





Best Web Hosting Provider In India 2024

Pope Francis Death: పోప్ ఫ్రాన్సిస్ మారడానికి కారణమైన వ్యాధి ఇదే, ఊపిరితిత్తులను బలహీనపరిచి చంపేస్తుంది
Pope Francis Death: పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యం కారణంగా మరణించారు. అతనికి ఊపిరితిత్తుల వ్యాధి తీవ్రంగా మారడంతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీన్ని బైలేటరల్ నిమోనియా అంటారు.
పోప్ ఫ్రాన్సిస్ మరణానికి కారణమైన వ్యాధి బైలేటరల్ నిమోనియా. వాటికన్ సిటీ సోమవారం ఒక వీడియో ప్రకటనలో పోప్ ఫ్రాన్సిస్ మరణించిన సంగతిని ప్రకటించింది. అతను బైలేటరల్ నిమోనియా అని పిలిచే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారని ఆ కారణంగానే ఆసుపత్రిలో చేరారని తెలిపింది. ఈ వ్యాధి కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి మరణం సంభవిస్తుంది.
బైలేటరల్ నిమోనియా అంటే ఏమిటి?
నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ వ్యాధి. దీనివల్ల చీము, ద్రవంతో ఊపిరితిత్తులు నిండిపోతాయి. శ్వాస తీసుకోవడంలో ఆ రోగికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అయితే ఎక్కువగా ఒక ఊపిరితిత్తిలోనే ఈ నిమోనియా అధికంగా వస్తూ ఉంటుంది. కానీ కొందరిలో రెండు ఊపిరితిత్తుల్లో కూడా నిమోనియా సోకుతుంది. దీన్నే బైలేటర్ నిమోనియా అంటారు. ఈ స్థితిలో రెండు ఊపిరితిత్తులు చెడిపోతాయి. తగినంత ఆక్సిజన్ శరీరానికి అందదు. రక్తంలో కూడా ఆక్సిజన్ కరువైపోతుంది. దీనివల్ల ఆ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి మరణానికి చేరువవుతాడు.
సాధారణ న్యుమోనియా కంటే ప్రమాదకరం
సాధారణ న్యుమోనియాతో పోలిస్తే బైలేటరల్ న్యూమోనియా చాలా ప్రమాదకరమైనది. సాధారణ న్యుమోనియా వస్తే సరైన చికిత్స సమయానికి అందించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. కానీ బైలేటరల్ న్యుమోనియా వస్తే చికిత్స కూడా కష్టతరంగా మారుతుంది. శరీరం పూర్తిగా ఆక్సిజన్‌ను పొందలేక పోతుంది. బైలేటరల్ నిమోనియా బాధ బారిన పడినవారు శ్వాస తీసుకోలేకపోతారు. ఊపిరితిత్తులు ఉబ్బిపోతాయి. ఇది ఎక్కువగా గుర్తులు చిన్న పిల్లలని ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
బైలేటరల్ న్యుమోనియా లక్షణాలు
బైలేటరల్ న్యుమోనియా సోకిన వ్యక్తుల్లో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. విపరీతంగా దగ్గు వస్తుంది. ఆ దగ్గుతో పాటు కఫం కూడా పడుతుంది. ముక్కుదిబ్బడ కట్టి ఊపిరాడడం కష్టంగా అనిపిస్తుంది. చాతిలో నొప్పి కలుగుతుంది. తీవ్రమైన అలసటగా అనిపిస్తుంది. జ్వరం, విపరీతంగా చలివేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరానికి చెమటలు పడతాయి. హృదయం స్పందన వేగంగా మారుతుంది. విరేచనాలు, వాంతులు వంటివి కనిపిస్తాయి.
బై లెటర్ నిమోనియాకు చికిత్స
ఈ న్యుమోనియా సోకిన వారికి అది ఏ స్థాయిలో ఉందో ఎంత తీవ్రంగా ఉందో ముందుగా తెలుసుకొని అప్పుడు చికిత్సను ఆరంభిస్తారు వైద్యులు. ఆ వ్యాధి తీవ్రత పైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇలాంటి బాక్టీరియల్ న్యుమోనియాకు యాంటీబయోటిక్స్ అందిస్తారు. అలాగే వైరల్ నిమోనియా అయితే యాంటీ వైరల్ మందులను అందిస్తారు. శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ ను అందిస్తారు. రోగి కచ్చితంగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. కొన్నిసార్లు వెంటిలేటర్ మీదే ఉండాల్సి వస్తుంది. బైలేటరల్ న్యుమోనియా అనేది ప్రమాదకరమైన వ్యాధిగానే చెప్పుకోవాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం