





Best Web Hosting Provider In India 2024

ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి మలయాళ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓ మలయాళ మూవీ ఇప్పుడు ఒకేసారి ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. అది కూడా థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత వస్తోంది. ఈ మూవీ ఏంటి? ఎక్కడ చూడాలన్న విశేషాలు తెలుసుకోండి.
మలయాళం ఇండస్ట్రీ నుంచి గతేడాది క్రిస్మస్ కు మూడు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ (ED Extra Decent). కామెడీ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజైంది. అయితే అదే సమయానికి వచ్చిన మార్కో మూవీ దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. మొత్తానికి నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టబోతోంది.
ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ ఓటీటీ రిలీజ్ డేట్
ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ మూవీకి నాలుగు నెలలుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ దొరకలేదు. ఈ మధ్యే సైనా ప్లే ఓటీటీ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అనౌన్స్ చేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ తేదీని కూడా వెల్లడించింది.
ఈ మూవీ శనివారం (ఏప్రిల్ 26) నుంచి సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మ్యాక్స్ లలోకీ ఈ మూవీ అడుగుపెట్టనుంది. దీంతో ఒకేసారి మూడింట్లోకి వస్తున్న సినిమాగా నిలిచింది.
ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ మూవీ ఏంటంటే?
ఈ ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ మూవీని ఆమిర్ పల్లిక్కల్ డైరెక్ట్ చేశాడు. బిను (సూరజ్ వెంజరమూడు) అనే ఓ మధ్య వయసు వ్యక్తి చుట్టూ తిరిగే సినిమా ఇది. అతడు తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. డీసెంట్ అనుకున్న తన కుటుంబం గురించి అతనికి కొన్ని చీకటి రహస్యాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ మూవీ కథ. ఇందులో బిను దాస్ పాత్రలో సూరజ్ నటించాడు. ఇక గ్రేస్ ఆంటోనీ అతని సోదరిగా కనిపించింది. ప్రేమలు మూవీ ఫేమ్ శ్యామ్ మోహన్.. ఇందులో సంజు అనే పాత్రలో నటించాడు.
గతేడాది క్రిస్మస్ సందర్భంగా మార్కో మూవీతో కలిసి ఈ ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ కూడా థియేటర్లలో రిలీజైంది. సినిమాలో సూరజ్ నటనకు మంచి మార్కులు పడినా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు. మార్కోతోపాటు రైఫిల్ క్లబ్ లాంటి సినిమాల నుంచి దీనికి గట్టి పోటీ ఎదురైంది. ఇప్పుడీ ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. అయితే కేవలం మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తోనే డిజిటల్ ప్రీమియర్ అవనుంది.
సంబంధిత కథనం