OTT Family Drama: నేరుగా ఓటీటీలోకి సుమంత్ ఫ్యామిలీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

OTT Family Drama: నేరుగా ఓటీటీలోకి సుమంత్ ఫ్యామిలీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

OTT Family Drama: సుమంత్ నటించిన ఫ్యామిలీ డ్రామా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీ సోమవారం (ఏప్రిల్ 21) రివీలైంది. చాలా రోజుల కిందటే సినిమాను అనౌన్స్ చేయగా.. ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.

నేరుగా ఓటీటీలోకి సుమంత్ ఫ్యామిలీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Family Drama: సుమంత్ నటించిన ఫ్యామిలీ డ్రామా అనగనగా. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలకుపైనే అయినా.. ఇప్పటి వరకూ పెద్ద హిట్ కొట్టని సుమంత్.. ఈసారి నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో పిల్లలకు కథలు చెప్పే మాస్టారు పాత్రలో అతడు నటిస్తున్నాడు.

అనగనగా ఓటీటీ రిలీజ్ డేట్

సుమంత్ అక్కినేని నటించిన మూవీ అనగనగా. ఈ సినిమాను మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ సోమవారం (ఏప్రిల్ 21) వెల్లడించింది. “పరీక్షల ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? చిల్ అవండి. స్మైల్ ఇవ్వండి. స్మార్ట్ గా రివైజ్ చేయండి. బాగా నిద్రపోండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. అనగనగా ఓ విన్ ఒరిజినల్ మూవీ.. మే 8 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఓటీటీ ట్వీట్ చేసింది.

ఈ సందర్భంగా పరీక్షలు రాసే పిల్లలకు సుమంత్ మూడు టిప్స్ చెబుతున్న వీడియోను కూడా రిలీజ్ చేసింది. అందులో సుమంత్ మాట్లాడుతూ.. “ఒత్తిడి లేని పరీక్ష సీజన్ కోసం మూడు టిప్స్.. చదవడం కోసం ఓ టైమ్ టేబుల్ సెట్ చేసుకోండి. పది గంటలు ఒత్తిడిలో చదవడం కంటే 3 గంటలు ఒత్తిడి లేకుండా చదవండి. నడవండి.. ఓ ఆట ఆడండి.. ఒత్తిడి తగ్గించుకోండి. కేవలం మార్కుల కోసం చదవకండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మార్కులు అవే వస్తాయి” అని సుమంత్ విద్యార్థులకు సూచించాడు.

ఏంటీ అనగనగా మూవీ?

అనగనగా మూవీ టీజర్ గతంలోనే రిలీజైంది. ఆ టీజర్లో సుమంత్ పిల్లలకు అనగనగా అంటూ కథలు చెప్పే మాస్టారుగా కనిపించాడు. సన్నీ సంజయ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. చందు రవి మ్యూజిక్ అందించాడు. ఈ మధ్య ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మిస్తున్న ఈటీవీ విన్.. ఇప్పుడు అనగనగా పేరుతో మరో ఒరిజినల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

పిల్లలకు చదువును ఓ కొత్త పద్ధతిలో చెప్పే టీచర్ పాత్రలో సుమంత్ ఇందులో నటించాడు. కథల రూపంలో చదువు చెబితే పిల్లలకు పాఠాలు సులువుగా అర్థమవుతాయని నమ్మే టీచర్ అతడు. అయితే అతని పద్ధతులను అందరూ హేళన చేస్తుంటారు.

ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించాడు. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఓటీటీ డీల్ తోనే మేకర్స్ కు లాభాలు రావడం విశేషం. ఈ అనగనగా మూవీ మే 8 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024