OTT Horror Thrillers: ఒకే ఓటీటీలో రీసెంట్‍గా వచ్చిన రెండు హారర్ థ్రిల్లర్లు.. మిస్ అవొద్దు!

Best Web Hosting Provider In India 2024

OTT Horror Thrillers: ఒకే ఓటీటీలో రీసెంట్‍గా వచ్చిన రెండు హారర్ థ్రిల్లర్లు.. మిస్ అవొద్దు!

OTT Horror Thrillers: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రీసెంట్‍గా రెండు హారర్ థ్రిల్లర్లు వచ్చాయి. ఇందులో ఒకటి సినిమా కాగా.. మరొకటి వెబ్ సిరీస్. రెండూ పక్కా థ్రిల్లర్లే. వాటి వివరాలు ఇవే..

OTT Horror Thrillers: ఒకే ఓటీటీలో రీసెంట్‍గా వచ్చిన రెండు హారర్ థ్రిల్లర్లు.. మిస్ అవొద్దు!

హారర్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి రీసెంట్‍గా రెండు ఆప్షన్లు సూటయ్యేలా వచ్చాయి. కామెడీ లేకుండా పక్కా థ్రిల్లర్లుగా ఎంట్రీ ఇచ్చాయి. అందులో ఒకటి సినిమా కాగా.. మరొకటి వెబ్ సిరీస్. హారర్ జానర్లో వచ్చిన ఈ రెండింటింకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇవి రెండు వారాల వ్యవధిలో వచ్చాయి. ఆ రెండు హారర్ థ్రిల్లర్ ఏవంటే..

ఛోరీ 2

హారర్ థ్రిల్లర్ ‘ఛోరీ 2’ సినిమా గత వారం ఏప్రిల్ 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. నాలుగేళ్ల కిందట వచ్చిన ఛోరీకి సీక్వెల్‍గా అడుగుపెట్టింది. ఛోరీ 2 మూవీలో నుష్రత్ బరూచా, సోహా అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోకే ఎంట్రీ ఇచ్చింది.

తన ఏడేళ్ల కూతురిని దుష్టశక్తులు, సామాజిక దురాచారం నుంచి రక్షించేందుకు ఓ తల్లి చేసే ప్రయత్నాలతో ఛోరీ 2 సినిమా సాగుతుంది. హారర్ ఎలిమిమెంట్లతో థ్రిల్లింగ్‍గా ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమాకు విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. నుష్రత్, సోహా అలీ ఖాన్ లీడ్ రోల్స్ చేయగా.. హార్దిక శర్మ, గష్మిర్ మహాజాని కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి అద్రిజ గుప్తా సంగీతం అందించారు. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో హిందీలో చూడొచ్చు. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఖౌఫ్

ఖౌఫ్ వెబ్ సిరీస్ ఈ శుక్రవారం (ఏప్రిల్ 18) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్‍లో మోనికా పవర్, రజత్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‍కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఖౌఫ్ వెబ్ సిరీస్‍కు పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. స్మితా సింగ్ కథ అందించారు. గత గతాన్ని మరిచిరిపోయేందుకు ఓ అమ్మాయి ఢిల్లీలోని ఓ హాస్టల్‍లో చేరడం, ఆ గదికి భయానక గతం ఉండడం, ఆ అమ్మాయికి ఊహించని పరిస్థితులు ఎదురవడంతో ఈ సిరీస్ ఉంటుంది. పక్కా హారర్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రూపొందింది.

మోనికా, రజత్‍తో పాటు ఖౌఫ్ సిరీస్‍లో గీతాంజలి కులకర్ణి, శిల్పా శుక్లా, అభిషేక్ చౌహాన్ కీలకపాత్రలు పోషించారు. సంజయ్ రౌట్రే, సరితా పాటిల్ ఈ సిరీస్‍ను నిర్మించారు. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ ఖౌఫ్ సిరీస్‍ను తప్పకచూడొచ్చు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024