





Best Web Hosting Provider In India 2024

ఇన్స్టాగ్రామ్ పరిచయం.. హోటల్‌కు రమ్మని పిలిచి, యువతిని కట్టేసి నగలతో ఉడాయించాడు..
విజయవాడలో విచిత్రమైన దొంగతనంపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన యువకుడిని కలిసేందుకు హోటల్‌కు వెళ్లిన యువతిని ఆమె దుస్తులతోనే కట్టేసి నగలు అపహరించి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన యువకుడు పిలిచాడని హోటల్‌కు వెళ్లిన యువతి నిలువుదోపిడీకి గురైంది.
విజయవాడ మాచవరంలో హోటల్లో ఏకాంతంగా ఉన్న సమయంలో యువతిని ఆమె దుస్తులతోనే బంధించి ఆమె దగ్గర ఉన్న నగలతో ఉడాయించాడు. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయవాడకు చెందిన యువతికి ఇన్ స్టా గ్రామ్‌లో నెల రోజుల క్రితం ఓ యువకుడు పరిచయం అయ్యాడు.
ఇద్దరి తరచూ మాట్లాడుకున్నారు. ముక్కు ముఖం తెలియని యువకుడితో యువతి చనువు పెంచేసుకుంది. యువకుడి మాటలు నమ్మేసి యువతి అతడి ఉచ్చులో చిక్కిన తర్వాత ఆమెను ఏకాంతంగా కలవాలని పిలిచాడు.
దీంతో మంగ ళవారం సాయంత్రం మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హోటల్‌కు రమ్మని ఆమెని పిలిచాడు. హోటల్ గదిలోకి వెళ్లగానే ఆమె శరీరంపై దుస్తులు తొలగించి, వాటితోనే ఆమె చేతులు, కాళ్లు కట్టేశాడు.
ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న సుమారు 20 గ్రాముల బంగారు గొలుసు తీసుకొని పరారయ్యాడు. యువతి అరగంట తర్వాత కట్లు విప్పుకుని హోటల్ నుంచి బయటపడింది. బుధవారం ఈ ఘటనపై మాచవరం పోలీసులకు పిర్యాదు చేసింది.
యువతితో చాట్ చేసిన సమయంలో యువకుడి ఫోన్ నెంబర్ సహా ఇతర వివరాలు ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. సోషల్ మీడియా మెసేంజెర్లతోనే ఆమెతో చాట్ చేసేవాడు. దీంతో అతని ఇన్ స్టా గ్రామ్ ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నింది తుడి కోసం ప్రత్యేక బృందా లతో గాలిస్తున్నామని పోలీ సులు తెలిపారు. యువతి చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.
సంబంధిత కథనం
టాపిక్