




Best Web Hosting Provider In India 2024

రక్తంలో చక్కెర స్థాయిలపై నిద్ర ఎలాంటి ప్రభావం చూపుతుంది? డయాబెటీస్ పేషెంట్లు నిద్ర విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
రక్తంలో చక్కర స్థాయిల నియంత్రణపై నిద్ర ఎలాంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా? డయాబెటీస్ బాధితులు నిద్ర విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే ఏం జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం రండి.
రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించాలంటే మనకు సాధారణంగా గుర్తొచ్చేది ఆహారం, వ్యాయామం. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే డయాబెటీస్ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుందని చాలా మందికి తెలుసు. అయితే తాజా పరిశోధనల ప్రకారం షుగర్ వ్యాధి బాధితులు ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమవుతోంది.
నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోతుంది, ఆకలి ఎక్కువవుతుంది. దీని వల్ల ఆహార పరిమితి అదుపులో ఉండదు. ఇవన్నీ కలిపి రక్తంలో గ్లూకోజ్ స్తాయిల్లె హెచ్చు థగ్గులు జరిగే ప్రమాదం పెరుగుతుందట. షాకింగ్ విషయం ఏంటంటే.. కేవలం ఒక్క రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్లే ఇన్సులిన్ స్పందన 25% వరకు తగ్గిపోయే ప్రమాదముందని తాజాగా అధ్యయనం చెబుతోంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నిద్ర ఎలా ప్రభావితం చేస్తుంది?
1. ఇన్సులిన్ సెన్సిటివిటీ
నిద్ర శరీరంలో ఇన్సులిన్‌ను సమర్థంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ ద్వారా గ్లూకోజ్ (షుగర్) కణాల్లోకి ప్రవేశించి, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. నిద్ర సరిపోకపోతే ఇన్సులిన్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. దీన్నే ఇన్సులిన్ సెన్సటివిటీ అంటారు. దీంతో రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి.
2. హార్మోన్ల అసమతుల్యత
నిద్ర లోపం కోర్టిసోల్ (స్ట్రెస్ హార్మోన్), గ్రోత్ హార్మోన్ వంటి హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. ఈ హార్మోన్లు రక్తంలో షుగర్ పెంచవచ్చు. దీని వల్ల ఘ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ పెరుగుతుంది. అలాగే లెప్టిన్ అనే తృప్తి హార్మోన్ తగ్గుతుంది. ఫలితంగా ఆకలి పెరిగి కార్బోహైడ్రేట్లు, షుగర్ ఎక్కువగా తినే అవకాశాలు పెరుగుతాయి.
3. వాపు (ఇన్ఫ్లమేషన్)
నిద్ర తగ్గితే శరీరంలో వాపు లక్షణాలు పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ పనికి అడ్డంకిగా మారుతుంది. దీని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. అంటే షుగర్ కణాల్లోకి వెళ్లడం కష్టమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయి.
4. స్ట్రెస్ రిస్పాన్స్
నిద్ర తగ్గినప్పుడు శరీరంలో కోర్టిసోల్ (స్ట్రెస్ హార్మోన్) స్థాయిలు పెరుగుతాయి. ఇది లివర్ ని గ్లూకోజ్ విడుదల చేయమని సూచిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు నిద్రను ఎలా ప్రభావితం చేస్తాయి?
పెరిగినప్పుడు..
అధిక రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే తేలికపాటి మలవిసర్జన, చెమటలు, తలనొప్పులు వంటి సమస్యలు వస్తాయి. ఇవి నిద్రకు అడ్డంకిగా మారతాయి.
తగ్గినప్పుడు…
రక్తంతో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల రాత్రి పూట మెలకువ వస్తుంది.నిద్ర సరిగ్గా పట్టదు.
బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే నిద్ర విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రోజుకు 7-9 గంటల నిద్రపోవాలని లక్ష్యం పెట్టుకోండి.
- నిద్రపోయే సమయాన్ని ఫిక్స్ చేసుకోండి.అంటే ఒకే సమయంలో నిద్రపోవడం, ఒకే సమయంలో నిద్ర లేవడం అలవాటు చేసుకోండి.
- స్క్రీన్ సమయం, సాయంత్రం కాఫీ తాగడం తగ్గించండి.
- రాత్రిపూట అతిగా ఆహారం తీసుకోవడం మానేయండి. లైట్ ఫుడ్ తీసుకోండి.
- నిద్రను మెరుగుపరిచేందుకు సహాయపడే వ్యాయామాలు చేయండి
- స్ట్రెస్ తగ్గించడానికి యోగా, ధ్యానం వంటివి చేయండి.
సంబంధిత కథనం