




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి మలయాళం అడ్వెంచర్ కామెడీ మూవీ.. అన్న కోసం తమ్ముడి వేట.. ట్విస్టులు, నవ్వులు గ్యారెంటీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి రెండున్నర నెలల తర్వాత ఓ మలయాళం అడ్వెంచర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఊహించని ట్విస్టులతో నవ్వులు పండించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కాగా.. మొత్తానికి ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
ఓటీటీలోకి మరో మలయాళం అడ్వెంచర్ కామెడీ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు రాబోతోంది. కనిపించకుండా పోయిన అన్న కోసం అతని స్నేహితులతో కలిసి తమ్ముడి సాగించే వేట చుట్టూ తిరిగే మూవీ ఇది. సుమారు రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.
బ్రొమాన్స్ ఓటీటీ రిలీజ్ డేట్
ఓటీటీలోకి వస్తున్న మలయాళ కామెడీ మూవీ బ్రొమాన్స్ (Bromance). ఈ సినిమాను సోనీలివ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. మే 1న డిజిటల్ ప్రీమియర్ ఉంటుందని ఆ ఓటీటీ బుధవారం (ఏప్రిల్ 23) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
ఈ సందర్భంగా ఓ ఫన్నీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది. మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం భాషల్లోనూ బ్రొమాన్స్ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. “గందరగోళం, కామెడీ, మీరు ఎప్పటికీ మరచిపోలేని ఓ గ్యాంగ్. బ్రొమాన్స్ మే 1 నుంచి సోనీలివ్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది.
బ్రొమాన్స్ మూవీ స్టోరీ ఏంటంటే?
బ్రొమాన్స్ మూవీని అరుణ్ డి. జోస్ డైరెక్ట్ చేశాడు. ఇందులో మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోమన్, కళాభవన్ షాజోన్, భరత్ బోపన్నలాంటి వాళ్లు నటించారు. గోవింద్ వసంత మ్యూజిక్ అందించాడు. ఇదొక అడ్వెంచర్ కామెడీ మూవీ. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది.
ఈ సినిమా బింటో, షింటో అనే ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ల స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. బింటో అన్న షింటో కనిపించకుండా పోతాడు. దీంతో బింటో, తన అన్న స్నేహితులు కలిసి అతని కోసం వెతకడం మొదలుపెడతారు. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు నవ్వులు పంచుతాయి. ముఖ్యంగా ఈ కాలం యువత ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర రూ.13.5 కోట్లు వసూలు చేసిన మూవీ ఇది.
సంబంధిత కథనం