వీసీ పిలిచి లెక్చరర్ పోస్ట్‌ ఇస్తానంటే వద్దన్నాను…. మైండ్ సెట్‌షిఫ్ట్ పుస్తకావిష్కరణలో ఏపీ సీఎం చంద్రబాబు

Best Web Hosting Provider In India 2024

వీసీ పిలిచి లెక్చరర్ పోస్ట్‌ ఇస్తానంటే వద్దన్నాను…. మైండ్ సెట్‌షిఫ్ట్ పుస్తకావిష్కరణలో ఏపీ సీఎం చంద్రబాబు

Sarath Chandra.B HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu

నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్లనైనా అధిగమించవచ్చునని, మనిషి దృఢ సంకల్పం ఎంతలా పని చేస్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్‌సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మైండ్ సెట్ షిఫ్ట్‌ పుస్తకావిష్కరణలో సీఎం చంద్రబాబు, చిరంజీవి
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

మంత్రి నారాయణ కుమార్తె శరణి రాసిన మైండ్‌ సెట్ షిఫ్ట్‌ పుస్తకాన్ని విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. నారాయణ కూతుళ్లను చిన్నపిల్లలుగానే చూశానని, తండ్రిచాటు బిడ్డల్లా నారాయణ సంస్థలను నడుపుతున్నారనుకుంటే, ఉన్నత స్థితికి ఎదిగిన మిమ్మల్ని నారాయణ కుమార్తెలను చూసి ఆశ్చర్యపోయినట్టు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

మంచి అంశాన్ని ఎంచుకుని మైండ్ సెట్‌ను మార్చుకుంటే ఏదైనా సాధించగలరని అతి చిన్న వయసులోనే పుస్తకం రాసి నిరూపించిన శరణిని సీఎం చంద్రబాబు, చిరంజీవి అభినందించారు.

లెక్చరర్ పోస్ట్ ఇస్తానంటే వద్దన్నా…

చదువుకునే సమయంలో నువ్వు బాగా చదవితే ఐఏఎస్ అవుతావని కొందరు చెప్పేవారని ఐఎఎస్ అయితే పదిమందిలో ఒకడిని అవుతానని అనుకున్నానని యూనివర్సిటీలో మా వీసీ పిలిచి లెక్టరర్ పోస్ట్ ఇస్తాను చేరతారా అంటే వద్దని చెప్పానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పాను. అనుకున్న ప్రకారం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాక మంత్రి అవ్వాలని అనుకున్నానని వివరించారు.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పటి సీఎం చెన్నారెడ్డి దగ్గరకు వెళ్లి మంత్రి పదవి కావాలని అడిగానని నిన్నటి వరకు యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్న నువ్వు… ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి, అప్పుడే మంత్రి పదవి అడుగుతున్నావని అన్నారని నాకు అర్హత ఉంటే ఇవ్వండని చెప్పి వచ్చానని ఆ తర్వాత రెండేళ్లకే సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యానన్నారు.

తర్వాత నందమూరి జయకృష్ణ సూచనతో ఎన్టీఆర్ ని కలిసిన తర్వాత భువనేశ్వరితో పెళ్లికి ప్రతిపాదన పంపారని చిరంజీవి కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చారని ఎన్టీఆర్ కూడా కష్టపడి పైకొచ్చారన్నారు.

ప్రతి వ్యక్తి జీవితంలో ఛాలెంజ్, సంక్షోభం వస్తాయి. ఏ రాజకీయ నాయకుడికి రానన్ని సంక్షోభాలు నాకు వచ్చాయి. వాటిని బలంగా ఎదుర్కొని పైకి వచ్చాను. గాంధీ, అంబేద్కర్ సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. అంబేద్కర్ అంటరాని తనం, అవమానాలు భరించి రాజ్యాంగాన్ని రాసి చిరస్థాయిగా భావితరాలకు ఆదర్శంగా నిలిచారు.

అధికారుల్ని మార్చలేను..

నారాయణ సంస్థల్లో సిబ్బందిని ఎంపిక చేసుకోగలుగుతారు, కావాలంటే మార్చగలుగుతారు. నేను ప్రభుత్వంలో ఉన్న అధికారులందరినీ మార్చలేని గానీ వారి స్థానాలను మార్చగలను. 1995లో నేను సీఎం అయ్యాను. ఐటీ అంటే తెలియని అధికారులు నాడు ఉన్నారు. ఆ సమయంలోనే హైటెక్ సిటీ నిర్మించాం. పల్లెటూర్ల నుంచి చాలా మంది వచ్చి ఐటీ ఉద్యోగాలు చేశారు.

నారాయణ విద్యాసంస్థలను కూడా ప్రోత్సహించానని ఆ రోజుల్లో ఐఐటీలో ఒకశాతం కూడా అడ్మిషన్స్ వచ్చేవి కావని విద్యాసంస్థల అధినేతలను పిలిచి ఐఐటీలో మనం నెంబర్ వన్‌గా ఉండాలని చెప్పానన్నారు. తర్వాత వచ్చిన మార్పులతో 20 శాతం సీట్లు మనవాళ్లే సాధిస్తున్నారని చంద్రబాబు వివరించారు.

బిట్స్ పిలానీలో 70 శాతం తెలుగువారే ఉండేవారని, ఇంతమంది ఎలా వస్తున్నారు, మార్కులు తారుమారు చేస్తున్నారేమోనని వాళ్ల సొంత వ్యవస్థతో పరీక్షలు నిర్వహించినా ఏమాత్రం తగ్గకుండా మనవాళ్లు ఎంపికయ్యారని చెప్పారు.

గతంలో సరైన టెక్నాలజీ ఉండేది కాదని ఇప్పుడు టెక్నాలజీతో పాటు రియల్ టైం సమాచారం వచ్చిందన్నారు. ‘మైండ్ సెట్ ఫిష్ట్ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలి. మనం చేసే ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు ఉన్నత స్థాయికి తీసుకొస్తాయి.

తాను సీఎంగా ఉన్నసమయంలో చిరంజీవి కలిశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్ పెడతాను.. స్థలం ఇవ్వాలని కోరారు. సినిమాల్లో ఉండి సామాజిక సేవకోసం మంచి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి అని చంద్రబాబు కొనియాడారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం

టాపిక్

Chandrababu NaiduTdpVijayawadaChiranjeeviAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024