





Best Web Hosting Provider In India 2024

Malayalam OTT Releases: ఓటీటీలోకి వచ్చే నెలలో అడుగుపెట్టే అవకాశం ఉన్న మలయాళం మూవీస్ ఇవే.. ఓ బ్లాక్‌బస్టర్ కూడా..
Malayalam OTT Releases: మలయాళం సినిమాలు కొన్ని వచ్చే నెలలో ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఓ బ్లాక్‌బస్టర్ కూడా ఉంది. వీటిలో కొన్ని ఏప్రిల్లో రిలీజైనవి కాగా.. మరికొన్ని అంతకుముందే థియేటర్లకు వచ్చినవి కూడా ఉన్నాయి.
Malayalam OTT Releases: మలయాళం సినిమాలు మెచ్చే తెలుగు ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూసే. కొన్ని మోస్ట్ అవేటెడ్ మాలీవుడ్ మూవీస్ మే నెలలో ఓటీటీలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిలో బ్లాక్‌బస్టర్ మూవీ అలప్పుజ జింఖానా కూడా ఉంది. మరి మిగిలిన ఆ సినిమాలు ఏవో కూడా తెలుసుకోండి.
మరణమాస్
మలయాళ స్టార్ హీరో బేసిల్ జోసెఫ్ నటించిన మూవీ ఈ మరణమాస్. కామెడీతోపాటు ఎమోషనల్ సీన్లనూ పండించే నటుడు ఇతడు. బేసిల్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే అతడు నటించిన పొన్‌మ్యాన్ మూవీ జియోహాట్‌స్టార్ లో, ప్రవింకూడు షాప్పు మూవీ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కామెడీ, డార్క్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ మరణమాస్ మూవీ కూడా మే నెలలో ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
అలప్పుజ జింఖానా
ప్రేమలు మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు నస్లేన్ నటించిన మూవీ అలప్పుజ జింఖానా. విషు పండుగకు రిలీజై బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.50 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. కాలేజీ అడ్మిషన్ల కోసం బాక్సింగ్ కాంపిటీషన్లలో పాల్గొనే కొందరు విద్యార్థుల చుట్టూ తిరిగే మూవీ ఇది. ఈ సినిమా కూడా మే నెలలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
బజూకా
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన గేమ్ థ్రిల్లర్ బజూకా. ఈ సినిమా కూడా విషు పండుగకే రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర మొదట్లో రాణించిన ఈ మూవీ.. తర్వాత క్రమంగా తెరుమరుగైంది. అలప్పుజ జింఖానా మూవీ నుంచి గట్టి పోటీ రావడంతో బజూకా క్రేజ్ తగ్గింది. థియేటర్లలో మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న ఈ బజూకా మూవీ కూడా మేలోనే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్
మమ్ముట్టి నటించిన మరో మూవీ డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది జనవరి 23నే రిలీజైంది. అయితే ఇప్పటి వరకూ ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ లేదు. మే నెలలో డిజిటల్ ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రైమ్ వీడియోలోకి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి ఓ డిటెక్టివ్ పాత్రలో నటించాడు.
గెట్ సెట్ బేబీ
గెట్ సెట్ బేబీ కూడా ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైనా ఓటీటీలోకి మాత్రం ఇంకా రాలేదు. చెంబన్ వినోద్ జోస్, ఉన్ని ముకుందన్, నిఖిల విమల్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా మే నెలలో ఓటీటీలోకి రావచ్చు. మార్కోలాంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేసిన తర్వాత ఉన్ని ముకుందన్.. ఈ గెట్ సెట్ బేబీలో ఓ మగ గైనకాలజిస్ట్ పాత్రలో నటించాడు.
బ్రొమాన్స్
అర్జున్ అశోకన్, మాథ్యూ థామస్, సంగీత్ ప్రతాప్, మహిమా నంబియార్ లాంటి వాళ్లు నటించిన కామెడీ మూవీ బ్రొమాన్స్. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైనా.. ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. షింటో, బింటో అనే అన్నదమ్ముల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. షింటో కనిపించకుండా పోయిన తర్వాత బింటో తన ఫ్రెండ్స్ తో కలిసి అతని కోసం వెతకడం మొదలుపెడతాడు. ఈ సినిమా మే నెలలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
సంబంధిత కథనం