



Best Web Hosting Provider In India 2024

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్ – జూన్ 1న తుది పరీక్ష
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు రిక్రూట్ మెంట్ బోర్డు అప్డేట్ ఇచ్చింది. జూన్ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను పేర్కొంది.
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్షపై రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటన చేసింది. జూన్ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ ఉంటుందని పేర్కొంది.
పరీక్షా కేంద్రాల వివరాలు…
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వివరాల ప్రకారం…. 2023 ఏడాదిలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఇందుకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి 2024 డిసెంబరులో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశారు.
ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో 38,910 మంది అర్హత సాధించారు. వీరికి జూన్ 1వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించింది. అబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుందని పేర్కొంది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూల్, తిరుపతి పట్టణాల్లో ఎగ్జామ్ ఉంటుందని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం slprb.ap.gov.in వెబ్‌సైట్ ను సందర్శించాలని సూచించింది.
తాజా నిర్ణయంతో కానిస్టేబుల్ నియామకాల్లో కీలక ముందడుగు పడినట్లు అయింది. దాదాపు ఈ ప్రక్రియ మొదలైన రెండేళ్లు కావొస్తోంది. 2023 మార్చి 9 నుంచి కానిస్టేబుల్ నియామకాలు నిలిచిపోయాయి. 2023 జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించారు. 2023 ఫిబ్రవరి 5న రాతపరీక్షల ఫలితాలు ఫలితాలు వెలువడ్డాయి
అర్హులైన వారికి దేహదారుడ్య పరీక్షలు 2023 మార్చి 13 నుంచి 20 వరకూ నిర్వహిస్తున్నట్టు ప్రకటించినా… 2023 మార్చి 9న వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడినా ఆ తర్వాత కూడా కానిస్టేబుల్ నియామకాలను చేపట్టలేదు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావటంతో… అన్ని అంశాలను పరిశీలించి… కసరత్తూ చేస్తూ వస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై దృష్టి సారించిన ప్రభుత్వం న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి నియామక ప్రక్రియను కొనసాగించాలని ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం అధికారులకు సూచించారు. తుది పరీక్షలను నిర్వహించి… సాధ్యమైనంత త్వరగానే ఫలితాలను ప్రకటించాలని బోర్డు కూడా చూస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్