




Best Web Hosting Provider In India 2024

సూర్యాపేట జంక్షన్ మూవీ రివ్యూ – ప్రభుత్వ ఉచిత పథకాలపై మెసేజ్ – తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తెలుగు మూవీ సూర్యాపేట జంక్షన్ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన మూవీ సూర్యాపేట్ జంక్షన్. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ హీరోగా నటించాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
ఇంజినీరింగ్ స్టూడెంట్ కథ…
అర్జున్ (ఈశ్వర్) ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్. తన నలుగురు స్నేహితులతో కలిసి ఎలాంటి బరువుబాధ్యతలు లేకుండా జాలాయిగా తిరుగుతుంటాడు. దాబా నడిపే జ్యోతి (నైనా సర్వర్)తో అర్జున్ ప్రేమలో పడతాడు. నరసింహా (అభిమన్యు సింగ్) ఓ పొలిటికల్ లీడర్. ఎమ్మెల్యే కావాలని కలలు కంటుంటాడు, పేదల ఓట్ల కోసం ఉచితాల పథకాల పేరుతో ఓ కుట్రను పన్నుతాడు.
అదే టైమ్‌లో అర్జున్ స్నేహితుడైన శీను హత్యకు గురవుతాడు. శీనును ఎవరు చంపారు? ఈ మర్డర్ వెనకున్న మిస్టరీని అర్జున్ ఎలా ఛేదించాడు? శీను హత్యకు నరసింహాకు ఉన్న సంబంధమేమిటి? తనకంటే ఎన్నో రెట్లు బలవంతుడైన నరసింహాతో అర్జున్ ఎలాంటి పోరాటం చేశాడు? వారి మధ్య వైరానికి ఓ బావికి ఉన్న సంబంధం ఏమిటి? అర్జున్‌ను జ్యోతి ప్రేమించిందా? అన్నదే ఈ మూవీ కథ.
ఉచిత పథకాలు…
ఉచితాల పేరుతో ప్రభుత్వాలు ప్రవేశపెడుతోన్న పథకాలు ప్రజలకు ఎలాంటి నష్టాలను కలిగించాయనే కాన్సెప్ట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు రాజేష్ నాదెండ్ల ఈ మూవీని తెరకెక్కించారు. ఈ పథకాల వెనకున్న మంచితో పాటు చెడును ఈ మూవీలో టచ్ చేశాడు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పాటు స్నేహం, ప్రేమ లాంటి అంశాలను టచ్ చేస్తూ హీరో ఈశ్వర్ ఈ మూవీ కథను రాశారు. .
హీరో వన్ సైడ్ లవ్…
ఫస్ట్ హాఫ్ హీరో అండ్ గ్యాంగ్ చేసే అల్లరి పనులు, హీరోయిన్‌తో హీరో వన్‌సైడ్ లవ్‌తో సరదాగా సినిమా సాగిపోతుంటుంది. యూత్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా పెద్దగా కంప్లైంట్స్ ఏం లేకుండా కామెడీతో టైమ్‌పాస్ చేశాడు డైరెక్టర్. మరోవైపు ఎమ్మెల్యే కావాలని నరసింహం వేసే రాజకీయ ఎత్తుగడలను చూపించారు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే మలుపు ఆకట్టుకుంటుంది. తన స్నేహితుడి హత్య గురించి హీరో సాగించిన అన్వేషణతో ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ థ్రిల్లింగ్‌గా సెకండాఫ్ సాగుతుంది. క్లైమాక్స్‌లో సమకాలీన రాజకీయాలకు సంబంధించి ఓ మెసేజ్ ఇస్తూ గా సినిమాను ఎండ్ చేశారు.
తడబాటు…
సూర్యాపేట జంక్షన్ మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌ను కన్వీన్సింగ్‌గా చెప్పడంలో దర్శకుడు తడబడినట్లుగా అనిపిస్తుంది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ సంబంధం లేకుండా కథలో బలవంతంగా ఇరికించిన భావన కలుగుతుంది.
గ్లామర్ ప్లస్ పాయింట్…
మాస్ రోల్‌లో ఈశ్వర్ నటన బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు.
జ్యోతి పాత్రలో నైనా సర్వర్ గ్లామర్‌తోనే ఆకట్టుకుంటుంది. విలన్‌గా అభిమన్యు సింగ్ రోల్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. విలనిజంతోనే కొన్ని చోట్ట భయపెట్టాడు. చమ్మక్ చంద్ర, చలాకీ చంటి కామెడీ కొంత వరకు వర్కవుట్ అయ్యింది. రోషన్ సాలూరి, గౌర హరి పాటలు, బీజీఎమ్ పర్వాలేదనిపిస్తాయి. మ్యాచింగ్ మ్యాచింగ్ పాట మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది.
థ్రిల్లర్ మూవీస్…
పొలిటికల్ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే ఆడియెన్స్‌ను సూర్యాపేట జంక్షన్ మెప్పిస్తుంది. సినిమాలోని మెసేజ్ ఆలోచింపజేస్తుంది.
రేటింగ్: 2.5/5