



Best Web Hosting Provider In India 2024
ట్రంప్ ఒత్తిడి పని చేసిందా? సుంకాలపై చైనా యూటర్న్ తీసుకోనుందా?
ఇటీవల చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ 245 శాతం వరకు సుంకాలు విధించగా, దీనికి ప్రతిస్పందనగా చైనా అమెరికా వస్తువులపై భారీ సుంకాలు విధించింది. ఈ సుంకాల వివాదం మీద చర్చలు మెుదలుకానున్నట్టుగా తెలుస్తోంది.
సుంకాలకు సంబంధించి అమెరికా, చైనాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పేర్కొన్నారు. చైనా పలుమార్లు అమెరికా అధికారులను సంప్రదించిందని, ఆ తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు ప్రారంభమయ్యాయని ట్రంప్ చెప్పారు. రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కల్లోలం సృష్టించిన సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.
చైనాపై ట్రంప్ కామెంట్స్
అయితే ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తమ వాణిజ్య యుద్ధానికి ముగింపు పలకడానికి ఒక ఒప్పందానికి రాగలవని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ‘అవును, చైనా మమ్మల్ని చాలాసార్లు సంప్రదించింది. వారు మాట్లాడాలనుకుంటున్నారు, మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. కానీ బంతి ఇప్పుడు వారి కోర్టులో ఉంది. చైనాకు అమెరికా మార్కెట్ అవసరమని, న్యాయమైన, పరస్పర ఒప్పందాన్ని ఆశిస్తున్నాం.’అని అన్నారు.
జిన్ పింగ్‌తో మాట్లాడారా?
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో నేరుగా మాట్లాడారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. అమెరికా, చైనా మధ్య అధిక సుంకాల పోటీ నెలకొనడం ప్రపంచ మార్కెట్లలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. వైట్‌హౌస్‌లో ఇటలీ ప్రధాని గియోర్జియా మలోనీతో భేటీ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ చైనాతో మంచి ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా యూరోపియన్ యూనియన్ పై అమెరికా సుంకాలను తొలగించే ప్రయత్నాలపై కూడా ట్రంప్ చర్చించారు.
ఇటీవల చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 245 శాతం వరకు సుంకాలు విధించగా, దీనికి ప్రతిస్పందనగా చైనా అమెరికా వస్తువులపై భారీ సుంకాలు విధించింది. ఈ ఘర్షణ ప్రపంచ మార్కెట్లలో తీవ్ర పతనానికి దారితీసింది. ఇన్వెస్టర్లలో మాంద్యం భయాలను పెంచింది. అయితే ట్రంప్ ఇతర దేశాలకు 90 రోజుల పాటు సుంకాలను 10 శాతానికి పరిమితం చేశారు, కానీ ఈ మినహాయింపు చైనాకు వర్తించలేదు.
చైనా స్పందన
అమెరికాతో ఆర్థిక, వాణిజ్య చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. టారిఫ్ వార్‌ను అమెరికన్ బెదిరింపుగా అభివర్ణించిన చైనా వాణిజ్య యుద్ధానికి భయపడేది లేదని స్పష్టం చేసింది. అమెరికా నిజంగా చర్చల ద్వారా పరిష్కారాన్ని కోరుకుంటే బెదిరింపులు, బ్లాక్ మెయిల్ మానుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. సమానత్వం, గౌరవం, పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Best Web Hosting Provider In India 2024
Source link