




Best Web Hosting Provider In India 2024
జేఈఈ అడ్వాన్స్డ్ 2025పై బిగ్ అప్డేట్- రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి అంటే..
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన కీలక వివరాలను ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు జరుగుతుంది. పూర్తి వివరాలు..
జేఈఈ మెయిన్స్ సెషన్ 1, సెషన్ 2 ముగియడం, ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు అందరి ఫోకస్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై పడింది. ఈ నేపథ్యంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ 2025పై ఐఐటీ కాన్పూర్ బిగ్అప్డేట్ ఇచ్చింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ 2025 రిజిస్ట్రేషన్ విండోను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు తెరవనునట్టు వెల్లడించింది. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అర్హులైన అభ్యర్థులు jeeadv.ac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 2న రాత్రి 11.59 గంటలకు దరఖాస్తు విండో ముగుస్తుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 5 రాత్రి 11:59 గంటలు అని గమనించాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ 2025- ముఖ్యమైన తేదీలు..
జేఈఈ మెయిన్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్ డ్కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు.
రిజిస్టర్డ్ అభ్యర్థుల ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మే 5
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌కి సమయం: మే 11 నుంచి మే 18 (మధ్యాహ్నం 2:30 గంటల వరకు)
దివ్యాంగులు/ 40 శాతం కంటే తక్కువ వైకల్యం, రాతలో ఇబ్బంది ఉన్న అభ్యర్థులకు స్క్రైబ్ ఎంపిక: మే 17
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష: మే 18 (పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు- పేపర్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు)
అభ్యర్థి సమాధానాల కాపీ: మే 22
ప్రొవిజనల్ ఆన్సర్ కీ: మే 26
ఆన్సర్ కీలో అభ్యంతరాలపై సవాలు: నుంచి 27 (సాయంత్రం 5 గంటల వరకు)
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫైనల్ ఆన్సర్ కీ, రిజల్ట్: జూన్ 2
ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో చదువు కోసం ఏటా జేఈఈని నిర్వహిస్తారు. మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వారికి అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది. అందులో కటాఫ్ దాటిన వారికి వివిధ ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు లభిస్తాయి. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల తర్వాత ఐఐటీ, ఎన్ఐటీ+ సీట్లలో ప్రవేశానికి జోసా కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జూన్ 3న జోసా కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఐఐటీ కాన్పూర్ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) 2025 రిజిస్ట్రేషన్‌ని జూన్ 2న ప్రారంభించి జూన్ 3న ముగియనుంది. జూన్ 5న ఏఏటీ నిర్వహించి జూన్ 8న ఫలితాలను ప్రకటిస్తారు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 దరఖాస్తు ఫీజు (ఇండియన్ నేషనల్స్) మహిళా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1,600. మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.3,200. మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link