




Best Web Hosting Provider In India 2024

డబ్బింగ్ సినిమాలే ఎక్కువా? స్ట్రెయిట్ సినిమాలు కనిపించడం లేదా? – టాలీవుడ్ ఫ్యాన్స్ ట్రోల్
ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో అలప్పుజ జింఖానా బెటర్ అంటూ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశి చేసిన కామెంట్స్‌ను టాలీవుడ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తోన్నారు. డబ్బింగ్ సినిమాల కోసం తెలుగు స్ట్రెయిట్ మూవీస్‌ను తక్కువ చేయద్దంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా మలయాళం, తమిళంతో పాటు ఇతర భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు భారీగా వసూళ్లను రాబడుతోన్నాయి.ఈ డబ్బింగ్ మూవీస్ ప్రమోషన్స్ కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతూ ఆయా సినిమాల పట్ల తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్నారు మేకర్స్.
గత కొన్నేళ్లుగా వారానికి నాలుగైదు డబ్బింగ్ సినిమాలు థియేటర్లలోకి రావడం పరిపాటిగా కనిపిస్తోంది. ఈ డబ్బింగ్ సినిమాల కారణంగా కొన్నిసార్లు తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి తలెత్తుతోంది. ముఖ్యంగా చిన్న సినిమాలపై ఈ డబ్బింగ్ మూవీస్ ఎఫెక్ట్ భారీగా పడుతోందని టాలీవుడ్ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తోన్నాయి.
అలప్పుజ జింఖానా…
మలయాళంలో విజయవంతమైన అలప్పుజ జింఖానా ఈ శుక్రవారం (ఏప్రిల్ 25న) ప్రేక్షకలు ముందుకు రాబోతుంది. ఈ డబ్బింగ్ మూవీని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. మంగళవారం ఈ డబ్బింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ శశి చేసిన కామెంట్స్ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ వారం రిలీజ్లు లేవు…
ఈ వేడుకలో శశి మాట్లాడుతూ మంజుమ్మల్ బాయ్స్ తర్వాత తమ సంస్థకు అలప్పుజ జింఖానా పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. ఈ ఏప్రిల్ 25న తెలుగులో రీలీజ్లు ఏం లేవు. ఉన్నవాటిలో ఇదే బెటర్ సినిమా అని మేం అనుకుంటున్నాము అని కామెంట్స్ చేశారు.
మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి కామెంట్స్ ను తెలుగు సినీ లవర్స్తప్పుపడుతున్నారు. డబ్బింగ్ మూవీ కోసం తెలుగు సినిమాలను చులకన చేయడం కరెక్ట్ కాదంటూ ట్రోల్ చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలను బ్యాన్ చేస్తేనే టాలీవుడ్ బాగుపడుతుందని కామెంట్స్ చేస్తోన్నారు.
పదిహేను సినిమాలు…
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొత్తం 15 వరకు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో చాలా వరకు స్ట్రెయిట్ సినిమాలే ఉన్నాయి. ప్రియదర్శి సారంగపాణి జాతకం, సంపూర్ణేష్‌బాబు సోదరాతో పాటు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మించిన చౌర్యపాఠం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ మూడు సినిమాలపై మంచి బజ్ ఉంది. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.
కోర్ట్ మూవీ తర్వాత…
సారంగపాణి జాతకం కంటే ముందు ప్రియదర్శి నటించిన కోర్ట్ మూవీ యాభై కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మరోవైపు మోహనకృష్ణ ఇంద్రగంటి సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
పూర్తిస్థాయి తెలుగు ఆర్టిస్టులతో తెరకెక్కిన ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌కు కనిపించకపోవడం విడ్డూరం అంటూ కామెంట్స్ చేస్తోన్నారు. సోదరా, చౌర్యపాఠం సినిమాలపై కూడా ఈ వారం మంచి బజ్ నెలకొంది. వాటిని కాదని డబ్బింగ్ సినిమాలకు ఇంపార్టెన్స్ ఎలా ఇస్తారంటూ సినీ లవర్స్ చెబుతోన్నారు.
సంబంధిత కథనం