




Best Web Hosting Provider In India 2024

జుట్టు పెరగడం కోసం సహజమైన నూనెలు కావాలా? ఇదిగోండి వీటిని ఇలా వాడారంటే బెస్ట్ రిజల్ట్!
ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా సహజంగా వెంట్రుకలు ఎదగాలని అనుకుంటున్నారా? అయితే ఈ నూనెలు మీ కోసమే. ఈ నాచురట్ హెయిర్ ఆయిల్స్ మీ వెంట్రుకలు బలంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడతాయి.
పొడవైన, ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టును పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కాలుష్యం, ఒత్తిడి, రసాయనాలతో కూడిన ఉత్పత్తుల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా వేలకు వేలు ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన సహజ నూనెలను అందించింది.వీటిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడమే కాకుండా, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి సహజమైన మెరుపును, మృదుత్వాన్ని పెంచుతాయి. మరి జుట్టు పెరుగుదలకు సహాయపడే ఆ ఉత్తమమైన సహజ నూనెలు ఏంటి? వాటిని ఎలా ఉపయోగించాలి? తెలుసుకుందాం రండి.
జుట్టు పెరుగుదలకు ఉత్తమమైన సహజ నూనెలు
కొబ్బరి నూనె (Coconut Oil):
ఇది జుట్టు కుదుళ్లలోకి సులభంగా చొచ్చుకుపోతుంది. జుట్టు ప్రోటీన్‌ను కోల్పోకుండా చేస్తుంది, అలాగే ఎదుగుదలకు కావాల్సిన తేమను అందిస్తుంది. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ (lauric acid) శిలీంధ్రాలను (fungi) నిరోధించే లక్షణాలను కలిగి ఉంటుంది. మొత్తం మీద ఇది తల, వెంట్రుకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ఆముదం నూనె (Castor Oil):
ఇందులో ఉండే రిసినోలిక్ యాసిడ్ తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ఇది తలను తేమగా ఉంచి, జుట్టును బలంగా, ఆరోగ్యంగా మార్చుతుంది.
రోజ్మేరీ నూనె (Rosemary Oil):
ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇందులో జుట్టు రాలడాన్ని నివారించే శక్తి కలిగిన మినోక్సిడిల్ కలిసి ఉంటుంది.ఇది వెంట్రుకలు రాలకుండా కాపాడటంతో పాటు బలంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీంట్లో వాపును తగ్గించే గుణాలు కూడా చాలా ఉన్నాయి. ఇది తలకు, వెంట్రుకలకు చాలా రకాలుగా మేలు చేస్తుంది.
ఆర్గాన్ నూనె (Argan Oil):
విటమిన్ ఇ, కొవ్వు ఆమ్లాలతో నిండిన ఈ నూనె జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడుతుంది. సాగే గుణాన్ని మెరుగుపరుస్తుంది అలాగే కుదుళ్ల నుంచి బలంగా తయారు చేస్తుంది.
జోజోబా నూనె (Jojoba Oil):
ఈ నూనె వెంట్రుకలు సహజంగా ఎదిగేందుకు సహాయపడే సెబమ్ లా పని చేస్తుంది. ఇది తలను జిడ్డుగా చేయకుండా జుట్టుకు మంచి తేమను అందిస్తుంది. ఇది వెంట్రుకలు చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలను తగ్గించి ఆరోగ్యంగా, ఒత్తుగా ఎదిగేందుకు సహాయపడుతుంది.
ఆలివ్ నూనె (Olive Oil):
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఆలివ్ నూనె జుట్టును బలపరుస్తుంది, నష్టం నుండి రక్షిస్తుంది అలాగే వెంట్రుకలకు సహజమైన మెరుపును ఇస్తుంది.
బాదం నూనె (Almond Oil):
విటమిన్ ఇ ఎక్కువగా ఉండటం వల్ల, ఇది జుట్టుకు మంచి పోషణనిస్తుంది, బలపరుస్తుంది. తద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
అవకాడో నూనె (Avocado Oil):
ఇందులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు జుట్టును చక్కగా పోషిస్తాయి, మృదువుగా మార్చుతాయి. తద్వారా చిక్కులు పడటం, చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ఈ నూనెలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి?
తలకు నూనె పెట్టామా లేదా అన్నట్లుగా కాకుండా సరైన పద్ధతిలో పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది. సహజమైన కాంతిని, మృదుత్వాన్ని పొందుతుంది. తలకు నూనెను ఎలా పట్టించాలి, ఏం చేయాలి తెలుసుకుందాం రండి.
- మీ జుట్టు పొడవు, మందం ప్రకారం కొద్ది మొత్తంలో నూనెను తీసుకోండి (కొన్ని చుక్కల నుండి ఒక టేబుల్ స్పూన్ వరకు).
- తర్వాత నూనెను మీ చేతుల్లో వేసుకుని రెండు చేతులు కలిపి రుద్దండి. ఇలా చేతుల్లో వేసి రుద్దడం వల్ల నూనె కాస్త వేడెక్కుతుంది. దీన్ని తలకు పట్టిస్తే అది ప్రభావవంతంగా పని చేస్తుంది.
- ఇప్పుడు నూనెను నేరుగా మీ తలకు పట్టించండి, ముఖ్యంగా పలుచబడిన ప్రదేశాలలో లేదా మీరు జుట్టు పెరుగుదలను ప్రేరేపించాలనుకునే చోట చక్కగా అప్లై చేయండి.
- ఇలా తలంతా నూనెను అద్దుతూ 5-10 నిమిషాలు మర్దన చేయండి, ఇలా చేయడం వల్ల తలలో రక్త ప్రసరణను పెరుగుతుంది.
- నూనె రాసుకున్న వెంటనే తలస్నానం చేయకుండా కనీసం 30 నిమిషాలు లేదా మరింత లోతైన పోషణ కోసం రాత్రంతా నూనెను అలాగే ఉంచండి.
- తరువాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. నూనె పూర్తిగా తొలగించడానికి మీరు రెండుసార్లు షాంపూ చేయవలసి ఉంటుంది.
- ఉత్తమ ఫలితాల కోసం వారానికి 1-2 సార్లు ఇలా చేయండి.
సంబంధిత కథనం