





Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial: కార్తీక్ భార్యగా జ్యోత్స్న -వంటలక్కకు శిక్ష వేసిన జడ్జ్ -దశరథ్ సేఫ్ -పారిజాతం అనుమానం
Karthika Deepam 2: కార్తీక దీపం 2 ఏప్రిల్ 19 ఎపిసోడ్లో దశరథ్ స్పహలోకి రావడంలో సుమిత్ర, శివన్నారాయణ ఆనందపడతారు. నువ్వు డిశ్చార్జి అయ్యి ఇంట్లో అడుగుపెట్టే లోపు దీపను జైలుకు పంపిస్తానని తండ్రికి మాటిస్తుంది జ్యోత్స్న.
దశరథ్ స్పృహలోకి వచ్చాడని నర్స్ చెప్పడంతో సుమిత్ర, శివన్నారాయణ ఆనందపడతారు. ఈ సంగతి జ్యోత్స్నకు చెబుతుంది పారిజాతం. సుమిత్ర అని భార్యను దశరథ్ పిలుస్తాడు. ఆ పిలుపు వినగానే నా కొడుకుకు ఏం కాదని శివన్నారాయణ సంతోషపడతాడు. నువ్వు కళ్లు తెరిస్తే ప్రాణం వచ్చినట్లుగా ఉందని పారిజాతం అంటుంది. ఇక దశరథ్కు ఏ ప్రమాదం లేదని డాక్టర్ చెబుతాడు..ఆయన్ని ఎక్కువగా మాట్లాడించవద్దని చెబుతాడు.
దీప జైలులో ఉంటుంది…
డాడీ…నీకు ఏం కాదు…నువ్వు డిశ్చార్జ్ అయ్యే లోపు శిక్ష అనుభవిస్తూ దీప జైలులో ఉంటుంది…ప్రామిస్ అని తండ్రికి మాటిస్తుంది జ్యోత్స్న. దీపను చూడటానికి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరుతారు కాశీ, స్వప్న. ఎక్కడికి వెళుతున్నారని కొడుకు, కోడలిని అడుగుతాడు దాసు. నీకు చెప్పిన అర్థం కాదని కాశీ అంటాడు. తనను రోగం వచ్చినవాడిగా చూడొద్దని, బయటకు వెళ్లనివ్వమని, ఏదైనా పని చెప్పమని కొడుకుపై ఫైర్ అవుతాడు.
జ్యోత్స్న వాళ్ల నాన్న…
జరిగింది చెబితే మావయ్యకు ఏదైనా గుర్తురావొచ్చు అని స్వప్న అంటుంది. దీప చేతిలో గన్ పేలి దశరథ్ గాయపడ్డాడని చెబుతుంది. దశరథ్ ఎవరు అని స్వప్నను అడుగుతాడు దాసు. జ్యోత్స్న వాళ్ల నాన్నగారు అని స్వప్న బదులిస్తుంది.
దీప తండ్రిని దీప ఎలా కాలుస్తుంది…
జ్యోత్స్న పేరు వినగానే…తనపై జరిగిన ఎటాక్ దాసుకు గుర్తొస్తుంది. దీప తండ్రిని దీప ఎలా కాలుస్తుంది. ఇదంతా ఆ రాక్షసి చేసిన కుట్ర అయ్యింటుంది. ఇదంతా అన్నయ్య, వదినలకు చెబుతాను అని గొడవ చేస్తాడు. తండ్రిని బయటకు వెళ్లకుండా ఆపుతాడు కాశీ. రూమ్‌లో పెట్టి తలుపు వేస్తాడు. తండ్రికి మతి భ్రమించిందని ఉంటుందని పొరపడతాడు. ఆ రాక్షసి మా అన్నయ్యను చంపుతుందని, దీప బతకాలని అరుస్తాడు.
దీపను క్షమించి వదిలేయరు…
దశరథ్ స్పృహలోకి వచ్చిన గుడ్‌న్యూస్‌ను కావేరికి చెబుతాడు శ్రీధర్. ఆయన స్పృహలోకి వచ్చాడంటే దీపకు ఏ ప్రమాదం లేనట్లే కావేరి అనుకుంటుంది. దశరథ్ కోలుకుంటే దీపకు ప్రమాదం లేకపోవడం ఏంటి? బతికాడు కదా అని దీపను క్షమించి వదిలేస్తారని అనుకుంటున్నావా అని కావేరితో అంటాడు శ్రీధర్.
ఎంతైనా దీప… కార్తీక్ భార్య కదా అని కావేరి అంటుంది. కాంచన భర్తను…అయినా నన్నే వదలేదు. కార్తీక్ భార్యను ఏం వదులుతారు. దీప ఏ తప్పు చేసి ఉండదని సపోర్ట్ చేసి మాట్లాడుతుంది కావేరి. మీరంతా దీప భజన బృందం సభ్యులను, ఆమెను దేవను చేశారని వెటకారం ఆడుతాడు. దశరథ్ను దీపనే కాల్చిందని చెబుతాడు.
కోర్టులో దీప కన్నీళ్లు…
తప్పు చేశాడని అల్లుడినే కొట్టి తరిమేసిన వాడిని, కొడుకును కాల్చిన దీపను వదిలిపెడతానా అని శివన్నారాయణ అంటాడు. కోర్టులో దీప కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు ఏం పాపం తెలియదని, అమ్మనాన్నలేని అనాథనని వాపోతుందని, గన్ను తాను పేల్చలేదని, దానికి అదే పేలిందని చెబుతుందని యాక్టింగ్ చేసి చూపిస్తాడు శ్రీధర్.
జడ్జి తీర్పు…
అమ్మ వంటలక్క…తెలిసి చేసిన తెలియక చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే…నీకు యావజ్జీవ శిక్ష పడాల్సిందే అని జడ్జి తీర్పు ఇస్తాడు. అది చూసి దీప గుండె పట్టుకొని పడిపోతుంది. కట్ చేస్తే దీప జైలులో ఉంటుంది. నా కొడుకు మనసు మార్చి ఆ జ్యోత్స్నకు ఇచ్చి పెళ్లి చేస్తాడు ఈ శ్రీధర్.
ఇది ఈ కథకు క్లైమాక్స్…ఎలా ఉంది అని శ్రీధర్ అంటాడు. మిమ్మల్ని ఎగిరి తన్నాలని ఉందని కావేరి కోపంగా అంటుంది. మీకు కొంచెం కూడా జాలి, దయ లేవా అని శ్రీధర్‌పై ఫైర్ అవుతుంది. నా బతుకును రోడ్డకు ఈడ్చిన పాపం గట్టిగానే తగిలిందని, ఇక దీప లేనట్లే అని సంబరపడతాడు.
శ్రీధర్ సెలబ్రేషన్స్…
కార్తీక్ తప్పకుండా దీపను కాపాడుతాడని కావేరి అంటుంది. అక్కడున్నది దేశముదుర్లు అని, ఏదో ఒక రోజు దీపకు శిక్ష పడుతుందని, ఆ రోజు మీరు బాధలో ఉంటారు…ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నేను కేక్ ఆర్డర్ పెట్టుకుంటానని వెళ్లిపోతాడు శ్రీధర్. దీప ఏ తప్పు చేయదని, తనకు శిక్ష పడదని మనసులో అనుకుంటుంది.
పారిజాతం అనుమానం…
జ్యోత్స్న సీరియస్‌గా ఆలోచించడం చూసి మనవరాలి దగ్గరకు వస్తుంది జ్యోత్స్న. మీ నాన్న స్పృహలోకి వచ్చినట్లు పోలీసులకు చెప్పావా? వాంగ్ములం తీసుకోవడానికి వస్తున్నారా అని జ్యోత్స్నను అడుగుతుంది పారిజాతం. నాన్న నిజం చెబితేనే కదా దీపకు శిక్ష పడుతుందని జ్యోత్స్న అంటుంది.
నిజం అంటే ఏమిటి అని పారిజాతం అడుతుంది. అందరి ముందు జరిగినదే అని జ్యోత్స్న కోపంగా అంటుంది. దశరథ్ విషయంలో దీపను ఇరికించడానికి నువ్వేం చేయలేదు కదా. లేకపోతే దీప అని పారిజాతం చెబుతోండగా ఆమె మాటలను ఆపేస్తుంది పారిజాతం.
ఏ తప్పు చేయలేదని నమ్మించాలి…
మా అమ్మ, తాత మన మాటలు వింటే అనుమానం నా మీదకు వస్తుందని నానమ్మపై ఫైర్ అవుతుంది. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది అది కాదు. దీప జైలుకు వెళితే బావ లైఫ్‌లోకి నేను ఎలా వెళ్లాలి అన్నది అని జ్యోత్స్న. అలా జరగాలంటే నువ్వు మొదటి నుంచి ఏ తప్పు చేయలేదని కార్తీక్‌ను నమ్మించాలి పారిజాతం అంటుంది. బావను నమ్మించడం సులభం కాదని, పోలీస్ స్టేషన్ దగ్గర కార్తీక్‌తో గొడవ జరిగిందని అంటుంది.
కార్తీక్ భార్యను నేనే…
దీపను కాపాడటానికి కార్తీక్ లాయర్‌ను పెట్టుకున్నాడని, కానీ అతడి కంటే మన లాయర్ సీనియర్ అని జ్యోత్స్న అంటుంది. మన దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయని, దీప ఆటోబయోగ్రఫీ మొత్తం లాయర్ భగవాన్ దాస్‌కు పంపించానని చెబుతుంది. ఇది నాకు అవకాశం కాదని జీవితమని అంటుంది.
దీప జైలుకు వెళితే…కార్తీక్, శౌర్య మిగిలుతారు. అప్పుడు నేను బావకు భార్యను, శౌర్యకు తల్లిని అవుతానని పారిజాతంతో చెబుతుంది జ్యోత్స్న. ఇట్స్ మై టైమ్ అని చెబుతాడు.
నా సపోర్ట్ నీకే..
ఒరేయ్ దాసు…నీ కూతురు నా కంటే డేంజర్‌గా తయారైందని, జ్యోత్స్నను ఆపడం కష్టం, దీని బారి నుంచి దీపను కాపడటం కష్టమని అనుకుంటుంది. నువ్ ఆడుకో…నా సపోర్ట్ నీకే అని చెబుతుంది.
దాసును డాక్టర్‌కు చూపిస్తాడు కాశీ. తనకు ఏం కాలేదని దాసు అంటాడు. దాసుకు మెళ్లగా రికవరీ అవుతున్నాడని డాక్టర్ చెబుతాడు. ఏదో ఒక రోజు పూర్తిగా కోలుకుంటాడని చెబుతాడు.
రాక్షసి అంటే ఎవరు…
మావయ్య రాసే రాతలకు, మాట్లాడే మాటలకు ఏదో సంబంధం ఉందని అంటుంది స్వప్న. దశరథ్, దీప, జ్యోత్స్న, పారిజాతం ఈ నాలుగు పేర్లే కలవరిస్తున్నాడని అంటాడు. మావయ్యకు బుల్లెట్ తగిలిందని తెలియగానే ఆ రాక్షసే చేసి ఉంటుందని కాశీ అంటాడు.
ఆ రాక్షసి అంటే ఎవరు అని కాశీ ఆలోచిస్తాడు. నాన్నకు దెబ్బ తగలడానికి, ఆ ఇంటికి, దీపకు ఏదో సంబంధం ఉందని అనుకుంటారు. కొద్ది రోజులు మావయ్యను వైజాగ్ తీసుకెళితే రికవరీ కావచ్చునని స్వప్న అంటుంది. కాశీ అందుకు ఒప్పుకుంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం