





Best Web Hosting Provider In India 2024

పహల్గాంలో హిట్ 3 మూవీ షూటింగ్.. ఉగ్రదాడికి మూడు నెలల ముందు 20 రోజులు అక్కడే.. నాని పోస్టు వైరల్
అందాల కశ్మీర్ లోని పహల్గాం రక్తపాతంతో ఎరుపెక్కింది. అక్కడ టూరిస్ట్ లపై జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. అక్కడి అందమైన లోకేషన్లలో మూవీ షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. తాజాగా హిట్ 3 మూవీ షూటింగ్ కూడా అక్కడే జరిగింది.
జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర దాడితో ప్రపంచం ఉలిక్కిపడింది. 26 మంది అమాయిలకు పొట్టనబొట్టుకున్న ఈ టెర్రిరిస్ట్ ఎటాక్ ను ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించింది. కొండలు, లోయలు.. ఇలా ప్రకృతి అందాలతో ఆ ప్రదేశం పర్యాటకులను కట్టిపడేస్తుంటుంది. అలాంటి చోట రక్తపాతం జరిగింది. ఎవరూ ఊహించని మారణ హోమం ఇది. దీనిపై సెలబ్రిటీలు కూడా రియాక్టయ్యారు. ముఖ్యంగా నాని చేసిన పోస్టు వైరల్ గా మారింది. దీని వెనుక ఓ కారణముంది.
హృదయం పగిలింది
‘‘మూడు నెలల క్రితం మేం అక్కడున్నాం. 200 మందికి పైగా టీమ్ కలిసి 20 రోజులున్నాం. పహల్గాం ఓ కల లాంటిది. ఆ ప్రదేశం, ఆ ప్రజలు ఎంతో గొప్పవాళ్లు. హృదయం పగిలింది. మాటలు రావడం లేదు. ఎందుకు?’’ అని ఎక్స్ లో నాని పోస్టు చేశారు. పహల్గామ్ లో ఉగ్రదాడికి ముందు హిట్ 3 సినిమా షూటింగ్ జరిగిందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
మాస్ యాక్షన్ తో
హిట్ ఫ్రాంఛైజీలో వస్తున్న మూడో సినిమా ‘హిట్ 3’లో నాని పూర్తిగా మాస్ యాక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల రిలీజైన ట్రైలర్ లో అతని యాక్షన్ సీక్వెన్స్ వైరల్ గా మారాయి. వైలెన్స్ తో కూడిన రక్తపాతం కనిపించింది. 2024 సెప్టెంబర్ లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు పహల్గాంలో షూట్ చేశారు.
నాని, శ్రీనిధి జోడీగా నటించిన ‘హిట్ 3’ మూవీ మే 1న రిలీజ్ కానుంది. నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమాతో పాటు యునానిమస్ ప్రొడక్షన్ ఈ మూవీని నిర్మించారు. దీనికి ప్రశాంతి తిపిర్నేణి ప్రొడ్యూసర్. శైలెష్ కొలను డైరెక్టర్. ఈ యాక్షన్ థ్రిల్లర్ తో నాని మరో హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలో నుంచి ఒక్కో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.
సంబంధిత కథనం