




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నబిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ – తెలుగు వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ వచ్చేస్తోంది!
బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. గత ఏడాది ఆహా ఓటీటీలో రిలీజైన వేరే లెవెల్ ఆఫీస్ వెబ్‌సిరీస్‌కు సీజన్ 2 రాబోతుంది. ఈ సీక్వెల్‌లో నిఖిల్ లీడ్ రోల్‌లో నటిస్తోన్నాడు. ఈ సీక్వెల్ వెబ్‌సిరీస్ షూటింగ్ మొదలైంది.
బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నారు. ఫస్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేయబోతున్నాడు. అది కూడా ఓ సీక్వెల్ వెబ్‌సిరీస్ కావడం గమనార్హం. గత ఏడాది ఆహా ఓటీటీలో రిలీజైన వేరే లెవెల్ ఆఫీస్ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ రాబోతుంది.
వీడియో రిలీజ్…
వేరే లెవెల్ ఆఫీస్ 2 టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వెబ్‌సిరీస్‌లో లీడ్ రోల్‌లో నటిస్తోన్న యాక్టర్ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. వీడియోలో అతడు వెనక్కి తిరిగి కనిపించాడు. ఆ యాక్టర్ ఎవరనే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో కలిగించడం కోసమే వీడియోలో అతడి ఫేస్ చూపించలేదని సమాచారం.
నిఖిల్ మలియక్కల్…
కాగా ఆ యాక్టర్ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ అని ప్రచారం జరుగుతోంది. వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ 2లో నిఖిల్ మలియక్కల్ హీరోగా కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. వేరే లెవల్ ఆఫీస్ సీజన్ వన్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్ధక్ ప్రధాన పాత్రలో కనిపించాడు.
సీజన్ 2లో అఖిల్ స్థానంలో నిఖిల్ లీడ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే నిఖిల్ పాత్రకు సంబంధించిన అప్‌డేట్‌ను ఆహా ఓటీటీ రివీల్ చేయబోతున్నట్లు తెలిసింది. మే నెలాఖరున లేదా జూన్ ఫస్ట్ వీక్‌లో ఈ వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్…
వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ 2లో నిఖిల్ మలియక్కల్‌తో పాటు సద్దాం, కాజల్, మహేష్ విట్టా, మిర్చి కిరణ్‌తో పాటు పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.
తమిళ రీమేక్…
తమిళంలో విజయవంతమైన వేర మారి ఆఫీస్ సీజన్ 2కు రీమేక్‌గా వేరే లెవల్ ఆఫీస్ 2 వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. తమిళంలో సీజన్ వన్ యాభై నాలుగు ఎపిసోడ్స్‌తో ముగియగా…సీజన్ 2 యాభై ఎపిసోడ్స్‌తో తెరకెక్కించారు. తెలుగులో వేరే లెవెల్ ఆఫీస్ కేవలం ఎనిమిది ఎపిసోడ్స్‌తోనే ముగిసింది. సీజన్ వన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో సీజన్ 2 విషయంలో మేకర్స్ చాలా మార్పులు చేసినట్లు సమాచారం.
ఫన్ రొమాన్స్…
ఓ సాఫ్ట్ వేర్ ఆఫీస్‌లో పనిచేసే కొందరు యువతీయువకుల జీవితాల నేపథ్యంలో వేరేలెవెల్ ఆఫీస్ వెబ్‌సిరీస్ తెరకెక్కింది. ఫన్‌తో పాటు రొమాన్స్,ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లైఫ్ స్టైల్‌ను ఈ సిరీస్‌లో చూపించారు మేకర్స్.
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 విన్నర్‌గా నిలిచాడు నిఖిల్. ప్రస్తుతం చిన్న సీరియల్‌లో నటిస్తోన్నాడు. త్వరలోనే హీరోగా నిఖిల్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత కథనం