





Best Web Hosting Provider In India 2024

సమ్మర్ లో పిల్లల్లో స్ఫూర్తి నింపే టాప్ స్పోర్ట్స్ సినిమాలు.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే.. ఓ లుక్కేయండి
సమ్మర్ లో మీ పిల్లలను స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్ ల్లో చేర్పించి.. వాళ్లను ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలని కల కంటున్నారా? కోచింగ్ లో చేరగానే అయిపోదు.. విజేతగా నిలవాలనే సంకల్పంతో కఠోర శిక్షను కొనసాగించాలి. ఆ దిశగా స్ఫూర్తి నింపే సినిమాలెన్నో. వీటిలో తెలుగులో టాప్-5 ఏయే ఓటీటీల్లో ఉన్నాయో చూసేయండి.
వేసవి కాలం వచ్చేసింది. రేపు (ఏప్రిల్ 23) పాఠశాలలకు చివరి రోజు. ఇక సమ్మర్ హాలీడేస్ లో పిల్లలకు స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్ లకు పంపాలనుకునే పేరేంట్స్ చాలా మందే ఉంటారు. పిల్లలకు ఆటపై మరింత ఆసక్తి కలిగించేలా.. స్ఫూర్తి రగిలించే సినిమాలు చాలానే ఉన్నాయి. వీటిలో ఈ అయిదు స్పెషల్. మరి ఈ మూవీస్ ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.
గోల్కొండ హైస్కూల్
పిల్లలకు చదువులే కాదు ఆటలూ ముఖ్యమనే గొప్ప సందేశాన్ని క్రికెట్ డ్రామాతో చాటిన మూవీ ‘గోల్కొండ హైస్కూల్’. 2011లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో కోచ్ గా సుమంత్ అద్భుతంగా నటించారు. గ్రౌండ్ లో అకాడమీ కట్టాలనే మేనేజ్ మెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. స్కూల్ స్టూడెంట్స్ క్రికెట్లో ఎలా ఛాంపియన్ గా నిలిచారన్నదే ఈ థ్రిల్లర్ మూవీ కథ. అట్టడుగు ప్లేస్ నుంచి విజేతగా నిలిచిన ఆ టీమ్ స్టోరీ కచ్చితంగా స్ఫూర్తి కలిగించేదే. ఈ మూవీ జీ5 ఓటీటీలో ఉంది. యూట్యూబ్ లోనూ ఫ్రీగా చూడొచ్చు.
విశ్వాసం
విన్నర్ అయితేనే జీవించాలి.. లూజర్ అయితే మరణించాలనే ఉద్దేశం తప్పు అని బలంగా చాటిన మూవీ ‘విశ్వాసం’. తన కూతురు ఓడిపోతే ఛీ కొట్టి, ఆమె సూసైడ్ చేసుకునేందుకు కారణమయ్యే తండ్రి ఓ వైపు.. తన కుమార్తె గెలుపు కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే ఇంకో తండ్రి మరో వైపు. చివరకు నాన్న కోసం రన్నింగ్ రేస్ లో గెలిచిన కూతురు క్లైమాక్స్ చూస్తే గూప్ బంప్స్ గ్యారెంటీ. అజిత్, నయనతార జోడీగా నటించిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది. ఈ ఒరిజినల్ తమిళ్ మూవీ తెలుగులోనూ ఆకట్టుకుంది.
జెర్సీ
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మూవీ ‘జెర్సీ’. ఆడితే చనిపోతానని తెలిసి కూడా కొడుకు కోసం క్రికెట్ ఆడిన తండ్రిగా నాని యాక్టింగ్ ఇరగదీశారు. ఈ మూవీలో తండ్రీకొడుకుల మధ్య అనుబంధం ఆకట్టుకుంది. కొడుకు కోసం తిరిగి క్రికెట్ బ్యాట్ పట్టిన తండ్రి చేసిన పోరాటం కచ్చితంగా పిల్లలను మోటివేట్ చేస్తుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియో, జియోహాట్స్టార్, జీ5 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎంఎస్ ధోని
చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఆ పిల్లాడికి ఇష్టం. తండ్రి వద్దన్నా ఆటపై ప్రేమతో సాగి ఛాంపియన్ గా నిలుస్తాడు. టీమిండియాకు కెప్టెన్ గా రెండు ప్రపంచకప్ లు అందిస్తాడు. పిల్లాడి నుంచి విజేతగా ఎదిగిన ఆ క్రికెటర్ కథ మన మహేంద్ర సింగ్ ధోనీదే. అతని బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని:ది అన్ టోల్డ్ స్టోరీ’ పిల్లలకు మంచి ఎనర్జీనిచ్చే బూస్టర్. ఈ మూవీలో ధోని క్యారెక్టర్ లో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అద్భుతమైన యాక్టింగ్ తో అలరించారు. ప్రైమ్ వీడియో, జియోహాట్స్టార్ లో మూవీ చూడొచ్చు.
కౌసల్య కృష్ణమూర్తి
తండ్రి కోసం క్రికెటర్ గా మారి దేశాన్ని గెలిపించే అమ్మాయి కథే ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రికెట్ పిచ్చి ఉన్న ఆ తండ్రి టీమిండియా ఓడిపోతుంటే కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ తండ్రి ముఖంలో సంతోషం చూడాలనే లక్ష్యంతో అమ్మాయి క్రికెటర్ గా మారుతుంది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొంటుంది. చివరకు అనుకున్నది సాధిస్తుంది. ఏ ప్లేయర్ కైనా తల్లిదండ్రులను మించిన మోటివేషన్ ఏముంటుంది? వాళ్ల కోసం క్రికెటర్ గా ఎదగాలనుకునే వాళ్లకు ఈ మూవీ ఓ టానిక్ లాంటిదే. తండ్రిగా రాజేంద్రప్రసాద్, కూతురుగా ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ లో అదరగొట్టారు. ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో ఉంది.
సంబంధిత కథనం