ఈ లక్షణాలు కనిపిస్తే మీకు వడదెబ్బ తగిలినట్టే, వైద్యుడి చికిత్స అవసరమే

Best Web Hosting Provider In India 2024

ఈ లక్షణాలు కనిపిస్తే మీకు వడదెబ్బ తగిలినట్టే, వైద్యుడి చికిత్స అవసరమే

Haritha Chappa HT Telugu

ఎండాకాలంలో బయటకు వెళ్లినప్పుడు ఆ వేడికి వడదెబ్బ కొట్టే అవకాశం ఎక్కువ. కానీ వడదెబ్బ లక్షణాలు తెలియక ఎంతో మంది ఇంటి దగ్గరే ఉండిపోతారు. వడదెబ్బ ఒక్కోసారి ప్రాణాంతకంగా మారిపోతుంది. కాబట్టి వడదెబ్బ లక్షణాలు తెలుసుకుని, అవసరమైతే వైద్యుల చికిత్స కూడా తీసుకోవాలి.

వడదెబ్బ లక్షణాలు ఏమిటి? (Shutterstock)

ఎండల్లో వేడికి వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ. మండే ఎండలు, వేడి గాలులు శరీరాన్ని వేడెక్కిస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఎండలు ఇలా ఉంటే ఇక మే నెలలో మండి పోవడం ఖాయం. వేసవి కాలంలో సర్వసాధారణమైన సమస్య వడదెబ్బ.

వడదెబ్బ అంటే చిన్న విషయంలాగే కనిపిస్తుంది. కానీ ఇది తీవ్రమైన పరిస్థితి. దీనిని వెంటనే గుర్తించి చికిత్స చేయకపోతే ప్రమాదకరంగా మారుతుంది. అధిక వేడి శరీర ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుంది. ఇది మనకు మైకము, అలసట లేదా ఆందోళన కలిగిస్తుంది. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అది ప్రాణంతకంగా మారతుుంది.

అందువల్ల, వడదెబ్బ లక్షణాలను గుర్తించి సరైన సమయంలో చికిత్స చేయడం చాలా ముఖ్యం. హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.

అధిక జ్వరం

వడదెబ్బకు గురైన వ్యక్తిలో కనిపించే మొదటి లక్షణం అధిక జ్వరం. ఎవరైనా వడదెబ్బకు గురైనప్పుడు, వారి శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ ఉష్ణోగ్రత 104 డిగ్రీలకు చేరుకుంటుంది. వేసవి కాలంలో వైరల్ ఫీవర్ లేకపోయినా, శరీర ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభించినప్పుడు, అది వడదెబ్బకు సంకేతం కావచ్చు. వడదెబ్బ వల్ల వచ్చే జ్వరంలో చెమట ఆగిపోవడం వల్ల చర్మం తరచూ వేడిగా, పొడిగా మారుతుంది.

మైకము

వడదెబ్బ కొట్టిన వ్యక్తికి మైకం వచ్చినట్టు అవుతుంది. మూర్ఛకు కారణమవుతుంది. తరచుగా వడదెబ్బ వల్ల శరీరం పూర్తిగా డీహైడ్రేట్ అవుతుంది. దీని వల్ల శరీరంలో గ్లూకోజ్ లోపిస్తుంది. ఇది శరీరంలో బలహీనతకు కారణమవుతుంది. దీనివల్ల మైకము లేదా మూర్ఛ సంభవించవచ్చు. ఇది కాకుండా, వడదెబ్బకు ఉన్నప్పుడు శరీర రక్తపోటు కూడా పడిపోవడం ప్రారంభమవుతుంది.

తలనొప్పి

అధిక వేడి నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది. ఇది తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది. దీనితో, వ్యక్తి గందరగోళానికి గురికావచ్చు. వడదెబ్బతో బాధపడుతున్న వ్యక్తి అతని ప్రవర్తనలో అసాధారణ మార్పులను కూడా చూడవచ్చు. అనవసరమైన అరుపులు, లేదా ఏదైనా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కూడా వడదెబ్బ లక్షణాలే.

వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, హృదయ స్పందన వేగంగా మారిపోతుంది. శ్వాస కూడా వేగంగా నడవడం ప్రారంభిస్తుంది. ఒక వ్యక్తి హార్ట్ పేషెంట్ అయితే, ఈ పరిస్థితి అతనికి మరింత ప్రమాదకరం.

శరీరం చెమట పట్టడం ఆగిపోయినా తేలికగా తీసుకోకూడదు. చర్మం పొడిగా, వేడిగా అనిపిస్తుంది. ఇది వడదెబ్బ చాలా సాధారణ లక్షణం. వాస్తవానికి, వడదెబ్బ కారణంగా శరీరంలోని శీతలీకరణ వ్యవస్థ విఫలమవుతుంది. ఇది శరీరం నుండి చెమటను ఆపివేస్తుంది. అందువల్ల వేసవి కాలంలో చెమట పట్టకపోవడం వడదెబ్బ లక్షణం.

పైన చెప్పి న లక్షణాలు కనిపిస్తే మీకు వడదెబ్బ తగిలిందని అర్థం చేసుకోండి. వెంటనే పరిస్థితి తీవ్రతను బట్టి ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంది.

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024