ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు.. చూసేందుకు 6 చాలా స్పెషల్.. తెలుగులో 3 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు.. చూసేందుకు 6 చాలా స్పెషల్.. తెలుగులో 3 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఆరు మాత్రమే ఉంటే తెలుగులో కేవలం 3 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు.. చూసేందుకు 6 చాలా స్పెషల్.. తెలుగులో 3 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తూ ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. ప్రతివారం విభిన్న కాన్సెప్ట్‌లతో ఈ సినిమాలు ఓటీటీలో అలరిస్తుంటాయి. అయితే, వారంలో ఒక్క శుక్రవారం మాత్రమే అధికంగా ఓటీటీ రిలీజెస్ జరుగుతుంటాయి.

ఒక్కరోజే 10

ఈ వారం కూడా సుమారుగా 15కిపైగా ఓటీటీ సినిమాలు రిలీజ్ అయితే ఇవాళ ఒక్కరోజే 10 మూవీస్ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, మనోరమ మ్యాక్స్, జీ5, ఆహాలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మ్యాడ్ స్క్వేర్ (తెలుగు కామెడీ మూవీ)- ఏప్రిల్ 25

జువెల్ థీఫ్- ది హీస్ట్ బిగిన్స్ (హిందీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 25

హావోక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 25

వీక్ హీరో క్లాస్ 2 (కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25

మనోరమ మ్యాక్స్ ఓటీటీ

కుమ్మట్టికలి (మలయాళం క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 25

కల్లం (మలయాళం డ్రామా చిత్రం)- ఏప్రిల్ 25

యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

వోండ్లా (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

నిరమ్ మారుమ్ ఉలగిల్ (తమిళ అంథాలజీ క్రైమ్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 25 (సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీలో కూడా)

జీ5 ఓటీటీ

అయ్యన మనే (కన్నడ హారర్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25

ఆహా ఓటీటీ

యాత్తి సాయి (తెలుగు యాక్షన్ వార్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 25

ఓటీటీలోకి ఇవాళ 10

ఇలా ఇవాళ (ఏప్రిల్ 25) సినిమాలు,వెబ్ సిరీస్‌లు కలుపుకుని మొత్తంగా 10 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఇదివరకే కొన్ని ప్రసారం అవుతున్నాయి. మరికొన్ని మధ్యాహ్నాం, సాయంత్రం సమయాల్లో ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

చూసేందుకు స్పెషల్ సినిమాలు

వీటన్నింటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా తెలుగు సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాడ్ స్క్వేర్, వార్ డ్రామా యాత్తి సాయి, నేరుగా ఓటీటీ రిలీజ్ కానున్న హిందీ చిత్రం జువెల్ థీఫ్, తెలుగు డబ్బింగ్ యాక్షన్ థ్రిల్లర్ హావోక్, అంథాలజీ సినిమా నిరమ్ మారుమ్ ఉలగిల్, కన్నడ హారర్ కైమ్ సిరీస్ అయ్యన మనే ఉన్నాయి.

తెలుగులో 3 మాత్రమే

అంటే, ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన తొమ్మిదిలో ఆరు మాత్రమే చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో కూడా మూడు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024