







Best Web Hosting Provider In India 2024

హైదరాబాద్‌లో శ్రీచైతన్య విద్యా సంస్థల క్రీడోత్సవం
హైదరాబాద్‌లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల క్రీడోత్సవాలు జరిగాయి. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న 640 శ్రీ చైతన్య పాఠశాలలు పాల్గొన్నాయి. మొత్తం 63,919 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ముఖ్య అతిథులు అభినందనలు తెలిపారు.
హైదరాబాద్‌లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల క్రీడోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందుకు భారీగా విద్యార్థులు హాజరయ్యారు. పలు ఆటల్లో రాణించిన గెలిచిన వారికి అతిధులు అభినందనలు తెలిపారు.
ఈ క్రీడా ఉత్సవంలో దేశవ్యాప్తంగా ఉన్న 640 శ్రీ చైతన్య పాఠశాలలు పాల్గొన్నాయి. ఇందులోనూ తెలంగాణలోని 7 జోన్లకు చెందిన 80 బ్రాంచీల మధ్య ఫైనల్స్ నిర్వహించబడ్డాయి. 63,919 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో వాలీబాల్, థ్రోబాల్, బ్యాడ్మింటన్‌తో పాటు అథ్లెటిక్స్ విభాగంలో రన్నింగ్, షాట్‌పుట్ తదితర ఈవెంట్లలో పోటీలు జరిగాయి. విద్యార్థులు తమ ప్రతిభను, క్రీడాస్ఫూర్తిని చాటుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
డా. బి. ఎస్. రావు స్మారక రాష్ట్రస్థాయి క్రీడా పోటీల పేరుతో ఈ నిర్వహించిన ఈ కార్యక్రమానికి శాట్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ) ఛైర్మన్ కె. శివ సేనారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రీడలతో మానసిక ఉత్తేజం పెరుగుతుందన్నారు.ఒత్తిడి లేకుండా చదువుల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్య అతిథులుగా రైల్వే మహిళల వాలీబాల్ జట్టు కోచ్ ఎం.సి. షాజియా, జాతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు గొంగడి త్రిష హాజరయ్యారు. విజేతలకు అభినందనలు తెలిపారు.
గెలుపొందిన విజేతలను శ్రీ చైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సీమ ప్రత్యేకంగా అభినందించారు. శారరీక, మానసికాభివృద్ధికి ఆటలు ఎంతో తోడ్పడుతాయని చెప్పారు. క్రీడలతో విద్యార్థుల అకడమిక్ పనితీరు కూడా మెరుగవుతుందన్నారు.
టాపిక్