




Best Web Hosting Provider In India 2024
తెలంగాణ ఇంటర్ 2025 ఫలితాలు విడుదలయ్యే తేదీ ఇదే.. ఇలా రిజల్ట్‌ను సింపుల్‌గా తెలుసుకోవచ్చు!
తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బోర్డు నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఫలితాల విడుదల తేదీని అధికారులు ఫిక్స్ చేశారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఫలితాలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫలితాల విడుదలకు సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి.
5 సింపుల్ స్టెప్స్..
1. విద్యార్థులు ఫలితాలను యాక్సెస్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ను సందర్శించాలి.
2. హోమ్‌పేజీలో “టీజీ ఇంటర్ ఫలితాలు 2025” లింక్ ఉంటుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయాలి.
3. “మొదటి సంవత్సరం ఫలితాలు” లేదా “రెండవ సంవత్సరం ఫలితాలు” ఎంచుకోవాలి.
4. రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ వంటి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
5.మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు ప్రయోజనాల కోసం స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేసుకోవాలి.
స్కోర్ కార్డులో ఏముంటాయి..
1.విద్యార్థి పేరు
2.విద్యార్థి హాల్ టికెట్ నంబర్
3.సబ్జెక్టుల వారీగా మార్కులు
4.పొందిన మొత్తం మార్కులు
5.విద్యార్థుల అర్హత స్థితి (పాస్ లేదా ఫెయిల్)
6.డివిజన్ (మొదటి, రెండవ లేదా మూడవ స్థానం)
7.విద్యార్థి పొందిన గ్రేడ్
పరీక్షలు ఇలా..
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 5, 2025 నుండి మార్చి 24, 2025 వరకు జరిగాయి. రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 6, 2025 నుండి మార్చి 25, 2025 వరకు జరిగాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3, 2025 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు జరిగాయి.
విద్యార్థుల లెక్కలు ఇలా..
రాష్ట్రంలో సుమారుగా 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది కాగా.. రెండవ సంవత్సరం విద్యార్థులు 5,08,253 మంది ఉన్నారు. ఈ పరీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,532 కేంద్రాలలో జరిగాయి. మూల్యాంకనం పూర్తయ్యింది. ఫలితాల విడుదల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్