





Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్: కార్తీక్ రెండో పెళ్లి -దీపకు విడాకులు -సాక్ష్యాలు కొనేసిన జ్యోత్స్న
కార్తీక దీపం 2 ఏప్రిల్ 25 ఎపిసోడ్‌లో జైలులో ఉన్న దీపను కలవడానికి కావేరి, శ్రీధర్ వస్తారు. దీపకు పదేళ్లు జైలు శిక్ష తప్పదని శ్రీధర్ అంటాడు. తప్పు చేసింది నువ్వు అయితే శిక్ష తన కొడుకు అనుభవించడానికి వీలులేదని, కార్తీక్‌కు రెండో పెళ్లి చేస్తానని అంటాడు.
దశరథ్‌ను గన్‌తో షూట్ చేసిన కేసులో దీపకు బెయిల్ దొరకదు. ఆమెకు జడ్జ్ రిమాండ్ విధిస్తుంది. పోలీసులు దీపను జైలులో పెడతారు. తన పరిస్థితిని తలచుకొని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. దశరథ్‌ను హాస్పిటల్ నుంచి డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తారు. భర్తకు హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొస్తుంది సుమిత్ర.
కుటుంబ సభ్యులను చూడగానే…మిమ్మల్ని మళ్లీ చూస్తానని అనుకోలేదని దశరథ్ ఎమోషనల్ అవుతాడు. చెల్లికి ఈ విషయం తెలుసా అని శివన్నారాయణను అడుగుతాడు దశరథ్. నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావన్నది మాకు సంతోషాన్ని కలిగించే విషయమే కానీ వాళ్లకు కాదని శివన్నారాయణ అంటాడు.
కోడలు జైలుకు వెళుతుందనే భయంతో…
ఇంత జరిగిన నీకు చెల్లెలు గుర్తొచ్చింది. కానీ చెల్లెలికి నువ్వు గుర్తులేవు. అన్నయ్య బతికున్నాడో…చచ్చిపోయాడా దానికి అవనసరం అని కోపంగా అంటాడు శివన్నారాయణ అంటాడు.
ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి నీ యోగక్షేమాలు అడిగింది. అది కూడా నీ కోసం కాదు…నీకు ఏదైనా అయితే తన కోడలు జైలులో ఉండిపోతుందనే భయంతో అని శివన్నారాయణ అంటాడు. డాడీ క్షేమంగా ఇంటికొచ్చాడని దీపను వదిలేస్తారా అని జ్యోత్స్న కోపంగా అంటుంది.
దీప బాధను అనుభవించాలి…
మనం పడిన బాధ దీప పడాలని అంటాడు. నెక్స్ట్ కోర్ట్ హియరింగ్‌లో సాక్ష్యాలు, ఆధారాలు చూపించాలి. అవసరమైతే దశరథ్ సాక్ష్యం చెబుతాడు. దీపకు కనీసం పదేళ్లు జైలు శిక్ష పడాలని శివన్నారాయణ కోపంగా అంటాడు. .నీ చెల్లెలు వచ్చి నీ కాళ్లు పట్టుకున్న నువ్వు కరిగిపోవద్దని దశరథ్‌తో అంటాడు. కాంచనకు ఇప్పుడు మన అవసరం లేదని సుమిత్ర చెబుతుంది. ఏమో శౌర్యను తీసుకొచ్చి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయచ్చునని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ లైఫ్ నుంచి దీప వెళ్లిపోయినట్లేనని జ్యోత్స్న సంబరపడుతుంది.
లాయర్ అనుమానం…
దీపను ఈ కేసు నుంచి బయటపడేయడానికి బలమైన సాక్ష్యాలు కావాలని కార్తీక్‌తో చెబుతాడు లాయర్ కళ్యాణ్ ప్రసాద్. నేను ట్రిగ్గర్ మీద వేలు పెట్టలేదని దీప చెబుతుందని కళ్యాణ్ ప్రసాద్ అంటాడు. దశరథ్‌ను షూట్ చేస్తోన్న టైమ్‌లో దీప, జ్యోత్స్నతో పాటు అక్కడ మరో పర్సన్ కూడా ఉండి ఉంటాడని లాయర్ అనుమానపడతాడు. దశధథ్‌కు తగిలిన బుల్లెట్ వేరే గన్ నుంచి వచ్చిందని కళ్యాణ్ ప్రసాద్ చెబుతాడు. అది ఎవరన్నది కనిపెట్టాలని అంటాడు.
శత్రువులు లేరు…
దీపకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఈ మధ్య కాలంలో తనకు ఎవరితోనైనా గొడవలు జరిగాయా అని కార్తీక్‌ను అడుగుతాడు కళ్యాణ్ ప్రసాద్. లాయర్ ఏది అడిగిన కార్తీక్ లేదని అంటాడు. ఈ కేసులో మనం ఎవరో ఇంపార్టెంట్ పర్సన్‌ను మిస్సవుతున్నామని అంటాడు. దీపను కేసులో ఇరికించడానికి ఇంట్లో వాళ్లే ఎవరో బయటివాళ్లకు సాయం చేసి ఉంటారని కళ్యాణ్ ప్రసాద్ అనుమానిస్తాడు.
దీపకు శిక్ష తప్పదు…
ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో బుల్లెట్ దీప గన్‌లో నుంచి వచ్చిందని బయటపడితే దీపకు శిక్ష తప్పదని కళ్యాణ్ ప్రసాద్ అంటాడు. దీపకు శిక్ష పడాలన్నదే జ్యోత్స్న, భగవాస్ దాస్ లక్ష్యమైతే ఈ పాటికే సాక్ష్యాలు, ఆధారాలు కొనేస్తారు. తమకు అనుకూలంగా మార్చుకుంటారని కార్తీక్‌తో కళ్యాణ్ ప్రసాద్ చెబుతాడు.
సాక్ష్యాలు తారుమారు…
దీప కేసును ఇన్వేస్టిగేట్ చేస్తోన్న పోలీస్ ఆఫీసర్‌ను కలుస్తుంది జ్యోత్స్న. దీప పర్మినెంట్‌గా జైలులో ఉండాలని జ్యోత్స్న అంటాడు. అలా ఉండాలంటే తనే నేరం చేసినట్లు సాక్ష్యాలు, ఆధారాలు చూపించాలి. అదే జరిగితే అటెంప్ట్ మర్డర్ కింద దీపకు గట్టిగానే శిక్ష పడుతుందని పోలీస్ ఆఫీసర్ అంటాడు. నాకు కావాల్సింది అదే అని జ్యోత్స్న అంటుంది.
బిగ్‌సర్‌ప్రైజ్…
దీప ఎక్కడుండాలో డిసైడ్ చేయాల్సింది కోర్ట్ అని పోలీస్ ఆఫీసర్ చెబుతాడు. కాదు ఎవిడెన్స్ అని జ్యోత్స్న బదులిస్తుంది. దీపకు శిక్ష పడాలంటే ఎవిడెన్స్ మార్చాలని అంటుంది. మీ కూతురిని చదివించాలని అనుకున్న స్కూల్‌లో ఆడ్మిషన్ మీకు దొరకలేదు. అదే నెంబర్ వన్ స్కూల్‌లో మీకు ఆడ్మిషన్ దొరికితే మీకు సంతోషమేనా అని పోలీస్ ఆఫీసర్‌కు ఓ కవర్ ఇస్తుంది జ్యోత్స్న. ఆ కవర్ ఓపెన్ చేసి ఇది బిగ్‌సర్‌ప్రైజ్ అని పోలీస్ ఆఫీసర్ అంటాడు.
జ్యోత్స్న ప్లాన్…
ఆ గిఫ్ట్‌కు బదులుగా తనకు రిటర్న్ గిఫ్ట్ కావాలని అంటుంది జ్యోత్స్న. దీపను ఇరికించడానికి ఏం చేయాలో పోలీస్ ఆఫీసర్‌కు చెబుతుంది జ్యోత్స్న. ఇది చాలా రిస్క్ అని, ఈ పని తాను చేయలేనని పోలీస్ ఆఫీసర్ అంటాడు. అతడికి డబ్బు ఆశచూపుతుంది జ్యోత్స్న. దీపను జైలుకు పంపించాకా మళ్లీ కలుద్దామని పోలీస్ ఆఫీసర్‌తో చెబుతుంది.
జైలులో ఉన్న దీపకు కలుస్తుంది కావేరి. ఆ రోజు జ్యోత్స్న మాటలు విన్న తర్వాత నేరుగా వెళ్లి సుమిత్రకు చెప్పాల్సింది. ఆ పని చేసుంటే ఇలా నిన్ను జైలులో కలవాల్సివచ్చేది కాదని కావేరి బాధగా చెబుతుంది. అన్ని మన చేతుల్లో ఉంటే భవిష్యత్తును మనకు నచ్చినట్లుగా రాసుకుంటాం కదా అని దీప అంటుంది.
ఎంత మంచి మాటా చెప్పావ్ దీప అని అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన శ్రీధర్ అంటాడు. దీప ఎలాంటిదో నీలాంటివాళ్లకు చెప్పాల్సిన పనిలేదని, దీప నిజాయితీ ఆమెను బయటకు తీసుకొస్తుందని కోపంగా కావేరి అంటుంది. దశరథ్‌ను దీప కాల్చలేదని వాదిస్తుంది.
తప్పు చేశావు…
కొన్ని నిజాలు మాట్లాడుకుందామని దీపతో అంటాడు శ్రీధర్. నువ్వు నా కొడుకు భార్యవి, నాకు కోడలివి అని అంటాడు. దశరథ్‌ను కాల్చి పెద్ద తప్పు చేశావని చెబుతాడు. నేను కాల్చలేదని దీప బదులిస్తుంది. మరి కాల్చకుండా ఇక్కడెందుకు ఉన్నావని శ్రీధర్ వెటకారంగా మాట్లాడుతాడు. నువ్వు ఏ తప్పు చేయలేదంటే నమ్మడానికి కోర్టు ఏం కార్తీక్ కాదని చెబుతాడు.
దీపనే నన్ను కాల్చిందని దశరథ్ చేత సాక్ష్యం చెప్పించాలని జ్యోత్స్న చూస్తుందని శ్రీధర్ అంటాడు. అదే జరిగితే నీకు పదేళ్లు శిక్ష తప్పదని చెబుతాడు. నువ్వు నిర్ధోషి అని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఒక్కటంటే ఒక్కటైనా సాక్ష్యం ఉందా అని దీపను అడుగుతాడు శ్రీధర్. అతడి మాటలకు బదులు ఇవ్వకుండా దీప మౌనంగా ఉంటుంది.
నిన్ను కట్టుకున్న పాపానికి…
శిక్ష పడితే హాయిగా చిప్పకూడు తింటూ జైలులో బతికేస్తావ్. మరి నా కొడుకుతో పాటు నీ కూతురు పరిస్థితి ఏంటి? నిన్ను కట్టుకున్న పాపానికి నీ కూతురిని పెంచుకుంటూ జీవితాంతం ఒంటరిగా బతకాల్సివస్తుందని శ్రీధర్ అంటాడు. బంగారం లాంటి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావని దీపపై నిందలు వేస్తాడు శ్రీధర్. పోని రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చినా కార్తీక్ వినడు అని అంటాడు.
ఇలాంటి బుర్ర తక్కువ సలహాలు ఇవ్వొద్దని శ్రీధర్‌ను కావేరి కోప్పడుతుంది. కార్తీక్ నీ సొంత కొడుకు అయితే ఆ బాధేంటో నీకు తెలిసేది అని శ్రీధర్ బదులిస్తాడు.
శిక్ష ఎందుకు అనుభవించాలి…
కార్తీక్‌ను రెండో పెళ్లి చేసుకోమని దీపనే చెప్పాలని శ్రీధర్ అంటాడు. నీకు నీ భర్తతో విడాకులు అయ్యాకా రెండో పెళ్లి చేసుకోలేదా అని శ్రీధర్ అంటాడు. నీకు శిక్ష పడి జైలుకు వెళితే కార్తీక్ రెండో పెళ్లి చేసుకోవడం తప్పేముందని అంటాడు. తప్పు చేసింది నువ్వైతే నా కొడుకు శిక్ష ఎందుకు అనుభవించాలని అంటాడు.
నీ కారణంగా కార్తీక్ పడిన కష్టాలు చాలాని, వాడిని వదిలేయమని అంటాడు. నువ్వు వదిలేస్తేనే వాడి బతుకుబాగుంటుందని చెబుతాడు.నువ్వు ఒప్పిస్తే కార్తీక్ రెండో పెళ్లిని తాను గ్రాండ్‌గా చేస్తానని దీపతో అంటాడు శ్రీధర్.
శిక్ష తప్పదు….
నీ స్వార్థం కోసం ఆలోచించి కార్తీక్ ఆనందాలను దూరం చేస్తావో…నీ స్థానం వేరే వారికి ఇచ్చి కార్తీక్ ఆనందంగా ఉండేలా చూస్తావో నీ ఇష్టం. కానీ ఒక్కటి మాత్రం నిజం నీకు శిక్ష తప్పదు. శివన్నారాయణ నిన్ను వదిలిపెట్టడు. అందుకే కార్తీక్‌కు విడాకులు ఇచ్చి జైలులో ప్రశాంతంగా ఉండమని దీపకు సలహా ఇస్తాడు. . అందరి జీవితాలను నాశనం చేయడం నీకు అలవాటే కదా…కార్తీక్ జీవితాన్ని తగిలేయమని అవమానిస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం