీ పార్ట్‌నర్ ఇదే

కేసరి చాప్టర్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్‍స్టార్ ఓటీటీ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. జూన్‍లో ఈ సినిమా జియోహాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.

కోర్ట్‌రూమ్ డ్రామాగా..

హిస్టారిక్ కోర్ట్‌రూమ్ డ్రామా మూవీ కేసరి చాప్టర్ 2 సినిమాకు కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించారు. న్యాయవాది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పటి అధ్యక్షుడు సి.శంకరన్ నాయర్ పాత్రను ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పోషించారు. 1919 జలియన్‍ వాలాబాగ్ మారణహోమాన్ని సృష్టించిన బ్రిటీషర్లకు వ్యతిరేకంగా కోర్టులో పోరాడారు శంకరన్. ఆయన పాత్రనే అక్షయ్ చేశారు. భారత స్వాతంత్య్ర పోరాటం కూడా ఈ మూవీ ఉంటుంది.

కేసరి చాప్టర్ 2 మూవీలో ఆర్.మాధవన్ కూడా కీలకపాత్ర పోషించారు. బ్రిటీషర్ల తరఫున వాదించిన లాయర్ నేవిల్లే మెక్‍కిన్లే క్యారెక్టర్‌ను ఆయన చేశారు. అనన్య పాండే, రెజీనా కసాండ్రా, సైమన్ పైస్లే డే, విశాఖ్ నాయర్, అమిత్ సియాల్ కీలకపాత్రలు పోషించారు.

కేసరి చాప్టర్ 2 మూవీని ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ పతాకాలు నిర్మించాయి. సుమారు రూ.200కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్టు అంచనా. ఈ చిత్రానికి శష్వంత్ సచ్‍దేవ్ సంగీతం అందించారు.

2019లో కేసరి చిత్రం వచ్చింది. బ్రిటీష్ ఆర్మీపై 21 మంది సిక్కు యోధులు పోరాడిన సరాగర్హి పోరాటం చుట్టూ ఈ మూవీ తెరకెక్కింది. అప్పట్లో బ్లాక్‍బస్టర్ అయింది. ఆ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ ఫ్రాంచైజీలో రెండో చిత్రంగా కేసరి చాప్టర్ 2 వస్తోంది. అయితే, సీక్వెల్ మాత్రం కాదు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024