ఒత్తిడి, ఆందోళనను తగ్గించే సులభమైన మార్గం, తేనెటీగ శబ్దంతో చేసి భ్రమరీ ప్రాణాయామం!

Best Web Hosting Provider In India 2024

ఒత్తిడి, ఆందోళనను తగ్గించే సులభమైన మార్గం, తేనెటీగ శబ్దంతో చేసి భ్రమరీ ప్రాణాయామం!

Ramya Sri Marka HT Telugu

ఒత్తిడిని, టెన్షన్ తట్టుకోలేకపోతున్నారా? ప్రశాంతంగా ఉండేందుకు సింపుల్ మార్గం కావాలా? అయితే రోజుకో 10 నిమిషాలు భ్రమరీ ప్రాణాయామం చేయండి. ఆందోళనలను తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచడానికి ఇది చాలా బాగా పని చేస్తుంది. భ్రమరీ ప్రాణాయామం వల్ల కలిగే లాభాలేంటి, దీన్ని ఎలా చేయాలి తెలుసుకుందాం రండి.

భ్రమరీ ప్రాణాయామం చేయడం ఎలాగో తెలుసుకోండి

ప్రస్తుత జీవనశైలిలో ప్రతిరోజూ శరీరం కన్నా ఎక్కువగా మన మెదడును, మనసును ఉపయోగిస్తుంటాం.ఇంటి పనీ, ఆఫీసు పనీ, ఫోన్ నోటిఫికేషన్లు, ఎక్స్‌పెక్టేషన్లు, డెడ్‌లైన్లు, ఎమోషన్లు ఇవన్నీ కలసి మనలో ఓ రకమైన ఆంతరిక గందరగోళాన్ని సృష్టిస్తుంటాయి. ఈ సమయంలో మన మనసుని ప్రశాంతంగా ఉంచి, అంతర్గతంగా మనల్ని బలంగా మార్చే మార్గం ఏదైనాఉందా అంటే.. అది శ్వాస వ్యాయామాలు అంటే ప్రాణాయామం ఒక్కటే అంటున్నారు వైద్య నిపుణులు.

ప్రాణాయామాలలో భ్రమరీ ప్రాణాయామం (Bhramari Pranayama) చాలా ప్రత్యేకమైనది.మనసును, శరీరాన్ని, ఆత్మను ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఇబ్బందుల నుంచి తప్పించే ప్రశాంతంగా మార్చే శక్తి దీనికి ఉంటుంది. ఇది శబ్దం ద్వారా మనసును ప్రభావితం చేసే అద్భుతమైన సాధన.దీన్ని చేయడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి.

భ్రమరీ ప్రాణాయామం అంటే ఏంటి?

“భ్రమరీ”అనేది సంస్కృత పదం, దీని అర్థం “తేనెటీగ”. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనం శ్వాసను విడిచేటప్పుడు తేనెటీగ చేసే బజ్జింగ్ లాంటి శబ్దాన్ని చేస్తాం. ఇది బయటకు వినిపించకపోయినా మన చెవుల్లో, మెదడులో, హృదయంలో ఒక శాంతియుతమైన ప్రకంపనను కలిగిస్తుంది. ఈ ప్రాణాయామాన్ని చేయడం వల్ల శరీరం, మనస్సు, మన ఆత్మ – అన్నింటికీ ప్రయోజనం చేకూరుతుంది.ముఖ్యంగా శరీరం కన్నా ఎక్కువగా మనసుని ప్రశాంతపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని “ధ్వనితో ధ్యానం”(Humming Bee Breath) అని కూడా పిలుస్తారు.

భ్రమరీ ప్రాణాయామం వల్ల కలిగే భౌతిక లాభాలు (Physical Benefits):

1. తలనొప్పులు & మైగ్రేన్‌కు ఉపశమనం

భ్రమరీ ప్రాణాయామం చేయడం వల్ల మెదడులోని ఒత్తిడిని తగ్గడమే కాకుండా, మైగ్రేన్ టైప్ తలనొప్పులకు సహజమైన నివారణ లభిస్తుంది.

2. రక్తపోటు నియంత్రణ

శ్వాసపై ధ్యాస పెట్టి చేసే ఈ ప్రాణాయామంతో హృదయ స్పందన స్థిరంగా ఉండి, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. హై బీపీ ఉన్నవారికి ఇది సహజమైన చికిత్సలా పనిచేస్తుంది.

3.శ్వాస సంబంధిత సమస్యలలో ఉపశమనం

అస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో భ్రమరీ ప్రాణాయామం చాలా బాగా సహాయపడుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఇది మంచి వ్యాయామం.

4. గొంతు ఆరోగ్యం

తేనెటీగ శబ్దం చేస్తూ వ్యాయామం చేయడం వల్ల గొంతు కణజాలానికి మృదువైన మర్దన జరుగుతుంది. ఇది వాయిస్ క్లారిటీ, వోకల్ స్టెబిలీటీని పెంచడంలో సహాయపడుతుంది.

భ్రమరీ ప్రాణాయామం వల్ల కలిగే మానసిక లాభాలు (Mental Benefits):

1. ఒత్తిడి తగ్గుతుంది

భ్రమరీ శబ్దం మన మెదడును ఆహ్లాదంగా ఉంచుతుంది. కార్టిస్టాల్ స్థాయిలు తగ్గిపోతాయి. దీని వల్ల మనం మానసికంగ ప్రశాంతంగా మారతాం.

3. నిద్ర నాణ్యత మెరుగవుతుంది

తేనెటీగ శబ్దం మెదడులో మెలటోనిన్ హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది. ఇది నిద్ర బాగా రావడానికి సహాయపడుతుంది.

4. ఏకాగ్రత పెరుగుతుంది

భ్రమరీ చేస్తున్న సమయంలో మెదడులో ఆల్ఫా తరంగాలు యాక్టివ్ అవుతాయి. ఫలితంగా ఫోకస్, మెమరీ పెరుగుతుంది. ఇది విద్యార్థులకు గొప్ప సాధన.

5. భావోద్వేగ నియంత్రణ

భావప్రబలత తగ్గి, మనసు సమతుల్యంగా మారుతుంది. కోపం, భయం, బాధ వంటి భావాలు తగ్గిపోతాయి.

భ్రమరీ ప్రాణాయామం వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలు (Spiritual Benefits):

1. మూడవ నేత్రం (Third Eye) ఉత్తేజితం

భ్రమరీ ధ్వని వల్ల బ్రౌ మధ్యలో ఉన్న ఆజ్ఞా చక్రం యాక్టివ్ అవుతుంది. దీని వల్ల అంతర్ముఖత, ఆత్మజ్ఞానం పెరుగుతాయి.

2. మౌనం – ధ్యానానికి దారి

భృకుటి మధ్య ఫోకస్ చేస్తూ శబ్దాన్ని విడుదల చేయడం ద్వారా మనలో మౌన ధ్యాన స్థితి ఏర్పడుతుంది.

3. ఆత్మ విశ్రాంతి

భ్రమరీ శబ్దం మనకు అంతర్గత శబ్దాలపై దృష్టి పెట్టే సామర్థ్యం ఇస్తుంది. దీని వల్ల ఆధ్యాత్మిక పరిపక్వత పెరుగుతుంది.

భ్రమరీ ప్రాణాయామం వల్ల కలిగే శాస్త్రీయ లాభాలు (Scientific Benefits):

1. బ్రెయిన్ వేవ్స్ స్టిమ్యులేట్ అవడం

శబ్దం వల్ల మెదడులో ఆల్ఫా, గామా తరంగాలు ఎక్కువవుతాయి. ఇవి రిలాక్సేషర్, క్రియేటివిటీని పెంచుతాయి.

2. వేగస్ నర్వ్ యాక్టివేషన్

వేగస్ నర్వ్ – శరీరంలోని “శాంతియుత” ప్రతిచర్యలకు బాధ్యత వహించే నర్వ్. భ్రమరీ ప్రాణాయామం దీన్ని నేచురల్‌గా యాక్టివేట్ చేస్తుంది.

3. ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల

భ్రమరీ ప్రాణాయామం చేస్తున్నపుడు సెరోటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లు పెరుగుతాయి. ఇవి మూడ్ స్టేబిలైజ్ చేస్తాయి.

4. శ్రవణ కేంద్రాలపై ప్రభావం

వినే శక్తిని పెంచడమే కాకుండా, శబ్దం పట్ల అవగాహన పెరుగుతుంది. ఇది మ్యూజిక్ ప్రాక్టీస్ చేసే వారికి ఉపయోగపడుతుంది.

భ్రమరీ ప్రాణాయామం చేయడం ఎలా?

  1. ఈ ప్రాణాయామం చేయడానిక ముందుగా నేలపై ప్రశాంతంగా కూర్చోవాలి.
  2. నడుమును నిటారుగా ఉంచి కళ్లు మూసుకోండి.
  3. ఇప్పుడు రెండు చెవులలో రెండు వేళ్ల బొటన వేలును పెట్టి బయటి శబ్దాలు వినపడకుండా చేయండి.
  4. తరువాత చూపుడు వేలు, మధ్య వేళ్లను తీసుకొచ్చి రెండు కళ్ల మీద ఉంచండి.
  5. తరువాత ఉంగరపు వేలిని పెదాలకు తాకించి చిటికెన వేలును అలాగే వదిలేయండి.
  6. ఇప్పుడు ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి తేనెటీగలా శబ్దం చేస్తూ మీకు వీలైనంత సేపు అలాగే ఉండండి. తర్వాత రిలాక్స్ అవండి. అంతే ఇలా రోజుకో పది నిమిషాలు కేటాంచి చేయడం అలవాటు చేసుకోండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024