Aamir Khan on Mahabharatha: మహాభారతం ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‍డేట్స్ చెప్పిన ఆమిర్ ఖాన్

Best Web Hosting Provider In India 2024

Aamir Khan on Mahabharatha: మహాభారతం ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‍డేట్స్ చెప్పిన ఆమిర్ ఖాన్

Aamir Khan on Mahabharata: మహాభారతం ప్రాజెక్ట్ గురించి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఎలా ప్లాన్ చేస్తున్నారో వెల్లడించారు. చాలా భాగాలుగా వస్తుందని హింట్ ఇచ్చారు. ఆ వివరాలు ఇవే..

Aamir Khan on Mahabharatha: మహాభారతం సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్‍డేట్స్ చెప్పిన ఆమిర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. జూన్ 20న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనన కలల ప్రాజెక్ట్ ‘మహాభారతం’ గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం చేస్తున్న ప్లాన్స్ గురించి అప్‍డేట్స్ ఇచ్చారు.

నా లక్ష్యం అదే.. ఈ ఏడాదిలోనే!

మహాభారతాన్ని వెండితెరపై చూపించాలని తాను చాలా కాలంగా లక్ష్యంగా పెట్టుకున్నానని ఆమిర్ ఖాన్ అన్నారు. ఈ సినిమా రైటింగ్ పనులు ఈ ఏడాదిలోనే మొదలవుతాయని హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్‍డేట్ చెప్పారు.

ఏకకాలంలో.. వేర్వేరు డైరెక్టరతో..

మహాభారతం సినిమా ఫ్రాంచైజీలో కొన్ని భాగాలు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసినట్టు ఆమిర్ ఖాన్ తెలిపారు. ఈ పార్ట్‌లకు వేర్వేరు డైరెక్టర్లు షూటింగ్ చేసేలా ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఏకకాలంలో కొన్ని పార్ట్‌ల షూటింగ్ జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. మహాభారతం ప్రాజెక్టును తానే నిర్మిస్తానని ఆమిర్ అన్నారు. అత్యంత భారీ బడ్జెట్‍తో ఆ మహాభారతం ఫ్రాంచైజీని ప్రొడ్యూజ్ చేసేందుకు ఆమిర్ రెడీ అయినట్టు తెలుస్తోంది.

మహాభారత ఇతిహాసాన్ని చిత్రాలుగా తీసుకొచ్చే ప్లాన్‍ను ఆమిర్ ఖాన్ గతంలోనే చెప్పారు. ఇప్పుడు అందుకు సంబంధించి అప్‍డేట్స్ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే రైటింగ్ పనులు మొదలవుతాయని చెప్పడంతో ఆసక్తి పెరిగిపోయింది. అనేక ముఖ్యమైన పాత్రలు ఉండే మహాభారతంలో వివిధ సినీ ఇండస్ట్రీల్లోని స్టార్ నటీనటులు నటించే అవకాశాలు ఉంటాయి. దీంతో అతిపెద్ద ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ మెండుగా ఉంటుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

సితారే జమీన్ పర్ గురించి..

2007లో వచ్చిన ‘తారే జమీన్ పర్’ క్లాసిక్‍గా నిలిచింది. ఆ మూవీలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహించారు ఆమిర్ ఖాన్. ఆ చిత్రానికి 18 ఏళ్ల తర్వాత సీక్వెల్‍‌గా ‘సితారే జమీన్ పర్’ మూవీ వస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 20న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సీక్వెల్ చిత్రానికి ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్ ఖాన్‍తో పాటు జెనీలియా లీడ్ రోల్ చేశారు. స్పానిష్ మూవీ ఛాంపియన్‍ ఆధారంగా ఈ సితారే జమీన్ పర్ రూపొందింది.

తారే జమీన్ పర్‌తో పోలిస్తే ఈ సీక్వెల్ మూవీలో తన పాత్ర విభిన్నంగా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ తెలిపారు. సితారే జమీన్ పర్‌లో తన క్యారెక్టర్ దురుసుగా ఉంటుందని అన్నారు. కటువుగా మాట్లాడే పాత్ర తనది అని తెలిపారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024