





Best Web Hosting Provider In India 2024

Thug Life OTT: థగ్ లైఫ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే.. థియేటర్ రిలీజ్‌కు ముందే భారీ ధరకు అమ్ముడు పోయిన కమల్ హాసన్ మూవీ!
Kamal Haasan Thug Life OTT Rights: కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఫిక్స్ అయిపోయింది. సుమారుగా రూ. 149.7 కోట్ల భారీ ధరకు థగ్ లైఫ్ ఓటీటీ రైట్స్‌ను డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ కొనుగోలు చేసింది. థగ్ లైఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేస్తే..!
Kamal Haasan Thug Life OTT Rights: లోక నాయకుడు కమల్ హాసన్‌కు ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. విక్రమ్ వంటి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన భారతీయుడు 2 మూవీతో డిజాస్టర్ అందుకున్నారు.
మణిరత్నం దర్శకత్వం
ఇక ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీలో విలన్‌గా నటించి అదరగొట్టారు. ఇప్పుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా థగ్ లైఫ్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అంతేకాకుండా, థగ్ లైఫ్ మూవీలో తమిళ స్టార్ హీరో శింబు, అగ్ర కథానాయిక త్రిష, మరో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ వంటి స్టార్ క్యాస్ట్ ఉంది. దీంతో సినిమాపై మరింత ఎక్స్‍పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే, థగ్ లైఫ్ ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే థగ్ లైఫ్ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి.
థగ్ లైఫ్ ఓటీటీ రైట్స్
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ థగ్ లైఫ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. అది కూడా రూ. 149.7 కోట్ల భారీ ధర వెచ్చించి థగ్ లైఫ్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తమిళనాడు మీడియా పేర్కొంది. ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లోనే థగ్ లైఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే థగ్ లైఫ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అవడం కమల్ హాసన్‌కు ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది.
అలాగే, థగ్ లైఫ్ ఆడియో హక్కులను సారెగామా భారీ రేటుకి సొంతం చేసుకుంది. ఇక తాజాగా థగ్ లైఫ్ సినిమా నుంచి మొదటి సింగిల్ సాంగ్ జింగుచా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జింగుచా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌తో దేశం మొత్తం థగ్ లైఫ్ వైపు చూసింది. ఈ వేడుకల్లో కమల్ హాసన్, మణిరత్నం, ఎ.ఆర్. రెహమాన్ సందడి చేశారు.
కమల్ హాసన్ రాసిన పాట
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, ఆర్. మహేంద్రన్, మద్రాస్ టాకీస్, శివ అనంత్ నిర్మించిన థగ్ లైఫ్ ప్రస్తుతం అందరి అంచనాలను అమాంతం పెంచేసింది. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ‘జింగుచా’ అనే ఫస్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 18న రిలీజ్ చేశారు. ఈ పాటకు కమల్ హాసన్ సాహిత్యాన్ని అందించారు. ఇక రెహమాన్ బాణీ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా ఉంది.
థగ్ లైఫ్ చిత్రాన్ని తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్, ఓవర్సీస్‌లో హోమ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, ఎపీ ఇంటర్నేషనల్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. ఇక నార్త్ ఇండియాలో పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్, తెలుగులో శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. కర్ణాటకలో ఫైవ్ స్టార్ సెంథిల్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది.
ఆస్ట్రేలియా సిడ్నీలో ఈవెంట్
జస్ట్ గ్రో ప్రొడక్షన్స్ సహకారంతో థగ్ లైఫ్ ఫెస్టివల్‌ను కూడా టీం ప్రకటించింది. ఇది మే 23వ తేదీన శుక్రవారం నాడు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ ఈవెంట్ జరగనుంది. ఆ మ్యూజికల్ ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్ కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు. కాగా, థగ్ లైఫ్‌లో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్‌గా నటించారు.
సంబంధిత కథనం
టాపిక్