





Best Web Hosting Provider In India 2024

నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ – 18 నోటిఫికేషన్ల ద్వారా 866 పోస్టులు భర్తీ, కసరత్తు ప్రారంభం
ఏపీపీఎస్సీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 18 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. త్వరలో 866 పోస్టుల భర్తీకి పలు నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు ఖరారు కాగానే నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా, ఏపీపీఎస్సీ పెండింగ్ నోటి ఫికేషన్లపై కసరత్తు మొదలుపెట్టింది. జనవరిలోనే ఉద్యోగాల భర్తీపై ప్రకటన రావాల్సి ఉండగా, ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది. వివిధ శాఖల్లో సుమారు 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అటవీ శాఖలో 814 పోస్టులున్నాయి. ఎస్సీ వర్గీకరణకు రోస్టర్ పాయింట్లు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ విషయంపై స్పష్టత రాగానే ఏపీపీఎస్సీ నోటి ఫికేషన్ల జారీ చేయనుంది.
శాఖల వారీగా పోస్టుల వివరాలు
- అటవీ శాఖలో మొత్తం పోస్టులు – 814
- సెక్షన్ ఆఫీసర్ – 100 (30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్)
- బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్- 691 (141 క్యారీ ఫార్వర్డ్)
- డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్-2
- టెక్నికల్ అసిస్టెంట్- 13
- తన్నేదార్: 10
- ఇతర శాఖల్లో ఖాళీలు
- అగ్రికల్చర్ ఆఫీసర్ (వ్యవసాయ శాఖ) – 10
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (దేవాదాయ) -7
- జిల్లా సైనిక్ అధికారి -7
- అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ (మత్స్యకార శాఖ)- 3
- టెక్నికల్ అసిస్టెంట్ (భూగర్భ నీటిపారుదల) – 4
- జూనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ-2,
- సీనియర్ ఎకౌంటెంట్ కేటగిరీ-3,
- జూనియర్ ఎకౌంటెంట్ కేటగిరీ-4 (మున్సిపల్)- 11
- అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ – 1 (క్యారీ ఫార్వర్డ్)
- జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్-1 (ప్రిజన్స్) – 1 (క్యారీ ఫార్వర్డ్)
- గ్రంథ పాలకుడు (ఇంటర్ విద్య)- 2
- హార్టికల్చర్ ఆఫీసర్ (ఉద్యాన) – 2
ఏపీపీఎస్సీ మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు మే 3 నుంచి ప్రారంభం కానున్నాయి. మరో పది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రూప్ 1 అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు విడుదల అయ్యాయి. ఏపీపీఎస్సీ కమిషన్ వెబ్ సైట్‌లో గ్రూపు-1 హాల్ టిక్కెట్లను విడుదల చేశారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. గ్రూపు-1 ప్రధాన పరీక్షలు రాయనున్న అభ్యర్థుల హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజ బాబు పలు సూచనలు చేశారు. మొత్తం 7 పరీక్షలను ఎంపిక చేసిన 4 జిల్లాల్లో మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వ హించనున్నారు.
గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ ఇదే..
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేసింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ వెల్లడించింది.
ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ తేదీలు
(ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 01.00 వరకు)
- 03.05.2025 – తెలుగు(క్వాలిఫైయింగ్ పేపర్)
- 04.05.2025 -ఇంగ్లీష్ పేపర్ (క్వాలిఫైయింగ్ పేపర్)
- 05.05.2025 -పేపర్-I – జనరల్ ఎస్సే(సమకాలీన అంశాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు)
- 06.05.2025 – పేపర్-II – భారతదేశ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక, భౌగోళిక శాస్త్రం
- 07.05.2025 – పేపర్-III – పాలిటిక్స్, రాజ్యాంగం, పాలన, లా అండ్ ఎథిక్స్
- 08.05.2025 -పేపర్-IV – భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, డెవలప్మెంట్
- 09.05.2025 -పేపర్-V- సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు
సంబంధిత కథనం
టాపిక్