




Best Web Hosting Provider In India 2024

వెంట్రుకల చివర్లు చిట్లిపోయి విసుగ్గా అనిపిస్తుందా? ఈ సూపర్ సింపుల్ సీక్రెట్స్‌తో సమస్యకు గుడ్ బై చెప్పండి!
మీ జుట్టు ఎంత బాగున్నా చివర్లో స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయా? డల్‌గా,నిర్జీవంగా కనిపిస్తుందా? డోంట్ వర్రీ! ఇది చాలా మందికి ఎదురయ్యే సమస్యే. కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే దీని నుంచి బయటపడచ్చు. మీ జుట్టు మళ్లీ కళకళలాడుతూ, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలని ఇక్కడ తెలుసుకోండి.
జుట్టు అందాన్ని మరింత పెంచుతుందనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఒక్కోసారి ఆ జుట్టు చివర్లు చిట్లిపోయి, దాన్ని కళ తప్పుతుంది. దువ్వినా చిక్కులు పడతాయి, చూడటానికి కూడా అంత బాగుండదు. అద్దంలో చూసుకుంటే ఏదో వెలితిగా అనిపిస్తుంది. కారణాలేవైనా ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. మీరు కూడా మీ జుట్టు విషయంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నట్లయితే ఈ కథనం మీకు కచ్చితంగా సహాయపడుతుంది.
వెంట్రుకల విషయంలో సరైన జాగ్రత్తలు, కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చివర్లు చిట్లిపోయేసమస్యను తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. వీటితో మీ జుట్టు మళ్లీ ఒత్తుగా, ఆరోగ్యంగా, మెరిసేలా తయారవుతుంది. ఆ చిట్కాలేంటో తెలుసుకుని ట్రై చేయండి.
వెంట్రుకల చివర్లు చిట్లిపోకుండా ఉండటానికి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు:
జుట్టును ప్రేమగా చూసుకోండి (Gentle Love):
1. జుట్టును సున్నితంగా చూసుకోవడం:
వెంట్రుకుల బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే తల దువ్వే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద పళ్ల దువ్వెన లేదా డీట్యాంగిల్ బ్రష్ తీసుకోండి. పై నుంచీ కిందకు కాకుండా చివర్ల నుంచి చిక్కులు తీసుకుంటూ పైకి దువ్వడం అలవాటు చేసుకోండి. గట్టిగా లాగడం, దువ్వడం వంటి చేయకండి.
2. తడి జుట్టును జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి:
తడి జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎప్పుడూ గట్టిగా రుద్దకూడదు. మెల్లగా మెత్తటి టవల్ తో తలను తుడుచుకోవాలి. అలాగ తడి ఆరకముందే జుట్టును దువ్వడం మంచిది కాదు. ఒకవేళ దువ్వాల్సి వస్తే పెద్ద పళ్ల దువ్వెనతో నెమ్మదిగా, సున్నితంగా దువ్వండి. ఏమాత్రం బలం ఉపయోగించినా వెంట్రుకలు ఊడిపోతాయి.
3. ఎక్కువగా తలస్నానం చేయకండి:
ఎక్కువగా తలస్నానం చేస్తే జుట్టులోని సహజ నూనెలు పోతాయి.దానివల్ల జుట్టు పొడిగా, బలహీనంగా మారుతుంది. మీ జుట్టు రకం, తలలో నూనెను బట్టి రెండు మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేయడానికి ప్రయత్నించండి.
4. సరైన షాంపూ, కండీషనర్ ఉపయోగించండి:
మీ జుట్టు రకానికి తగిన, ఎక్కువ రసాయనాలు లేని షాంపూ, కండీషనర్‌ను ఎంచుకోండి. వీలైనంత వరకూ తలకు, వెంట్రుకలకు తేమను అందించే షాంపూ,కండీషనర్ల కోసం చూడండి.
5. క్రమం తప్పకుండా డీప్ కండీషనింగ్ చేయండి:
వారానికి ఒకసారి డీప్ కండీషనర్ లేదా హెయిర్ మాస్క్‌ను ఉపయోగించి మీ జుట్టుకు అదనపు తేమ, పోషణను అందించండి. ముఖ్యంగా జుట్టు చివర్లపై దృష్టి పెట్టండి.
6. పడుకునేటప్పుడు జుట్టును రక్షించండి:
పట్టు లేదా శాటిన్ దిండు కవర్‌ను ఉపయోగించడం వల్ల జుట్టు రుద్దడం తగ్గి, చిట్లిపోకుండా ఉంటుంది. మీరు పడుకునే ముందు మీ జుట్టును వదులుగా జడ వేసుకోవడం మరింత మంచిది.
వేడిని ఉపయోగించడం తగ్గించండి:
8. స్టైలింగ్ తగ్గించండి:
బ్లో డ్రైయర్లు, ఫ్లాట్ ఐరన్లు, కర్లింగ్ ఐరన్ల వంటి వాటిని ఉపయోగించడం ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. ఇలా వేడిని ఉపయోగించే స్టైలింగ్ టూల్స్‌ను ఎక్కువగా ఉపయోగించకండి. ఎక్కువ వేడి జుట్టును దెబ్బతీస్తుంది, చిట్లిపోవడానికి కారణమవుతుంది.
9. హీట్ ప్రొటెక్టెంట్ ఉపయోగించండి:
మీరు తప్పనిసరిగా వేడిని ఉపయోగించే స్టైలింగ్ టూల్స్‌ను ఉపయోగిస్తే, ముందుగా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేను అప్లై చేయడం మర్చిపోవద్దు. ఇది మీ జుట్టును వేడి నుండి రక్షిస్తుంది.
10. తక్కువ వేడి సెట్టింగ్‌లను ఉపయోగించండి:
వేడిని ఉపయోగించే టూల్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, సాధ్యమైనంత సెట్టింగ్ మార్చుకోండి. తక్కువ వేడి పెట్టుకుని ఉపయోగించుకోండి.
రసాయనాల వల్ల కలిగే నష్టాన్ని నివారించండి:
11. ట్రీట్మెంట్ల మధ్య గ్యాప్ ఇవ్వండి:
జుట్టుకు రంగు వేయడం, పెర్మ్ చేయడం లేదా రిలాక్స్ చేయడం వంటివి చేస్తుంటే, ట్రీట్మెంట్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకూ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్లు చేయించుకోండి. రసాయన ట్రీట్మెంట్లు చేయించుకునేటప్పుడు, అనుభవం ఉన్న స్టైలిస్టులు ఉండే మంచి సెలూన్‌కు వెళ్లండి.
12. క్రమం తప్పకుండా ట్రిమ్ చేయించుకోండి:
ప్రతి 6-8 వారాలకు మీ జుట్టును ట్రిమ్ చేయించుకోవడం వల్ల ఇప్పటికే ఉన్న చిట్లిపోయిన జుట్టు తొలగిపోతుంది, అది పైకి వ్యాపించకుండా ఉంటుంది. కొద్దిపాటు కత్తిరింపు కూడా చాలా తేడాను చూపిస్తుంది.
మరిన్ని ముఖ్యమైన జాగ్రత్తలు
– బాగా నీరు త్రాగాలి:
తగినంత నీరు త్రాగటం మొత్తం ఆరోగ్యానికి, మీ జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం.
– సమతుల్య ఆహారం తీసుకోండి:
విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం బలమైన, ఆరోగ్యకరమైన జుట్టుకు చాలా అవసరం.
– వాతావరణం నుండి జుట్టును రక్షించండి:
ఎక్కువ ఎండలో వెళ్లేటప్పుడు టోపీ ధరించడం లేదా UV ప్రొటెక్టెంట్ స్ప్రేలను ఉపయోగించడం ద్వారా మీ జుట్టును రక్షించండి. గాలి,కాలుష్యం నుండి రక్షించడానికి జుట్టును పైకి కట్టడం వంటివి చేయండి.
– టైట్ హెయిర్‌స్టైల్స్‌ను నివారించండి:
టైట్ గా ఉండే పోనీటెయిల్స్ లేదా జడలు వంటి హెయిర్‌స్టైల్స్ కాలక్రమేణా జుట్టు తెగిపోవడానికి, చిట్లిపోవడానికి కారణమవుతాయి. వదులుగా ఉండే స్టైల్స్‌ను ఎంచుకోండి.
సంబంధిత కథనం