ఉగ్రదాడి చేసినవారికి ఊహించని శిక్ష.. పహల్గామ్ దాడిపై తొలిసారి మాట్లాడిన మోదీ

Best Web Hosting Provider In India 2024


ఉగ్రదాడి చేసినవారికి ఊహించని శిక్ష.. పహల్గామ్ దాడిపై తొలిసారి మాట్లాడిన మోదీ

Anand Sai HT Telugu

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ దేశం మెుత్తం కన్నీరుపెట్టుకుంది. ఉగ్రదాడి చేసినవారి ఆచూకీ కోసం దర్యాప్తు జరుగుతోంది. ఈ దాడి ఘటనపై బహిరంగంగా ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు.

ప్రధాని మోదీ

హల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, దీనికి సూత్రధారి అయిన వారికి వారు ఊహించిన దానికంటే పెద్ద శిక్ష పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదులకు చెందిన మిగిలిన భూములను మట్టిలో కలపాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్‌లోని మధుబని జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మొదట పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. అంతే కాదు ర్యాలీకి వచ్చిన వేలాది మంది ప్రజలు కొన్ని క్షణాలు మౌనం పాటించి మరణించిన వారికి సెల్యూట్ చేయాలని కోరారు. ‘

‘నేను ప్రారంభించడానికి ముందు, మీరు ఉన్న చోటే కూర్చుని 22న మనం కోల్పోయిన కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించడానికి కొన్ని క్షణాలు మౌనం పాటించాలని కోరుతున్నాను. తర్వాత కార్యక్రమం మెుదలుపెడదాం.’అని మోదీ చెప్పారు.

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు అమాయకులను కిరాతకంగా హతమార్చిన ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ విషాదంలో మృతుల కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తోంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని దేశం మెుత్తం ఆకాంక్షిస్తోంది.

ఉగ్రవాదులు, ఈ దాడికి కుట్ర పన్నిన వారికి వారు ఊహించిన దానికంటే ఎక్కువ శిక్ష పడుతుందని చాలా స్పష్టంగా చెబుతానని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదులకు చెందిన మిగిలిన భూములను మట్టిలో కలపాల్సిన సమయం వచ్చిందన్నారు. కనీసం ఆలోచించలేని శిక్ష వేస్తామన్నారు. అభివృద్ధికి శాంతి, భద్రతలు తప్పనిసరి అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాని బుధవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని, రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని తగ్గించాలని, పాకిస్థానీయుల వీసాలను రద్దు చేయాలని నిర్ణయించారు.

దిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు జారీ చేసింది. పాకిస్థాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్‌ను పిలిపించి నోటీసు అందజేసింది. దీని ప్రకారం వారు వారం రోజుల్లో భారత్‌ను వీడాల్సి ఉంటుంది. పాక్‌కు పనిచేసే త్రివిధ దళాల్లోలనివారు కూడా వెళ్లాలి. అంతేకాగు పాక్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను భారత్ నిలిపివేసింది.

Anand Sai

eMail
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link