





Best Web Hosting Provider In India 2024

Srinidhi Shetty on Nani: నాని ఆ విషయం మరిచిపోయేవారు: హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Srinidhi Shetty on Nani: హిట్ 3 హిందీ ప్రమోషన్ల కోసం ముంబై వెళ్లారు నాని, శ్రీనిధి శెట్టి. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు శ్రీనిధి.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 విడుదలకు సన్నద్ధమవుతోంది. మే 1వ తేదీన ఈ వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ కానుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్ వైలెంట్‍గా ఇంటెన్సిటీతో సాగి చిత్రంపై అంచనాలను మరింత అధికంగా చేసింది. ఈ మూవీలో నాని సరనస హీరోయిన్‍గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించారు. హిట్ 3 సినిమా హిందీ ప్రమోషన్లలో కోసం నేడు (ఏప్రిల్ 22) ముంబైలో మీడియాతో మాట్లాడారు నాని, శ్రీనిధి శెట్టి.
నేనెప్పుడు అలా అనుకోలేదు
హీరో నాని ప్రొడక్షన్ హౌస్ ‘వాల్‍పోస్టర్ సినిమా’కు మంచి పేరు వచ్చింది. ఈ బ్యానర్ కింద ఇటీవల వచ్చిన కోర్ట్ సినిమా కమర్షియల్‍గా హిట్ అవటంతో పాటు ప్రశంసలను దక్కించుకుంది. హిట్ 3 మూవీని నానినే ప్రొడ్యూజ్ చేశారు. దీంతో నిర్మాతగా ఎలా ఉందనే ప్రశ్న నానికి ఎదురైంది.
తన చిత్రాన్ని తానే ప్రొడ్యూజ్ చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని నాని చెప్పారు. “నేను సొంతంగా సినిమా ప్రొడక్షన్ మొదలుపెట్టినప్పుడు, నా సొంత నిర్మాణంలో నేను నటిస్తానని ఆలోచించలేదు. ఇది నా కెరీర్లో మరో స్టెప్” అని నాని అన్నారు.
నాని మరిచిపోయేవారు
తాను నిర్మాత అనే విషయాన్ని హిట్ 3 షూటింగ్ సమయంలో కొన్నిసార్లు నాని మరిచిపోయేవారని శ్రీనిధి శెట్టి అన్నారు. “హిట్ 3 షూటింగ్ సమయంలో ప్రొడ్యూజర్ అని ఆయన మరిచిపోయేవాడు. నువ్వు ఈ సినిమాకు నిర్మాతవి కూడా అని మేం గుర్తు చేయాల్సి వచ్చేది” అని శ్రీనిధి చెప్పారు.
హిట్ 3 సమయంలో దర్శకుడితో ఏ విషయంలో అయిన విభేదాలు వచ్చాయా అనే ప్రశ్నకు నాని స్పందించారు. “లేదు. నేను కూడా ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా. సీన్లను మరింత మెరుగుపరిచేందుకు, అత్యుత్తమంగా ఉండేదుకు నేను, నా టీమ్ తపన పడ్డాం” అని నాని అన్నారు. ఏదో హిట్ 2లో క్యామియో చేసినందుకు హిట్ 3 మూవీ చేయలేదని, స్క్రిప్ట్ తనకు చాలా నచ్చిందని తెలిపారు.
హిట్ 3 చిత్రం మే 1న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదల కానుంది. ఇప్పటి నుంచే ప్రమోషన్లను జోరుగా చేస్తోంది మూవీ టీమ్. అమెరికాకు కూడా వెళ్లి అక్కడ కూడా ప్రమోట్ చేయనున్నారు నాని. ఇటీవల వచ్చిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. రిలీజ్‍కు ముందు మరో ట్రైలర్ తీసుకొచ్చేందుకు కూడా టీమ్ ప్లాన్ చేస్తోంది.
హిట్ 3 చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. థర్డ్ కేస్ పేరుతో హిట్ ఫ్రాంచైజీలో మూడో మూవీగా వస్తోంది. సీరియస్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రను ఈ మూవీలో పోషించారు నాని. ఈ చిత్రం నచ్చకపోతే తన మాట ఎప్పుడూ నమ్మవద్దంటూ ఇటీవల ఓ ప్రమోషనల్ ఈవెంట్‍లో నేచురల్ స్టార్ చెప్పారు. ఈ మూవీలో ఎంత నమ్మకం ఉందో వివరించారు.
హిట్ 3లో సినిమాలో వైలెన్స్ ఎక్కువగానే ఉండనుంది. దీంతో సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని ప్రొడ్యూజ్ చేశారు.
సంబంధిత కథనం