ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.02-9-2022(శుక్రవారం) ..
చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
దివంగత ,మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పరిపాలన ..
చందర్లపాడు గ్రామంలోని సచివాలయం-1 పరిధిలో శుక్రవారం సాయంత్రం “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ -సమస్యలను అడిగి తెలుసుకున్నారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని , సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుల మతాలకు అతీతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు , శుక్రవారం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించడం తో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందుతున్న తీరు ,వాలంటీర్ల సేవలు ,సచివాలయాల ద్వారా సేవల నిర్వహణ తదితర అంశాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ,ఈ రోజు సాయంత్రం సుమారు 150 ఇళ్లను ఆయన సందర్శించినట్లు చెప్పారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు , పార్టీ నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ , కందుల నాగేశ్వరరావు, జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు ..