





Best Web Hosting Provider In India 2024

Brahmamudi April 22nd Episode: అండర్ కవర్ పోలీస్‌గా రాజ్ – కావ్య ముందు బిల్డప్పులు – ఫిట్టింగ్ పెట్టిన రుద్రాణి
Brahmamudi: బ్రహ్మముడి ఏప్రిల్ 22 ఎపిసోడ్‌లో తాను ఓ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని రాజ్ భ్రమపడతాడు. టెర్రరిస్ట్‌లను పట్టుకునే సీక్రెట్ ఆపరేషన్‌లో గతం మర్చిపోయానని కావ్యతో అంటాడు రాజ్. పోలీసుల ముందు కూడా తాను రాజ్ ఏజెంట్‌నని బిల్డప్‌లు ఇస్తాడు.
Brahmamudi రాజ్ బతికే ఉన్న విషయం బయటపెట్టించడానికి కుట్రపన్నుతుంది రుద్రాణి. ఆఫీస్‌లో రాజ్‌కు సంస్మరణ సభ ఏర్పాటుచేయిస్తుంది. స్టాఫ్ అంతా రేపు మెయిన్ బ్రాంచ్‌కు వచ్చి రాజ్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారని రుద్రాణి అంటుంది.
అందరిని ఒకే చోటికి రప్పించి ఈ కార్యక్రమం నేనే ఏర్పాటుచేయిస్తున్నానని రుద్రాణి చెబుతుంది. చాల్లే ఆపు…బుద్దిలేని గాడిద అని రుద్రాణిపై ఇందిరాదేవి చిరాకు పడుతుంది. అత్తయ్య కాబట్టి మాటలతో సరిపెట్టింది నేనయితేనా అని అపర్ణ కోపంగా అంటుంది. కంపెనీ ఎంప్లాయిస్‌ను కావ్య పంపిచేస్తుంది.
నా కొడుకు బతికే ఉన్నాడు…
రాజ్‌పై ఎంత గౌరవంగా శ్రద్ధాంజలి ఘటించాలని వచ్చిన వాళ్లను ఎందుకు పంపించావని కావ్యపై ఫైర్ అవుతుంది రుద్రాణి. రాజ్ బతికే ఉన్నాడని, తొందరలోనే ఇంటికివస్తాడని నేను చెప్పానుగా…ఏంటి ఇదంతా రుద్రాణిపై కోప్పడుతుంది అపర్ణ. రాజ్ బతికి ఉన్నాడని ఎవరు చెప్పారు…కావ్య చెప్పిందా అని వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాణి.
కొడుకు గురించి తల్లికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నా కొడుకు గురించి ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోమని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. ఆఫీస్ స్టాఫ్‌ను పిలిచి మరి అంక్షింతలు వేసుకోవాలా అని తల్లితో అంటాడు రాహుల్. అంక్షింతలు పడితే పడ్డాయి కానీ నాకు ఓ క్లారిటీ వచ్చిందని రుద్రాణి అంటుంది.
సీన్ క్రియేట్…
కావ్య, అపర్ణ కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారని రుద్రాణి అనుమానపడుతుంది. వాళ్లకు ఏదో నిజం తెలిసిందని, అదేమిటో మనం తెలుసుకోవాలని రాహుల్‌తో అంటుంది. రాజ్ రాకపోతే కంపెనీ మూతపడుతుంది అనే సీన్ క్రియేట్ చేద్దామని అంటుంది.
రాజ్ లేకుండా ఎన్ని ఆఫీస్ పనులు ఆపేయచ్చో అన్ని తెలుసుకోమని కొడుకుకు ఆర్డర్ వేస్తుంది రుద్రాణి. నువ్వు మా వదినను మాయ చేయచ్చు…నన్ను కాదు. నువ్వు దాచిపెట్టిన నిజాలను నీ నోటితోనే బయటపెట్టిస్తానని కావ్యను ఉద్దేశించి రుద్రాణి మనసులో అనుకుంటుంది.
మోడ్రన్ డ్రెస్‌లో
రాజ్ తన స్టైల్ మొత్తం మార్చేశాడు. మోడ్రన్ డ్రెస్‌లో వస్తాడు. ఏంటి స్టైల్ మార్చేశారు అని రాజ్‌ను అడుగుతుంది కావ్య. నేను ఎవరో తెలిసిపోయింది. గతం మొత్తం గుర్తొచ్చిందని రాజ్ అంటాడు. మీకు ఏం తెలిసిందని సంతోషంగా రాజ్‌ను అడుగుతుంది కావ్య. ఒకప్పుడు తాను సీక్రెట్ ఏజెంట్‌నని రాజ్ అంటాడు. నిన్ను మీరు పంపించిన డ్రెస్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌వారు పంపించారు కదా అని అంటాడు. ఐయామ్ రామ్ మనోహర్…రా ఏజెంట్ అని రాజ్ చెబుతాడు. తన డ్యూటీ గురించి చాలా చెబుతాడు. చాలా కష్టపడి దేశం గర్వించే సీక్రెట్ ఏజెంట్‌ను అయ్యానని గొప్పలకు పోతాడు.
ఇదే నిజం…
మీకు ఇలా రోజు అనిపిస్తుందా…అప్పుడప్పుడు అనిపిస్తుందా రాజ్‌ను అడుగుతుంది కావ్య. అనిపించడం ఏంటిఇదే నిజం అని రాజ్ కోపంగా అంటాడు. షర్ట్‌ను అప్పు కొరియర్ చేయడం వల్ల వచ్చిన తిప్పలు ఇవని కావ్య అనుకుంటుంది.
కావ్యను కూడా సీక్రెట్ ఏజెంట్‌గా రాజ్ పొరపడతాడు. గతంలో ఇద్దరం కలిసి ఏన్నో క్రైమ్ ఆపరేషన్స్ చేశామని, ప్రాణాలకు తెగించి ఎంతోమంది టెర్రరిస్ట్‌లను పట్టుకున్నామని బిల్డప్‌లు ఇస్తాడు. రాజ్ ఎలివేషన్లు చూసి కావ్య షాకవుతుంది. టెర్రరిస్ట్‌లను పట్టుకునే ఆపరేషన్‌లో గతం మర్చిపోయానని, చాలా రోజులు కోమాలు ఉన్నానని అంటాడు.
కావ్య జోకు…
మీరు నాతో కలిసి పనిచేసిన ఆఫీసర్ కాబట్టి నా ఫ్లాష్‌బ్యాక్ బయటపడకుండా నన్ను కాపాడుతున్నారని కావ్యతో రాజ్ చెబుతాడు. గతం మర్చిపోయినా అన్ని భలే కనిపెట్టారని కావ్య జోకులు వేస్తుంది.
మరి ఏమనుకుంటున్నావు ఈ రామ్ అంటే…చిన్న క్లూ ఇస్తే గతాన్ని తవ్వుకుంటూ వెళ్లిపోతానని రాజ్ అంటాడు. ఇప్పటికైనా ఇదే నిజం అని ఒప్పుకుంటారా, ఇంకేమైనా దాచాలని అనుకుంటున్నారా అని కావ్యతో సీరియస్‌గా చెబుతాడు రాజ్. మీరు నిజంగానే సీక్రెట్ ఏజెంట్ అని, తన పేరు కళావతి నాయర్ అని కావ్య కూడా రాజ్ జోక్‌ను కంటిన్యూ వేస్తుంది.
సీక్రెట్ తెలుసుకున్న రాజ్…
తనను ఆఫీస్ దగ్గర దించమని రాజ్‌ను కోరుతుంది కావ్య. రాజ్ అందుకు ఒప్పుకుంటాడు. ఏదైనా రెస్టారెంట్‌లో లంచ్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని ఆఫీస్‌లో దించేసి…ఆ తర్వాత మా ఇంటికి వెళ్లిపోతానని రాజ్ అంటాడు. కావ్య అందుకు ఒప్పుకుంటుంది. ఆఫీస్‌లో పనిచేసే సంజయ్ అనే ఎంప్లాయ్‌కు రాహుల్ ఫోన్ చేస్తాడు. రాజ్ లేకపోవడం వల్ల ఆఫీస్‌లో చాలా డీలింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయటగా నిజమేనా అని అడుగుతాడు. వాటిని కావ్య మేడమ్ చూసుకుంటున్నారని సంజయ్ అంటాడు.
డబ్బు ఆశ చూపించి…
మీకు కంపెనీ సీక్రెట్స్ చెబితే కావ్య మేడమ్ నాపై సీరియస్ అవుతారని సంజయ్ అంటాడు. అతడికి డబ్బు ఆశ చూపిస్తాడు రాహుల్. నువ్వు నాకు ఇర్ఫర్మేషన్ ఇచ్చినట్లు మూడో కంటికి తెలియకుండా దాచిపెడతానని అంటాడు. రా మెటీరియల్ ఇచ్చేవాళ్లకు రెండు కోట్లు కంపెనీ అప్పు ఉన్న సంగతి బయటపెడతాడు. ఈ ఇన్ఫర్మేషన్ చాలని రాహుల్ అంటాడు. ఈ విషయం మమ్మికి చెబితే తనే చూసుకుంటుందని అనుకుంటాడు.
దొంగను పట్టుకున్న రాజ్….
కావ్యతో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళతాడు రాజ్. అక్కడ ఫోన్ మాట్లాడుతున్న అమ్మాయి పర్స్‌ను కొట్టేయడానికి దొంగ ప్రయత్నిస్తాడు. ఆ దొంగను రాజ్ పట్టుకుంటాడు. ఓ పోలీస్ ఆఫీసర్ ముందే దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తావా అని దొంగను కొడతాడు.
మీరు పోలీస్ ఏంటి? ఈ మాట పోలీసులతో అంటే నా కంటే ముందే మిమ్మల్ని ఆరెస్ట్ చేస్తారని దొంగ అంటాడు. తాను అండర్ కవర్ పోలీస్‌నని, రామ్ మనోహర్ ఐపీఎస్ అని రాజ్ బిల్డప్‌లు ఇస్తాడు. అక్కడున్న అమ్మాయి కూడా రాజ్ నిజంగానే పోలీస్ ఆఫీసర్ అని నమ్ముతుంది. మీలాంటి ఆఫీసర్ల వల్ల మేము ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని చెబుతాడు.
అండర్ కవర్ పోలీస్…
అక్కడికి నిజంగానే పోలీసులు వస్తారు. వారిని చూడగానే ఇదేనా మీరు పబ్లిక్‌కు ఇచ్చే రక్షణ అని వారికి క్లాస్ ఇస్తాడు రాజ్. వాడి సంగతి మేము చూసుకుంటాం కానీ ముందు నువ్వు ఎవరు రాజ్‌ను అడుగుతాడు పోలీస్ ఆఫీసర్. నువ్వు కాదు మీరు అని పిలవాలి. నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని రాజ్ అంటాడు.
తాను రా ఏజెంట్‌నని, అండర్ కవర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానని బిల్డప్‌లు ఇస్తాడు. పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉన్న గన్ తీసుకొని అన్‌లాక్‌లో పెడితే ప్రమాదమని అంటాడు. ఇప్పటివరకు లాక్‌లో ఉందని, ఇప్పుడు మీరే అన్‌లాక్ చేశారని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. అండర్ కవర్ ఆఫీసర్లు ఎవరు ఇలా డైరెక్ట్‌గా చెప్పరని పోలీస్ ఆఫీసర్ అనుమానంగా అంటాడు.
ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా కాదు…
పోలీసులను బతిమిలాడి పంపిస్తుంది కావ్య. ఆ తర్వాతే రాజ్‌కు అసలు నిజం చెబుతుంది. మీరు సీక్రెట్ ఏజెంట్ సంగతి పక్కన పెడితే కనీసం ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదని కావ్య అంటుంది. అంత బిల్డప్ ఇస్తుంటే ఎందుకు నిజం చెప్పలేదని, కొంచెం ఉంటే బుల్లెట్ తన గుండెలో దిగిపోయేదని రాజ్ కంగారుపడతాడు.
పాకిస్థాన్ బోర్డర్‌లో ఫైట్…
మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే పాకిస్థాన్ బోర్డర్‌కు వెళ్లి ఫైట్ చేసేలా ఉన్నారని కావ్య క్లాస్ ఇస్తుంది.
కొరియర్ పోలీసుల నుంచి ఎందుకొచ్చిన కావ్యను అడుగుతాడు రాజ్. తన చెల్లెలు పోలీస్ ఆఫీసర్ అని, తనే ఆ కొరియర్ మీకు పంపించిందని రాజ్‌కు అసలు సంగతి చెబుతుంది కావ్య.
డెత్ సర్టిఫికెట్…
రాహుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా రా మెటిరియల్ కంపెనీ సప్లయర్స్‌ను ఇంటికి వచ్చేలా చేస్తుంది రుద్రాణి. తమకు ఇవ్వాల్సిన రెండు కోట్లు ఇప్పుడే కావాలని వారు పట్టుపడతారు. రాజ్ చనిపోయాడు కాబట్టి డెత్ సర్టిఫికేట్ తీసుకొని కావ్య పేరు పవర్ ఆఫ్ అటార్నీ చేయాలని రుద్రాణి అంటుంది. రాజ్ బతికి ఉంటే ఇప్పుడే పిలిపించమని, లేదంటే డెత్ సర్టిఫికేట్ మీద సంతకం చేయమని అపర్ణతో అంటుంది రు9ద్రాణి. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం