నేరుగా ఓటీటీలోకి ప్రియాంకా చోప్రా యాక్షన్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రిలీజ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

నేరుగా ఓటీటీలోకి ప్రియాంకా చోప్రా యాక్షన్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రిలీజ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

ప్రియాంకా చోప్రా నటించిన ఓ యాక్షన్ కామెడీ మూవీ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేస్తూ.. మూవీ స్ట్రీమింగ్ తేదీని ప్రియాంకా వెల్లడించింది.

నేరుగా ఓటీటీలోకి ప్రియాంకా చోప్రా యాక్షన్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రిలీజ్ డేట్ ఇదే

రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఎస్ఎస్ఎంబీ29 మూవీలో మహేష్ బాబు సరసన నటిస్తున్న ప్రియాంకా చోప్రా అటు హాలీవుడ్ లోనూ బిజీగానే ఉంటోంది. ఆమె నటించిన ఓ యాక్షన్ కామెడీ మూవీ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ కు రాబోతోంది. మరి ఆ మూవీ వివరాలేంటో చూడండి.

హెడ్స్ ఆఫ్ స్టేట్ ఓటీటీ రిలీజ్ డేట్

ప్రియాంకా చోప్రా నటించిన మూవీ హెడ్స్ ఆఫ్ స్టేట్. ఇదొక యాక్షన్ కామెడీ జానర్ సినిమా. ఇందులో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనాతోపాటు ఇద్రిస్ ఎల్బా కూడా నటిస్తున్నారు. ఈ మూవీ జులై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

“ఈ సినిమా కోసం మీరు హాయిగా సోఫాకు అతుక్కుపోతారు. హెడ్స్ ఆఫ్ స్టేట్ జులై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో” అనే క్యాప్షన్ తో ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీగా రాబోతోంది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

హెడ్స్ ఆఫ్ స్టేట్ మూవీ గురించి..

ఈ మూవీని ఇలియా నైషుల్లెర్ డైరెక్ట్ చేశారు. ఈ హెడ్స్ ఆఫ్ స్టేట్ మూవీలో జాన్ సీనా అమెరికా అధ్యక్షుడి పాత్రలో నటిస్తుండటం విశేషం. తాను నటించే సమయంలో చేతిలో గన్స్ తో కూల్ గా కనిపిస్తానని అతడు అనుకుంటాడు. ఇక ఇద్రిస్ ఎల్బా ఇందులో యూకే ప్రైమ్ మినిస్టర్ గా నటిస్తున్నాడు.

ఛాన్స్ దొరికినప్పుడల్లా అమెరికాను వెక్కిరించడమే అతనికి తెలిసింది. మరోవైపు ప్రియాంకా చోప్రా జోనాస్.. ఎంఐ6 ఏజెంట్ గా కనిపించనుంది. ఈ యాక్షన్ కామెడీ మూవీలో జాక్ క్వాయిడ్, కార్లా గుగినో, స్టీఫెన్ రూట్, సారా నైల్స్, రిచర్డ్ కోయ్‌లే, ప్యాడీ కాన్సిడైన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.

ఇద్దరు ప్రపంచ నేతలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ప్రపంచాన్ని రక్షించడం కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ మూవీ స్టోరీ. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా తెలుగులో మహేష్ బాబు సరసన ఎస్ఎస్ఎంబీ29 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024