





Best Web Hosting Provider In India 2024

గూస్ బంప్స్ గ్యారెంటీ.. జియోహాట్స్టార్లో తప్పకుండా చూడాల్సిన స్పోర్ట్స్ మూవీస్.. ఓ లుక్కేయండి
సమ్మర్ వచ్చేసింది. వీకెండ్ కూడా రెడీగా ఉంది. స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. బయటకు వెళ్దామంటే ఎండ హడలెత్తిస్తోంది. అందుకే ఇంట్లో కూర్చునే ఫ్యామిలీతో కలిసి ఈ స్పోర్ట్స్ మూవీస్ ను చూసేయండి. జియోహాట్స్టార్లో తప్పకుండా చూడాల్సిన ఈ స్పోర్ట్స్ మూవీస్ పై ఓ లుక్కేయండి
ఓ వైపు ఐపీఎల్ ఊపేస్తోంది. మరోవైపు సమ్మర్ హాలీడేస్ లో తమ పిల్లలను స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్ ల్లో చేర్చేందుకు పేరేంట్స్ రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ను అలరించేందుకు అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ మూవీస్ పై కూడా ఓ లుక్కేయండి. క్రీడలంటే కేవలం శారీరక శ్రమ కోసం ఆడేవి మాత్రమే కాదు. స్పోర్ట్స్ వల్ల డిసిస్లేన్ వస్తుంది. స్ఫూర్తి కలుగుతోంది.
లీడర్ షిప్ క్వాలిటీస్ నేర్చుకోవచ్చు. టీమ్ స్పిరిట్ అలవడుతుంది. ఈ సినిమాల్లో కూడా ఇవన్నింటినీ చూపించారు. స్పోర్ట్స్ ఎలాంటి కిక్ ను ఇస్తాయో, ఎలాంటి ఎమోషన్స్ ను బయటపెడతాయో ఊహించలేం. మరి ఎందుకు ఆలస్యం.. జియోహాట్స్టార్ ఓటీటీలో ఉన్న ఈ స్పోర్ట్స్ మూవీస్ ను చూసేయండి.
83
అసాధ్యం అనుకున్నది అందితే కలిగే ఫీలింగ్ వేరే లెవెల్. 1983లో కపిల్ డెవిల్స్ అదే సాధించారు. దేశానికి ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ అందించారు. ఆ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ గా వచ్చిన ‘83’ మూవీ మనల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్తోంది. కపిల్ గా రణ్ వీర్ సింగ్ అద్భుతంగా నటించారు. ఈ హిందీ మూవీ జియోహాట్స్టార్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
కౌన్ ప్రవీణ్ తాంబే?
41 ఏళ్ల వయసు అంటే ఏ క్రికెటర్ అయినా రిటైర్ అయిపోతారు. కానీ ఆ వయసులో డెబ్యూ చేసిన ప్రవీణ్ తాంబే స్టోరీ కచ్చితంగా స్ఫూర్తి కలిగించేదే. లక్ష్య సాధనలో వయసు అడ్డంకి కాదని చాటిన అతని లైఫ్ స్టోరీతో వచ్చిన ‘కౌన్ ప్రవీణ్ తాంబే’ మూవీ అదరగొట్టింది. ఈ మూవీ హిందీ, తమిళ్, తెలుగులో అందుబాటులో ఉంది.
ఎంఎస్ ధోని
భారత క్రికెట్ జట్టును కెప్టెన్ గా ఎంఎస్ ధోని మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. అతని జీవితంలో, కెరీర్ లో ట్విస్ట్ లకు కొదవలేదు. అతని బయోపిక్ గా వచ్చిన ‘ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ సూపర్ హిట్ గా నిలిచింది. ధోని క్యారెక్టర్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అదరగొట్టారు. ఈ మూవీ జియోహాట్స్టార్లో హిందీలో చూడొచ్చు.
చాంగ్ కెన్ డంక్
హైస్కూల్ లో అవమానాలు ఎదుర్కొన్న స్టూడెంట్.. బాస్కెట్ బాల్ ఛాంపియన్ గా ఎలా ఎదిగాడన్న కథతో తీసిన అమెరికన్ స్పోర్ట్స్ డ్రామా ‘చాంగ్ కెన్ డంక్’. 5.8 అడుగుల ఎత్తు ఉండే హీరో.. డంక్ (కోర్టులో ఎగిరి బాల్ ను బాస్కెట్ లో వేయడం) చేస్తాననే సవాలును ఎలా సాధించడానేది థ్రిల్ కలిగిస్తుంది. ఇంగ్లీష్ లో ఈ మూవీ చూడొచ్చు.
గోలన్ దాజ్
ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫుట్ బాల్ గా పేరు గడించిన నాగేంద్ర ప్రసాద్ సర్బాదికారి బయోపిక్ గా వచ్చిన బెంగాలీ ఫిల్మ్ ‘గోలన్ దాజ్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ఫిల్మ్ లో ఉండే అప్ అండ్ డౌన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తాయి.
పంగా
ఒకప్పటి కబడ్డీ ఛాంపియన్ తల్లిగా మారాక పూర్తిగా ఆటకు దూరమవుతుంది. కానీ అమ్మ గురించి తెలుసుకున్న కొడుకు.. ఆమెను మళ్లీ ఆడాల్సిందిగా ఎంకరేజ్ చేస్తాడు. ఏడేళ్ల కొడుకుకు తల్లిగా, ఫిట్ నెస్ సమస్యలు దాటి మళ్లీ కోర్టులో అడుగుపెట్టిన ఆ తల్లి ఛాంపియన్ గా ఎలా ఎదిగిందనేదే ‘పంగా’ కథ. కంగనా రనౌత్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ హిందీలో ఉంది.
సంబంధిత కథనం