





Best Web Hosting Provider In India 2024

సిపెట్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. పదో తరగతి విద్యార్హతతో ప్లాస్టిక్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కోర్సులు
కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అంట్ టెక్నాలజీలో పదో తరగతి విద్యార్హతతో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని సిపెట్ కేంద్రంలో ఈ కోర్సుల్ని నిర్వహిస్తారు.
విజయవాడలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సిపెట్) లో పదో తరగతి విద్యార్హతతో మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా కోర్సులకు నోటఫికేషన్ విడుదలైంది.
విజయవాడ సిపెట్ లో డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ(డీపీటీ), డిప్లొమా ఇన్ పాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ(డీపీఎంటీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సిపెట్ డైరెక్టర్ అండ్ హెడ్ సీహెచ్ శేఖర్ తెలిపారు.
బీఎస్సీ విద్యార్హతతో రెండేళ్ల వ్యవధిగల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రొసెస్సింగ్ అండ్ టెస్టింగ్(పీజీడీ-పీపీటీ) కోర్సుకు ఆన్లైన్ విధానంలో మే 29లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఈ కోర్సులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం ఉందని, సిపెట్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)ను జూన్ 8న నిర్వహిస్తారు. వచ్చిన ర్యాంక్ ఆధారంగా విజయవాడ కేంద్రంలో 150 సీట్లు భర్తీచేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ రంగంలో ఉన్న బహుళజాతి సంస్థలు, దాని అనుబంధ సంస్థల్లో జూనియర్ ఇంజనీర్(ప్రొడక్షన్), మౌల్డ్ డిజైనర్ అండ్ మేకర్ జూనియర్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో ఇన్ స్పెక్టర్ ఉద్యోగాలు వస్తాయని వివరించారు.
సిపెట్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రారంభ వేతనం రూ.20వేల నుంచి 25వేలు ఉంటుందని, అర్హులైన అభ్యర్థులు దర ఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9398050255 నెంబరులో సంప్రదించాలని సూచించారు.
సిపెట్ 2025 నోటిఫికేషన్ వివరాలను ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు.
https://www.cipet.gov.in/centres/cipet-vijayawada/introduction.php
దరఖాస్తులు ఆన్ లైన్ లింక్
https://cipet25.onlineregistrationform.org/CIPET/#!
సంబంధిత కథనం
టాపిక్