కర్రెగుట్ట కూంబింగ్‌.. కాల్పులతో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదన్న వరంగల్ రేంజ్ ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి

Best Web Hosting Provider In India 2024

కర్రెగుట్ట కూంబింగ్‌.. కాల్పులతో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదన్న వరంగల్ రేంజ్ ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి

Sarath Chandra.B HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu

చత్తీస్‌ఘడ్‌, తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న భారీ కూంబింగ్‌ ఆపరేషన్‌తో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వరంగల్ రేంజీ ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు.కర్రెగుట్టలో కేంద్ర బలగాల పర్యవేక్షణలో కూంబింగ్‌ జరుగుతోందని అక్కడ ఏమి జరుగుతుందో తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని ప్రకటించారు.

చత్తీస్‌ఘడ్‌- తెలంగాణ సరిహద్దుల్లో కాల్పులు, ఆరుగురు మావోయిస్టులు మృతి (PTI)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

తెలంగాణ-చత్తీస్‌ఘడ్‌ సరిహద్దుల్లో కర్రెగుట్ట ప్రాంతంలో జరుగుతున్న కాల్పుల వ్యవహారంపై తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని వరంగల్ రేంజీ ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి ప్రకటించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో లొంగిపోయిన మావోయిస్టులకు ఐజీ నగదు ప్రోత్సహకాలు అందచేశారు.

చత్తస్‌‌ఘడ్‌కు చెందిన 13మంది మావోయిస్టులు వరంగల్ పోలీసులు ఎదుట లొంగింపోయారు. తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టుల అణిచివేత కంటే వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్టు ఐజీ చెప్పారు. మావోయిస్టులు ప్రజా జీవితంలోకి రావాాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో కర్రెగుట్ట ఎన్‌కకౌంటర్‌పై ఐజీ స్పందించారు.

కర్రెగుట్ట సిఆర్‌పిఎఫ్‌ బలగాల కూంబింగ్‌ ఆపరేషన్‌ గురించి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని ఐజీ చెప్పారు. చత్తీస్‌ఘడ్‌లో ఉన్న సిఆర్‌పిఎఫ్‌ బలగాలు, ములుగులో ఉన్న సిఆర్‌పిఎఫ్‌ బలగాలు, కేంద్ర సాయుధ దళాలు ఈ దాడుల్లో పాల్గొంటూ ఉండొచ్చని ఐజీ చెప్పారు.

బీజాపూర్‌, సుక్మా జిల్లాల పరిధిలో పనిచేసిన మావోయిస్టులు కూడా వరంగల్‌లో లొంగిపోయారని చెప్పారు. తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటులపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. లొంగిపోయిన వారికి జన జీవన స్రవంతిలో వచ్చేలా వారిని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.

తెలంగాణ రికార్డుల్లో లేకపోయినా , అధికారికంగా మావోయిస్టులపై రివార్డులు లేకపోయినా వారికి జీవనోపాధికి పరిమారం అందిస్తున్నట్టు చెప్పారు. చత్తీస్‌ఘఢ్‌ – తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నా కర్రెగుట్ట ఆపరేషన్‌తో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని ఐజీ ప్రకటించారు.

మరోవైపు కర్రెగుట్ట కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారిని బీజాపూర్‌ ఆస్పత్రికి తరలించారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం

టాపిక్

WarangalEncounterTs PoliceIndian ArmyTrending TelanganaTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024