





Best Web Hosting Provider In India 2024

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు అలర్ట్, పెండింగ్లో ఉన్న 18 నోటిఫికేషన్ల విడుదలకు రెడీ అవుతున్న ఏపీపీఎస్సీ..
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఖరారు కావడంతో మిగిలిన పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ సిద్ధం అవుతోంది. ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ కూడా కొలిక్కి రావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వేగం పెంచాలని కమిషన్ భావిస్తోంది. ఇప్పటికే డిఎస్సీ, గ్రూప్ 1 పరీక్షల తేదీలు ఖరారయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి రావడంతో ఏపీలో ఉద్యోగ నియామక ప్రక్రియలో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
- ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి రావడంతో ఏపీపీఎస్సీలో పెండింగ్లో ఉన్న నోటి ఫికేషన్ల విడుదలకు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. ఈ ఏడాది జనవరిలోనే నోటిఫికేషన్లు జారీ చేయాలని భావించినా ఎస్సీ వర్గీకరణ కార్యరూపం దాల్చక పోవడంతో నోటిఫికేషన్లు ఆలస్యమయ్యాయి.
- ఏపీ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబం ధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీలో పెండింగ్లో ఉన్నాయి. వాటిలో అటవీ శాఖకు సంబంధించి 814 పోస్టులున్నాయి.
- ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు అన్ని శాఖల్లో రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈ కసరత్తు పూర్తవగానే ఏపీపీఎస్సీ నోటి ఫికేషన్ల జారీ చేయాలని భావిస్తోంది.
శాఖల వారీగా భర్తీ చేయనున్న ఉద్యోగాలు
అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 100 ఉన్నాయి. వీటిలో 30 పోస్టులు క్యారీ పార్వర్డ్ పోస్టులుగా ఉ్నాయి.
అటవీ శాఖలో బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు 691 ఉన్నాయి. వీటిలో 141 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి.
డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్-2 టెక్నికల్ అసిస్టెంట్: పోస్టులు 13 ఉన్నాయి.
వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు 10, దేవాదాయ శాఖలో ఈవో పోస్టులు 7, జిల్లా సైనిక సంక్షేమ అధికారుల పోస్టులు 7, ఇంటర్మీడియట్ విద్యలో లైబ్రేరియన్ పోస్టులు 2, ఉద్యానశాకలో హార్టికల్చర్ పోస్టులు 2, మత్స్య శాఖలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులు 2, భూగర్భ జలశాకలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 2, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ క్యాటగిరీ 2 పోస్టులు 2, మునిసిపల్ శాఖలో సీనియర్ అకౌంటెంట్ పోస్టులు 11, టైపిస్ట్ పోస్టులు 1, అసిస్టెంట్్ మోటర్ వెహికల్ పోస్టులు 1 ఉన్నాయి. వీటితో పాటు పలు క్యారీ ఫార్వార్డ్ పోస్టులు ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్