‘డబ్బులు వేస్ట్​ అవ్వకూడదు’ అని కేన్సర్​ బాధితుడి ఆత్మహత్య- భార్యను కూడా చంపి..

Best Web Hosting Provider In India 2024


‘డబ్బులు వేస్ట్​ అవ్వకూడదు’ అని కేన్సర్​ బాధితుడి ఆత్మహత్య- భార్యను కూడా చంపి..

Sharath Chitturi HT Telugu

కేన్సర్​తో బాధపడుతున్న ఓ వ్యక్తి, చికిత్సకు డబ్బులు వృథా చేయకూడదన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు, కలిసి జీవిస్తామని ప్రతిజ్ఞ చేశామంటూ.. ఆత్మహత్య చేసుకునే ముందు భార్యను చంపేశాడు.

ఘజియాబాద్​లో దారుణం..

ఉత్తర్​ప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! తనకు కేన్సర్​ ఉందని తేలడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి, చికిత్సకు డబ్బులు వృథా అవ్వకూడదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు.. తన భార్యను కాల్చి చంపేశాడు.

అసలేం జరిగిందంటే..

యూపీ ఘజియాబాద్​లోని నంద్​గ్రామ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసముంటున్న 57ఏళ్ల వ్యక్తి ఒక ప్రాపర్టీ డీలర్​. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆయన జీవిస్తున్నాడు.

కాగా ఆయనకి కేన్సర్​ ఉందని ఇటీవలే తేలింది. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 11 గంటలకు తన ఇంటి గ్రౌండ్​ ఫ్లోర్​లో తుపాకీతో భార్యను కాల్చి చంపాడు. ఆ తర్వాత తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి అంతస్తులో ఉన్న పిల్లలు తుపాకీ శబ్దానికి ఉల్లిక్కిపడి కిందకు పరిగెత్తారు. అప్పటికే తల్లిదండ్రులు మరణించారు.

ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలిచారు. ఫోరెన్సీక్​ టీమ్​ ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించింది.

ఇంతలో కేన్సర్​ బాధితుడి సూసైడ్​ నోట్​ పోలీసులకు లభించింది.

“ఆ వ్యక్తి కేన్సర్​తో బాధపడుతున్నాడు. బుధవారం తన లైసెన్స్​డ్​ రివాల్వర్​తో తొలుత భార్యను షూట్​ చేసి చంపాడు. ఆ తర్వాత తనని తాను కాల్చుకుని సూసైడ్​ చేసుకున్నాడు. ఘటనాస్థలంలో సూసైడ్​ నోట్​ కనిపించింది. తాను కేన్సర్​తో బాధపడుతున్నానని, కుటుంబానికి భారం అవ్వకూడదని, చికిత్సకు డబ్బులు వృథా అవ్వకూడదని బాధితుడు రాశాడు. వాస్తవానికి తన కుటుంబానికి అసలు తన కేన్సర్​ విషయం తెలియదని సూసైడ్​ నోట్​లో వివరించాడు. చనిపోయే ముందు, తన భార్యని కూడా చంపేశాడు,” అని నంద్​గ్రామ్​ సర్కిల్​ ఏసీపీ పూనమ్​ మిశ్రా తెలిపారు.

కేన్సర్​కి చికిత్స చేసినా బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు భావించిన ఆ 57ఏళ్ల వ్యక్తి, చనిపోవడం ఉత్తమం అని భావించినట్టు సూసైడ్​ నోట్​ ద్వారా తెలుస్తోందని అధికారులు వెల్లడించారు. “కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేశాము” కాబట్టి తనతో పాటు తన భార్యను కూడా తీసుకెళ్లిపోతున్నట్టు బాధితుడు ఆ నోట్​లో రాశాడని వివరించారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link