





Best Web Hosting Provider In India 2024

ఒకే రోజు అటు ఓటీటీలో.. ఇటు టీవీలో.. నితిన్ డిజాస్టర్ మూవీ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? ఎక్కడో చూసేయండి
నితిన్ లేటెస్ట్ మూవీ రాబిన్‌హుడ్ ఓటీటీ స్ట్రీమింగ్ కన్ఫామ్ అయింది. అంతే కాకుండా ఒకే రోజు అటు ఓటీటీలో, ఇటు టీవీలో ఈ ఫిల్మ్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఆ ఓటీటీ ఫ్లాట్ ఫామ్, స్ట్రీమింగ్ డేట్ వివరాలు మీకోసం.
నితిన్-శ్రీలీల కెమిస్ట్రీ.. వెంకీ కుడుముల మార్క్ కామెడీ.. ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డేవిడ్ వార్నర్ క్యామియో.. ఇలా ఎన్నో ఆకర్షణలతో, మరెన్నో అంచనాలతో రిలీజైన రాబిన్‌హుడ్ మూవీ షాకింగ్ రిజల్ట్ ఎదుర్కొంది. కలెక్షన్లు రాబట్టలేక డిజాస్టర్ గా నిలిచింది. నితిన్ కెరీర్ లో మరో ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. ఒకే రోజు అటు ఓటీటీలో.. ఇటు టీవీలో ఈ మూవీ రాబోతోంది.
ఎక్కడంటే?
నితిన్ హీరోగా యాక్ట్ చేసిన రాబిన్‌హుడ్ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను ఫ్యాన్సీ రేట్ కు జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ ఓటీటీలో, టీవీలో ఒకే రోజు రాబోతోంది. ఓటీటీలోనేమో జీ5 ఫ్లాట్‌ఫామ్ లో, టీవీలోనేమో జీ తెలుగులో ఫ్యాన్స్ ను అలరించేందుకు వచ్చేస్తోంది. మూవీ భారీ డిజాస్టర్ గా మిగలడంతో ఒకే రోజు ఓటీటీతో పాటు టీవీలోనూ స్ట్రీమింగ్ కాబోతోంది.
ఎప్పుడంటే?
కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన రాబిన్‌హుడ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా కన్పామ్ అయింది. మే 2న జీ5 ఓటీటీతో పాటు జీ తెలుగు ఛానల్లో ఈ మూవీ వచ్చేస్తుంది. ఒకే రోజు టీవీలో, ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీని తెరకెక్కించేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది. ఆ తర్వాత రెండు సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయిన ఈ ఫిల్మ్ ఆఖరికి మార్చి 28న థియేటర్లకు వచ్చింది. కానీ ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం మేకర్స్ కు తీవ్ర నిరాశను కలిగించింది.
రాబిన్‌హుడ్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్రోడ్యూస్ చేసింది. నితిన్ తో మరోసారి యంగ్ బ్యూటీ శ్రీలీల ఆడిపాడింది. నితిన్ కు ‘భీష్మ’ లాంటి బంపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుముల మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు. రాబిన్‌హుడ్ మూవీకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్.
కథ ఏమిటంటే?
రామ్ (నితిన్) ఒక అనాథ. తను ఉంటున్న అనాథ ఆశ్రమానికి విరాళాలు లేక పిల్లలు తిండికి ఇబ్బంది పడుతుంటారు. ఈ సమయంలో రామ్.. రాబిన్‌హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. రాబిన్హుడ్ను పట్టుకునేందుకు విక్టర్ (షైన్ టామ్ చాకో) రంగంలోకి దిగుతాడు. దాంతో జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో (రాజేంద్ర ప్రసాద్) నడిపే ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు రాబిన్‌హుడ్.
మరోవైపు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) భారత్‌కు వస్తుంది. ఆమె ట్రిప్‌కు సెక్యూరిటీగా నితిన్ బ్యాచ్ అవకాశం రాబట్టుకుంటారు. నీరా వాసుదేవ్ రుద్రకొండ వెళ్తాననడంతో నితిన్ టీమ్ కూడా రక్షణ నిమిత్తం వెళ్తుంది. అక్కడ వీళ్లంతా సామి (దేవదత్తా నాగే) వలలో చిక్కుకుంటారు.
వారి బారి నుంచి నీరాను రాబిన్‌హుడ్ రక్షించాడా? వారిని ఆ సామి ముఠా ఎందుకు పట్టుకుంది? డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటీ? చివరికీ ఏమైంది? అనేదే రాబిన్‌హుడ్ మూవీ.
సంబంధిత కథనం