




Best Web Hosting Provider In India 2024
పాకిస్థాన్‌లో అయితే 14 ఏళ్ల వైభవ్‌ను తరిమేయమని చెప్పేవాళ్లు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ అరంగేట్రం చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ హిస్టరీ క్రియేట్ చేశాడు. అదే పాకిస్థాన్ లో అయితే ఏమైనా తేడాగా జరిగితే ఆ కుర్రాడిని తరిమేయమని చెప్పేవాళ్లని ఆ దేశ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
14 ఏళ్ల టీనేజర్ ఐపీఎల్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడతాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ వైభవ్ సూర్యవంశీ ఆ అద్భుతాన్ని అందుకున్నాడు. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలో దిగాడు. ఈ లీగ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సు ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. దీంతో ప్రపంచ క్రికెట్ లో ఫోకస్ అయ్యాడు. ఈ క్రికెటర్ పై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.
షాకింగ్ కామెంట్లు
క్రికెటర్ల పట్ల పాకిస్థాన్ వైఖరిపై ఆ టీమ్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ షాకింగ్ కామెంట్లు చేశాడు. ఒకవేళ ఫస్ట్ బాల్ కే వైభవ్ సూర్యవంశీ ఔటై ఉంటే అప్పుడు అతణ్ని తరిమికొట్టమని పాక్ లో అనేవాళ్లని బాసిత్ పేర్కొన్నాడు.
‘‘14 ఏళ్ల బాలుడు వైభవ్ సూర్యవంశీ.. తొలి బంతికే సిక్సర్ కొట్టిన తీరు సాధారణ విషయం కాదు. కానీ తొలి బంతిని సిక్స్ కొట్టే ప్రయత్నంలో అతను ఔటై ఉంటే ఏమయ్యేదో ఊహించండి. పాకిస్తాన్ లో ప్రజలైతే అతణ్ని తరమికొట్టమని అనేవాళ్లు. కానీ ఐపీఎల్ లో ఆడినట్లుగా అతనికి ఆత్మవిశ్వాసం ఇస్తేనే తర్వాత ఫలితాలు వస్తాయి’’ అని బాసిత్ తన యూట్యూబ్ ఛానెల్లో చెప్పాడు.
ఆ ఇండియన్ క్రికెటర్లు
‘‘అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, జైస్వాల్, గిల్ లాంటి ప్లేయర్స్ ను చూడండి. వీళ్లకు ఆత్మవిశ్వాసం, అదరగొట్టేలా తమ బ్యాటింగ్ ను ప్రదర్శించే లైసెన్స్ ఇచ్చిన తర్వాత పెద్ద ఆటగాళ్లుగా మారారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో కలిసి ఆడితే గొప్ప ఆటగాళ్లుగా మారుతారు’’ అని బాసిత్ అలీ పేర్కొన్నాడు. ఈ యువ క్రికెటర్లు ఐపీఎల్ లో సత్తాచాటుతున్న సంగతి తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఫస్ట్ బాల్ కే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో సిక్సర్ తో తన జర్నీ స్టార్ట్ చేశాడు.
ఐపీఎల్ నంబర్ వన్
ఐపీఎల్ తో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను పోలుస్తూ పాక్ మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ లేని గొప్పలు చెప్పుకుంటారు. కానీ బాసిత్ మాత్రం ఐపీఎల్ నంబర్ వన్ అని పేర్కొన్నాడు.
‘‘ఐపీఎల్ ను నంబర్ వన్ అంటే నా పాకిస్తాన్ సోదరులు బాధపడతారు. కానీ వారు సమయాన్ని వృథా చేయడమే. ఈ సీజన్లోనే ఐపీఎల్ లో అపారమైన ప్రతిభను చూడండి. నేహాల్ వధేరా, ప్రియాన్ష్ ఆర్య, అబ్దుల్ సమద్, అశ్వనీ కుమార్.. ముఖ్యంగా మయాంక్ యాదవ్ ను చూడాలనుకుంటున్నా. అతని బౌలింగ్ చూడాలని ఉంది’’ అని బాసిత్ తెలిపాడు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link