





Best Web Hosting Provider In India 2024

రిజల్ట్ ఎలా వస్తేనేం.. ఆత్మహత్య వద్దు.. స్పూర్తి కలిగించే ఒకే ఒక జీవితం సాంగ్ లిరిక్స్
ఇది పరీక్ష ఫలితాల సమయం. తక్కువ మార్కులు వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ రిజల్ట్ ఎలా వస్తేనేం.. ఆత్మహత్య మార్గం కాదు. స్పూర్తి నింపే ఈ సాంగ్ లిరిక్స్ ఒక్కసారి చూసేయండి.
ఎవరి జీవితం వాళ్లదే. ఒకరిని చూసి పోల్చుకోవడం.. ఎవరో ఏదో అనుకుంటున్నారని కుమిలిపోవడం అనవసరం. ఎవరికో సమాధానం చెప్పాల్సి వస్తుందని జీవితాన్ని చేజేతులా ముగించుకోవడం తెలివి తక్కువ పని. పరీక్షల ఫలితాలతో, ఫెయిల్ అయ్యామనే అవమానంతో తనువు చాలించడం సరికాదు. ఆత్మహత్య వద్దూ అంటూ స్ఫూర్తి నింపే ఈ సాంగ్ ను ఒక్కసారి వినండి. లిరిక్స్ ఒక్కసారి పాడండి. ఆలోచనలు పక్కనపెట్టండి.
మార్చే సాంగ్
కొన్ని పాటలు ఆనందాన్నిస్తాయి. కొన్ని పాటలు ఆలోచింపజేస్తాయి. కొన్ని పాటలు మాత్రం జీవితాలనే మారుస్తాయి. 2014లో వచ్చిన ‘మిస్టర్ నూకయ్య’ మూవీలోని ‘ఒకే ఒక జీవితం’ సాంగ్ కూడా జీవితాన్ని మార్చే పాటనే. ఈ సాంగ్ లిరిక్స్ లో ఎంతో అర్థం ఉంది.
ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చారు. హరిచరణ్ అంతే గొప్పగా పాడారు. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఈ మూవీని అనిల్ కన్నెగంటి డైరెక్ట్ చేశారు.
లిరిక్స్ ఇవే
పల్లవి:
ఒకే ఒక జీవితం ఇది
చెయ్యి జారిపోనీకు
మళ్ళీ రాని ఈ క్షణాన్ని
మన్నుపాలు కానీకు
కష్టమనేది లేని
రోజంటూ లేదు కదా
కన్నీరు దాటుకుంటు
సాగిపోగ తప్పదుగా
హో.. ఓ.. ఓ.. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు
హో.. ఓ.. ఓ.. ఆనందం కోసమే ఈ పరుగు
హో.. ఓ.. ఓ.. కష్టాల బాటలో కడ వరకు
హో.. ఓ.. ఓ.. చిరునవ్వు వదలకు
చరణం 1:
నువ్వెవరు.. నేనెవరు
రాసినదెవరు మన కథలు
నువ్వు నేను చేసినవా
మన పేరున జరిగే పనులు
ఇది మంచి అని అది చెడ్డదని
తూకాలు వెయ్యగల వారెవరు
అందరికి చివరాకరికి
తుది తీర్పు ఒక్కడే పైవాడు
అవుతున్న మేలు, కీడు..
అనుభవాలేగా రెండు
దైవం చేతి బొమ్మలేగా
నువ్వు నేను ఎవరైనా
తలో పాత్ర వెయ్యకుంటే
కాలయాత్ర కదిలేనా
హో.. ఓ.. ఓ.. నడి సంద్రమందు దిగి నిలిచాకా
హో.. ఓ.. ఓ.. ఎదురీదకుండ మునకేస్తావా
హో.. ఓ.. ఓ.. నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని
హో.. ఓ.. ఓ.. అద్దరికి చేర్చవా
చరణం 2:
పుట్టుకతో నీ అడుగు
ఒంటరిగా మొదలైనదిలే
బతుకు అనే మార్గములో
తన తోడెవరు నడవరులే
చీకటిలో నిశి రాతిరిలో
నీ నీడ కూడా నిను వదలునులే
నీవారు అను వారెవరు
లేరంటూ నమ్మితే మంచిదిలే
చితి వరకు నీతో నువ్వే
చివరంట నీతో నువ్వే
చుట్టూ ఉన్న లోకమంత
నీతో లేనే లేదనుకో
నీ కన్నుల్లో నీరు తుడిచే
చేయి కూడా నీదనుకో
హో.. ఓ.. ఓ.. లోకాన నమ్మకం లేదసలే
హో.. ఓ.. ఓ.. దాని పేరు మోసమై మారేనులే
హో.. ఓ.. ఓ.. వేరెవరి సాయమో ఎందుకులే
హో.. ఓ.. ఓ.. నిన్ను నువ్వు నమ్ముకో
సంబంధిత కథనం