




Best Web Hosting Provider In India 2024

పొలిటికల్ థ్రిల్లర్‌గా సూర్యపేట జంక్షన్ – కీలక పాత్రలో గబ్బర్ సింగ్ విలన్ – మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
గబ్బర్‌సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్‌గా నటిస్తోన్న సూర్యపేట జంక్షన్ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన ఈ మూవీకి రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించాడు.
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన సూర్యపేట్ జంక్షన్ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. యాక్షన్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటిస్తోన్నారు. ఈ సినిమాకు రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించాడు. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో సూర్యపేట జంక్షన్ మూవీ విడుదల కాబోతోంది.
పొలిటికల్ అంశాలతో…
పొలిటికల్ అంశాలకు యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ జోడించి ఈ మూవీ రూపొందుతోంది. ఓ మంచినీళ్ల బావిని అడ్డుపెట్టుకొని పొలిటికల్ లీడర్ వేసిన ఎత్తుల కారణంగా కొందరు సామాన్య యువకుల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? ఆ పొలిటికల్ లీడర్‌తో పోరులో వారు విజయాన్ని సాధించారా? లేదా? అన్నది ఈ మూవీలో ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతోన్నారు.
మ్యాచింగ్ మ్యాచింగ్ సాంగ్…
ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ…ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజైన “మ్యాచింగ్.. మ్యాచింగ్” సాంగ్ ఆకట్టుకుంటోంది. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు అదరిస్తారు, సినిమాను విజయవంతం చేస్తారని గతంలో చాలా సార్లు సార్లు రుజువైంది. ఆ సెంటిమెంట్‌ను సూర్యపేట జంక్షన్ రిపీట్ చేస్తుందనే నమ్మకముంది అని చెప్పారు.
గబ్బర్ సింగ్ ఫేమ్…
ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ… “మా సూర్యాపేట్ జంక్షన్ మూవీ ఈ నెల 25న ఆంధ్రా, తెలంగాణాలలో గ్లోబల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ లో విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ మూవీలో గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమాన్యు సింగ్ రోల్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. చిన్న సినిమానే అయినా నాణ్యత విషయంలో రాజీపడలేదు” అని అన్నారు.
సూర్య పేట జంక్షన్ సినిమాకు రోషన్ సాలూరి, హరి గౌర మ్యూజిక్ అందించారు. అరుణ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈశ్వర్ ఈ మూవీకి కథను అందించాడు.
రక్త చరిత్రతో ఎంట్రీ…
బాలీవుడ్ యాక్టర్ అయినా అభిమన్యు సింగ్ రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో బుక్కారెడ్డి పాత్రలో కనిపించాడు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తెలుగులో అభిమన్యు సింగ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీతో టాలీవుడ్లో విలన్‌గా ఫేమస్ అయ్యాడు. ముకుంద, శివం, అమర్ అక్బర్ ఆంథోనీ, దేవరతో పాటు పలు భారీ బడ్జెట్ సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.
ఇటీవల రిలీజైన మలయాళం మూవీ ఎల్2 ఎంపురాన్‌లో అభిమన్యు సింగ్ నటనకు ప్రశంసలు దక్కాయి.
సంబంధిత కథనం