జనసేనలోకి గ్రేటర్ విశాఖ వైసీపీ కార్పోరేటర్లు, పార్టీ పిఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేరిక

Best Web Hosting Provider In India 2024

జనసేనలోకి గ్రేటర్ విశాఖ వైసీపీ కార్పోరేటర్లు, పార్టీ పిఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేరిక

Sarath Chandra.B HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్‌కి చెందిన పలువురు వైసీపీ కార్పోరేటర్లు జనసేన పార్టీలో చేరారు. ఏపీ సివిల్‌ సప్లైస్ శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.

జనసేనలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‌కి చెందిన పలువురు వైసీపీ కార్పోరేటర్లు జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.

విశాఖ కార్పొరేషన్‌కు చెందిన వైసీపీ కార్పొరేటర్లు గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ కార్పోరేటర్లకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

గ్రేటర్ విశాఖ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు, గాజువాక 74వ డివిజన్ కార్పోరేటర్ తిప్పల వంశీరెడ్డి, గ్రేటర్ విశాఖ వైసీపీ యువజన విభాగం నాయకుడు ఆళ్ల శివ గణేష్‌తో పాటు ఆయ‌న అనుచరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు. 91, 92 డివిజన్ల కార్పొరేటర్లు కుంచె జ్యోత్స్న, బెహరా స్వర్ణలత శివదేవి జనసేనలో చేరుతున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రశాంతి పాల్గొన్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం

టాపిక్

Ap PoliticsAndhra Pradesh NewsTeluguTelugu NewsVisakhapatnamJanasena
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024