





Best Web Hosting Provider In India 2024

మరో వివాదంలో అల్లు అర్జున్, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదు
సినీ హీరో అల్లు అర్జున్ , హీరోయిన్ శ్రీలీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ర్యాంకుల పేరుతో మభ్యపెడుతున్న పలు విద్యాసంస్థలకు వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సినీ నటుడు అల్లు అర్జున్ మరో వివాదం చిక్కుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అనంతరం పరిణామాలపై ఇప్పుడిప్పుడు బయటపడుతున్న అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలేలా ఉంది. హీర్ అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీలపై ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అల్లు అర్జున్, శ్రీలీల పలు కార్పొరేట్ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా చేస్తున్నారని, వీరు ఆయా కాలేజీల విద్యా ప్రమాణాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న ఏపీలో ఫిర్యాదులో చేసిన ఏఐఎస్ఎఫ్ తాజాగా తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. అల్లు అర్జున్, శ్రీలీల ప్రకటనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
క్రిమినల్ కేసులు నమోదుకు డిమాండ్
కార్పొరేట్ కాలేజీల నుండి భారీ పారితోషికం తీసుకుంటూ, విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా వీరిద్దరూ ప్రకటనలు చేస్తున్నారని, కాబట్టి వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ పోలీసులను కోరింది. ప్రమోషన్ చేసే ముందు ఆ విద్యా సంస్థలు గురించి ఆలోచన చేయాలని ప్రశ్నించారు. వీరు చేసే తప్పుడు ప్రచారం వల్ల లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్నాయని విద్యా్ర్థి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలపై పలు వార్తా పత్రికల్లో టాప్ ప్రైవేట్ కాలేజీలు యాడ్స్ ఇచ్చాయని, ఒకే ర్యాంకర్ ఫొటోను రెండు మూడు కాలేజీ వారి విద్యార్థిగా ప్రచురించుకున్నాయని ఆరోపించారు. ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ పోలీసులను కోరింది.
కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు తెలంగాణ డీజీపీని కలిసి ఫిర్యాదు చేసింది. జేఈఈ మెయిన్ ఫలితాల్లో తప్పుడు ర్యాంకులను ప్రచారం చేస్తున్న పలు విద్యాసంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
తొక్కిసలాట వివాదం
పుష్ప-2 విడుదల సమయంలో హీరో అల్లు అర్జున్ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. పుష్ప-2 ప్రీమియర్ షో రోజున ఎలాంటి సమాచారం లేకుండా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మరణించింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి కొన్ని గంటల పాటు జైలులో ఉంచారు. ఈ కేసులో అల్లు అర్జున్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఈ కేసు ఇంకా కొలిక్కి రాకుండా మరో వివాదంలో అల్లు అర్జున్ చిక్కుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్