





Best Web Hosting Provider In India 2024

క్లైమాక్స్ చూసి నా కొడుకు ఏమన్నాడంటే.. షాకయ్యా: కల్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు
ప్రేక్షకుల ముందుకు దూసుకొచ్చిన లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తోంది. ముఖ్యంగా ఈ మూవీలో క్లైమాక్స్ అదిరిపోయిందనే టాక్ వస్తోంది. ఈ క్లైమాక్స్ పై తన కొడుకు ఒపీనియన్ పై కల్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు వైరల్ గా మారాయి.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ హిట్ తో హీరో నందమూరి కల్యాణ్ రామ్ ఆనందంలో తేలిపోతున్నారు. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినా.. ఎమోషనల్ డ్రామా అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం అసలు ఊహించలేదని పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి క్లైమాక్స్ ను చూడలేదని అంటున్నారు. దీంతో ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ ప్రెస్ మీట్ లో కల్యాణ్ రామ్ కూడా ఈ క్లైమాక్స్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
గర్వంగా ఉందన్నాడు
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ క్లైమాక్స్ పై ఓ రేంజ్ లో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఈ మూవీకి క్లైమాక్స్ బలం అనే కామెంట్లు వస్తున్నాయి. క్లైమాక్స్ లో ట్విస్ట్ సినిమాను నిలబెట్టిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ క్లైమాక్స్ పై తన కొడుకు చెప్పిన మాటలను కల్యాణ్ రామ్ బయటపెట్టారు.
‘‘ఈ రోజు నా కొడుకు మార్నింగ్ షో చూశాడు. ఈ రోజు వరకూ ఇండియన్ సినిమాలో ఇలాంటి సీక్వెన్స్ చూడలేదని చెప్పాడు. స్క్రీన్ మీద అలాంటిది చూస్తున్నప్పుడు నాకు కూడా సర్ ప్రైజింగ్ గా, షాక్ గా అనిపించింది. నా పట్ల గర్వపడుతున్నాని నా కొడుకు నాతో చెప్పాడు’’ అని కల్యాణ్ రామ్ పేర్కొన్నారు.
ఎమోషనల్ డ్రామా
నందమూరి కల్యాణ్ రామ్ లీడ్ రోల్ లో, విజయశాంతి అతని తల్లిగా నటించిన ‘అర్జున్ సనాఫ్ వైజయంతి’ మూవీ శుక్రవారం (ఏప్రిల్ 18) రిలీజైంది. ఈ మూవీ క్లైమాక్స్ లో కల్యాణ్ రామ్ ధైర్యంగా చేసిన అటెంప్ట్ కు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ షాకింగ్ సీక్వెన్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ మూవీలో సాయి మంజ్రేకర్ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఓపెనింగ్ కలెక్షన్లు కూడా గొప్పగా వచ్చే ఛాన్స్ ఉంది.
తల్లీ కొడుకుల మధ్య
ప్రదీప్ చిల్కూరి డైరెక్షన్ లో వచ్చిన ‘అర్జున్ సనాఫ్ వైజయంతి’ మూవీ తల్లీ కొడుకుల మధ్య వార్ గా మొదలై.. చివరకు ఎమోషనల్ బాండింగ్ తో ముగుస్తుంది. విజయశాంతి ఏమో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చాలా రోజుల తర్వాత యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. కల్యాణ్ రామ్ ఏమో ప్రజలకు మేలు చేేసే గ్యాంగ్ స్టర్ గా యాక్షన్ తో అదరగొట్టారు.
ఈ మూవీకి అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ కో ప్రోడ్యూసర్ గా.. సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా సంయుక్తంగా ఈ మూవీ నిర్మించారు. ఈ మూవీలో అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్, చరణ్ రాజ్ తదితరులు యాక్ట్ చేశారు.
సంబంధిత కథనం